Just In
- 32 min ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 1 hr ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 16 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 16 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
Don't Miss
- News
రూ.40 లక్షలు బిల్.. స్టార్ హోటల్లో రాజసం, లగ్జరీ కార్లు.. ఇదీ కిలేడీ కహానీ
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Movies
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?
సాధారణంగా అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు. ఈ ప్రమాదాలు ప్రజలను అనుకోని ఇబ్బందుల్లోకి నెడతాయి. ఈ విధంగా ఊహించని ప్రమాదాలు ఎదురైన చాలా సంఘటనలు మీరు చూసే వుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఒక ప్రమాదం సంభవించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car1-1613706978.jpg.pagespeed.ic.0YTA7y6Ktt.jpg)
పాములు సాధారణంగా అధిక తడి ప్రదేశాలలో నివసిస్తాయి. తడి ప్రదేశాలలో వాటికి పుష్కలంగా ఆహారం లభిస్తుంది. పాములు నీటిలో మాత్రమే కాకుండా, పొడి ప్రదేశాలలో, రాతి బండరాళ్ల మధ్య మొదలైన ప్రాంతాలలో కనిపిస్తాయి. అంతే కాదు ఇది కొన్నిసార్లు నివాస ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car2-1613706986.jpg.pagespeed.ic.jAPUMIIF2m.jpg)
పాములు నివాసాలలోకి చొరబడినప్పుడు అక్కడ వాటికి అనుకూలంగా ఒక స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. అంటే ఇవి ఉపయోగించకుండా వుండే వాహనాల్లో చేరి నిచ్చింతగా ఉంటాయి. వాహనంలోకి ప్రవేశించడం అనేది అరుదుగా జరుగుతుంది.
MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car3-1613706996.jpg.pagespeed.ic.Bvrx-YWd11.jpg)
ఇటీవల ప్రయాణంలో ఉన్న ఒక కారు ముందు భాగంలో అనుకోకుండా ఒక పాము ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ వెబ్ సైట్ లో హల్ చల్ చేస్తుంది. వాహనంలోకి ప్రవేశించే పాములు సాధారణంగా ఇంజిన్ లేదా ఇతర వెచ్చని ప్రదేశాలలో ఉంటాయి. కానీ వీడియోలోని పాము బోనెట్ నుండి బయటకు వచ్చి కారు యొక్క ముందు గ్లాస్ పై కొట్టుమిట్టాడుతోంది.
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car5-1613707015.jpg.pagespeed.ic.P6clAx9KxJ.jpg)
కారు నుండి పామును ఎలా బయటకు తీయాలో తెలియక, వైపర్ ఆన్ చేసి దానిని అక్కడ నుంచి తొలగించడానికి వాహనదారుడు ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. వైపర్ కదలటం వల్ల పాము మరింత ముందుకు వచ్చింది. పాము అప్పుడు కారులోని ఇతర భాగాలకు కదులుతున్నట్లు చూడవచ్చు.
MOST READ:డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car6-1613707024.jpg.pagespeed.ic.mpGImy1BTC.jpg)
20 సెకన్ల వీడియో చూసేవారికి కొంత భయాన్ని కల్పిస్తుంది. కారు లోపల ఉన్నవారు కారు డ్రైవ్ చేస్తూ పామును తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ భయానక సంఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలిసింది. మెలిస్సా హడ్సన్ మరియు రోడ్నీ గ్రిగ్స్ ఈ కారును డ్రైవ్ చేస్తున్నారు. కొరియర్-మెయిల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పామును చూడగానే మేము కారు నుండి బయటపడాలని అనుకున్నాము. అయితే పాము కారులోకి వస్తుందనే భయం మమ్మల్ని బయటకు రాకుండా అడ్డుకుంది. ఈ కారణంగానే మేము వైపర్ ద్వారా పామును తొలగించడానికి ప్రయత్నించాము.
MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు
![కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము [వీడియో]](/img/2021/02/xsnake-on-moving-car9-1613707049.jpg.pagespeed.ic.0xryFPPufQ.jpg)
పాములు వాహనాల్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. వాహనాలు ఉపయోగించకుండా అలాగే విడిచిపెట్టకూడదు. అంతే కాకుండా దట్టమైన పొదలు మరియు పొదలతో ఉన్న ప్రదేశాల సమీపంలో వాహనాలను ఆపడం మంచిది కాదు. చుట్టూ విశాలంగా ఉంటేవిధంగా మరియు సేఫ్ అనుకున్న ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేయడా వల్ల విష సర్పాలు మొదలైనవి రాకుండా నిరోధించవచ్చు.