YouTube

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (spicejet) తమ పైలట్లకు భారీ షాక్ ఇచ్చింది. ఖర్చులు తగ్గించుకునేందుకు తమ సంస్థకు చెందిన 80 మంది పైలట్లకు 3 నెలల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మూడు నెలలో సెలవుల సమయంలో పైలట్లు జీతాలు ఇవ్వలేమని, కానీ ఉద్యోగి ప్రయోజనాలను మాత్రం అందిస్తామని స్పెస్‌జెట్ విమానయాన సంస్థ ప్రకటించింది. బోయింగ్, బాంబార్డియర్ క్యూ400కి చెందిన 80 మంది పైలట్లకు 3 నెలల పాటు కంపెనీ సెలవులను ప్రకటించింది.

అయితే, ఖర్చులను హేతుబద్ధీకరించడానికి ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తెలిపింది. దాదాపు 80 మంది పైలట్‌లను మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవులో ఉంచాలని నిర్ణయించామని, ఈ సమయంలో పైలట్‌లు బీమా ప్రయోజనాలు మరియు ఇతర అన్ని ఇతర ఉద్యోగుల ప్రయోజనాలకు అర్హులుగా ఉంటారని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ ఏ ఉద్యోగిని ఉద్యోగం నుండి శాస్వతంగా తొలగించకుండా, ఈ చర్యను తీసుకున్నట్లు కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

స్పైస్‌జెట్ సంస్థ గడిచిన నాలుగేళ్లుగా తీవ్ర నష్టాలను ఎదుర్కుంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో పైలట్లకు జీతాలను ఇవ్వలేమని ప్రకటించింది. పైలట్లకు బుధవారం నుంచే ఈ సెలవులు ​ అమలవుతాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, ప్రయాణీకులు లేని కారణంగా విమాన సర్వీస్‌‌‌‌లు చాలా వరకూ తగ్గిపోయాయని, తమ సంస్థలో ఎక్కువ మంది అదనపు పైలట్లు ఉన్నారని, వారిని మాత్రమే సెలవుపై పంపించామని స్పైస్‌జెట్ తెలిపింది.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

ఖర్చులు తగ్గించుకునేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని, ఈ సమయంలో ఏ ఉద్యోగిని శాస్వతంగా తొలగించబోమని, పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత వీరంతా తిరిగి డ్యూటీలోకి వస్తారని వివరణ ఇచ్చింది. గడచిన జూన్​ త్రైమాసికం నాటికి స్పైస్‌జెట్ సంస్థ​ రూ.789 కోట్ల నికర నష్టాన్ని (ఫారెక్స్ సర్దుబాటు మినహా రూ. 420 కోట్లు) నివేదించింది, జూన్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైనందున రూ. 729 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

రికార్డు స్థాయిలో పెరిగిన ఇంధన ధరలు మరియు క్షీణిస్తున్న రూపాయి విలువ కూడా కంపెనీ లాభాలను ప్రభావితం చేసింది. నివేదించబడిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,478 కోట్లుగా ఉంది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,266 కోట్లుగా ఉంది. ఈ సమయంలో నిర్వహణ ఖర్చులు రూ.1,995 కోట్ల నుంచి రూ.3,267 కోట్లకు పెరిగాయి. కాగా, EBITDA ప్రాతిపదికన, జూన్ FY2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 244 కోట్ల నష్టం నుండి నివేదించబడిన త్రైమాసికానికి నష్టం రూ. 379 కోట్లుగా ఉంది.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

స్పైస్‌జెట్ 2019లో 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండింగ్ తర్వాత 30కి పైగా విమానాలను తమ లైనప్‌లో చేర్చుకుంది. మ్యాక్స్ త్వరలో తిరిగి సేవలోకి వస్తుందనే ఆశతో ఎయిర్‌లైన్ దాని ప్రణాళికాబద్ధమైన పైలట్ ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను కొనసాగించింది. అయినప్పటికీ, మ్యాక్స్ ఫ్లీట్ యొక్క సుదీర్ఘ గ్రౌండింగ్ ఫలితంగా స్పైస్‌జెట్‌లో అధిక సంఖ్యలో పైలట్‌లు ఖాలీగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో, కంపెనీ వారిని ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడంతో నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో వారిని 3 నెలల పాటు జీతం లేకుండా సెలవులపై ఇంటికి పంపించింది.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

ఈ విషయం గురించి స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. "మేము త్వరలో MAX విమానాలను ప్రవేశపెడతాము మరియు ఇండక్షన్ ప్రారంభమైనప్పుడు ఈ పైలట్‌లు తిరిగి సేవలోకి వస్తారు. ఎల్‌డబ్ల్యుపి వ్యవధిలో, పైలట్‌లకు వర్తించే అన్ని ఇతర ఉద్యోగుల ప్రయోజనాలకు వారు అర్హులుగా ఉంటారు, అంటే అన్ని ఎంచుకున్న బీమా ప్రయోజనాలు మరియు ఉద్యోగి సెలవు ప్రయాణాలకు అర్హులుగా ఉంటారని" చెప్పారు.

3 నెలలు జీతాల్లేవ్.. ఇళ్ళలోనే కూర్చోండి.. 80 మంది పైలట్లకు షాక్ ఇచ్చిన స్పైస్‌జెట్..

ఈ విధంగా కొంతమంది పైలట్లను వేతనం లేకుండా సెలవులో ఉంచిన తర్వాత కూడా, స్పైస్‌జెట్ విమానాలపై DGCA పరిమితి ఎత్తివేయబడినప్పుడు మరియు దాని పూర్తి షెడ్యూల్‌ను నిర్వహించడానికి తగిన సంఖ్యలో పైలట్‌లను కలిగి ఉంటుందని ఎయిర్‌లైన్ ఏజెన్సీ తెలిపింది. సాంకేతిక లోపాల కారణంగా డీజీసీఏ ఆదేశాలతో స్పైస్‌‌‌‌‌జెట్‌‌‌‌ తనకున్న మొత్తం 90 విమానాల్లో 50 విమానాలను నడుపుతోంది. అక్టోబర్​ 29, 2022 వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని డీజీసీఏ తెలిపింది. కాగా, ఎయిర్‌లైన్ తన నెట్‌వర్క్‌కు కొత్త గమ్యస్థానాలను జోడించడం మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

Most Read Articles

English summary
Spicejet sends 80 pilots home on leave with no pay for 3 months but will continue to provide employe
Story first published: Friday, September 23, 2022, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X