సోలార్ రోడ్స్ - స్ట్రీట్స్‌కే కాకుండా స్టేట్స్‌కి సైతం పవర్ గ్యారంటీ!

By Ravi

మనకు స్వచ్ఛందంగా లభించే వనరులలో సౌరశక్తి కూడా ఒకటి. ఇప్పటికే అనేక రంగాలలో సౌరశక్తిని విజయవంతంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసినదే. ఆటోమొబైల్ రంగంలో కూడా ఫ్యాక్టరీల నిర్మాణంలోను, విద్యుత్ కార్ల తయారీలోను మరియు సౌరశక్తితో నడిచే కార్ల తయారీలోను సోలార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

అయితే, తాజాగా రోడ్ల నిర్మాణంలో కూడా సోలార్ టెక్నాలజీని ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన సోలార్ రోడ్‌వేస్ అనే కంపెనీ మామూలు రోడ్లను సోలార్ రోడ్లుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని రోడ్లన్నింటినీ సోలార్ రోడ్లుగా మార్చేస్తే, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తితో వీది దీపాలను వెలిగించడంతో పాటుగా, మిగిలిన విద్యత్తును అమెరికా మొత్తం ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సోలార్ రోడ్స్

సోలార్ రోడ్‌వేస్ రోడ్డు నిర్మాణ రంగంలోనే ఓ విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. ఇందులో హెక్సాగనల్ ఆకారంలో ఉండే సోలార్ ప్యానెళ్లను ధృడమైన నాన్-బ్రేకల్ గ్లాస్ క్రింది భాగంలో అమర్చుతారు. ఇలా అమర్చిన సోలార్ ప్యానెళ్లను రోడ్డుపై పరుస్తారు.

సోలార్ రోడ్స్

ఈ సోలార్ ప్యానెళ్లన్నీ ఎల్ఈడి లైట్లతో తయారు చేయబడి ఉంటాయి. ఇవి సూర్యకాంతిని గ్రహించి, ఎల్ఈడి లైట్లను ప్రకాశింపజేస్తూ వాహనా చాలకులకు వివిధ అదేశాలను అందిస్తూ దిశానిర్దేశకం చేస్తాయి.

సోలార్ రోడ్స్

కేవలం రోడ్లే కాకుండా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ వద్ద పార్కింగ్ స్థలాన్ని కూడా సోలార్ ప్యానెళ్లతో నిర్మించినట్లయితే, ఆ ప్యానెళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తి సదరు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఉపయోగించుకొని, రెగ్యులర్ విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు.

సోలార్ రోడ్స్

సోలార్ రోడ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాల్లో పనిచేసే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఉదాహరణకు శీతాకాలంలో రోడ్లపై మంచు పేరుకుపోయినప్పుడు, ఆ మంచును తొలగించేందుకు వేరే వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఈ సోలార్ రోడ్ల సాయంతో కరిగించేవయచ్చు. ఈ సోలార్ రోడ్లు గ్లాస్ ఉపరితలాన్ని వేడిగా చేసి మంచును కరిరిగిస్తాయి.

సోలార్ రోడ్స్

సోలార్ ప్యానెల్స్ పైభాగంలో ఉపయోగించే గ్లాస్ ఉపరితలం చాలా ధృడంగా ఉంటుంది. ఈ గ్లాస్ సర్ఫేస్‌ను ఇప్పటికే దశంలోని ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ ల్యాబోరేటరీలలో ట్రాక్షన్ టెస్ట్, లోడ్ టెస్ట్, ఇంపాక్ట్ రెసిస్టెన్స్ టెస్ట్‌ను చేశారు.

సోలార్ రోడ్స్

బాగుంది కదా.. ఈ సోలార్ రోడ్ టెక్నాలజీ. మనదేశంలో కూడా ఇలాంటి సోలార్ రోడ్లు అందుబాటులోకి వస్తే, కరెంట కోతల సమస్య తగ్గుతుందేమో.. మీరేమంటారు..?

Most Read Articles

Story first published: Saturday, May 24, 2014, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X