భారత్‌కు రానున్న జపనీస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ!

By Ravi

మెరుపు వేగంతో దూసుకువెళ్లే బుల్లెట్ ట్రైన్లు మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. జపనీస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని భారతదేశంలో హై స్పీడ్ రైల్వే వ్యవస్థను నిర్మించాలని మన సర్కారు భావిస్తోంది. భారత్‌లో ఈ తరహా హై స్పీడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జపాన్ ప్రదాన మంచ్రి షింజో అబేలు ఉమ్మడిగా ప్రకటన చేశారు.

ఈ మేరకు ఇరు వర్గాలు 424 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో 71 బిలియన్ డాలర్లను ముంబై మెంట్రో లైన్-3 ప్రాజెక్ట్ కోసం, మిగిలిన మొత్తాన్ని మరో ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణం కోసం వినియోగించనున్నారు. భారత్‌లో హై స్పీడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న జపాన్ ఆసక్తిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆహ్వానించారు. బుల్లెట్ ట్రైన్ల నిర్మాణంలో జపాన్ సాంకేతికతను ఆయన కొనయాడారు.

భారత్‌లోని మౌళికసదుపాయాలు, వాణిజ్య ఖర్చులు మరియు ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకొని ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తామని సింగ్ తెలిపారు. ముంబై-అహ్మాదాబాద్ రూట్లో హై స్పీడ్ రైల్వే సిస్టమ్‌ను ఏర్పాటు చేసే అంసంపై ఉమ్మడి అధ్యయనం చేసేందుకు రు వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకు అయ్యే ఖర్చును ఇరు వర్గాలు భరించనున్నాయి. ముంబై-అహ్మదాబాద్ ట్రైన్ రూట్ దాదాపు 500 కిలోమీటర్ల మేర ఉంది.

ఈ పొడవుకు హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మించాలంటే ఒక ట్రిలియన్ యెన్‌లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ఢిల్లీ ముంబై రూట్లో ఉన్న ప్యాసింజర్ ట్రైన్ల స్పీడ్‌ను అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రూట్లో ట్రైన్ స్పీడ్ గంటకు 160 కి.మీ.గా ఉంది. ఈ వేగాన్ని గంటకు 200 కి.మీ. లకు పెంచాలని (సెమీ-హై స్పీడ్ రైల్వే సిస్టమ్) ప్రతిపాదిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన తుది నివేదిక త్వరలోనే వెల్లడయ్యే ఆస్కారం ఉంది.

Bullet Train
Most Read Articles

English summary
India is set to benefit from the famed Japanese bullet train technology, with Tokyo pledging to invest heavily in building high speed railway systems in the country. Prime Minister Manmohan Singh and his Japanese counterpart Shinzo Abe issued a joint statement on Wednesday in which they laid down the course of co-operation between the two countries on setting up high speed railway systems in India.
Story first published: Thursday, May 30, 2013, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X