ఆయన లేరు... ఆయన జ్ఞాపకాలే మిగిలాయి....!!

నేతాజీ గారి తరపున మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే... అందులో ఒకటి ఈ కారు. పునరుద్దరించబడిన నేతాజీ సుభాష్ చంద్రబోష్ కారును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆవిష్కరించారు.

By Anil

నేతాజీ ఈ పేరు తెలియని ఇండియన్ అంటూ ఉండరు... స్వాతంత్ర్య పోరుల్లో తప్పిపోయిన నేతాజీ గారు ఎప్పుడు మరణించారు అనేది కూడా అంతులేకుండాపోయింది. అయన ఉన్నారో లేరో అనే సంశయంలో నుండి బయటకు వస్తే. ఆయన తరపున మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే... అందులో ఒకటి ఈ కారు. పునరుద్దరించబడిన నేతాజీ సుభాష్ చంద్రబోష్ కారును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆవిష్కరించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

సుభాష్ చంద్రబోష్ గారు వినియోగించిన కారును కలకత్తాలోని ఆడి డీలర్‌షిప్ ఒకటి పునరుద్దరించింది. ఈ పునరుద్దరించబడి కారును ప్రణబ్ ముఖర్జీ గారు ఆవిష్కరించారు. ఇప్పుడు దీనిని కలకత్తాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

1941 ఏడాదిలో బ్రిటీషర్ల ఆధీనంలో బంధీగా ఉన్నపుడు పారిపోవడకానికి వాండరర్ డబ్ల్యూ24 సెడాన్ కారును ఉపయోగించాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

చరిత్ర ప్రకారం కలకత్తాలోని అప్పటి బ్రిటీష్ పాలకుల ఇంటి నుండి జార్ఖండ్ లోని గోమో రైల్వే స్టేషన్ వరకు నడిపినట్లు తెలిసింది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నేతాజీ గారు పారిపోయి 76 సంవత్సరాలు మరియు నేతాజీ రీసెర్చ్ బ్యూరో ప్రారంభించబడి 60 వసంతాలు పూర్తయినందుకు గాను ఆడి డీలర్ చేత పునరుద్దరించబడిన ఈ వాండరర్ డబ్ల్యూ 24 సెడాన్ కారును ప్రజా ప్రదర్శనకు ఉంచారు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

నిజానికి వాండరర్ అనునది ఒక స్వతంత్ర వాహన తయారీ సంస్థ, జర్మనీలోరి ఆటో యూనియన్ గ్రూపులో ఒకటిగా ఉండేది. అప్పట్లో వాండర్ సంస్థ హార్ష్, డికెడబ్ల్యూ మరియు అడి కి చెందిన కొన్ని కార్లను వాండరర్ ఉత్పత్తి చేసేది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

వాండరర్ ఉత్పత్తి చేసిన చాలా వరకు కార్ల మీద ఆడి బ్రాండ్ చిహ్నం ఉండేది. ఇలాంటి కార్లు ఎక్కువగా రెండవ ప్రపంచ యుద్ద కాలంలో అందుబాటులో ఉండేవి.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

భారత దేశపు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోష్ బ్రిటీషర్ల బంధీ నుండి విముక్తి కోసం తప్పించుకుని కలకత్తా నుండి ఢిల్లీగా పారిపోవడానికి ప్రయత్నించిన సందర్భంలో దీనిని వినియోగించాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

సుభాష్ చంద్రబోష్ సోదరుడు సిసిర్ బోస్ ఇందుకు సహకరించాడు. అయితే మార్గమధ్యలో సుభాష్ చంద్ర బోస్ జార్ఖండ్ లోని గోమో రైల్వేస్టేషన్లో దిగిపోయినట్లు చరిత్రలో ఉంది.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

తరువాత కాలంలో ఈ వాండరర్ డబ్ల్యూ24 కారును సిసిర్ బోస్ వినియోగించాడు. ఇప్పుడు సిసిర్ బోస్ కుమారుడు సుగతా బోస్ నేతాజీ రీసెర్చ్ బ్యూరో లో ఆ కారును భద్రపరిచాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఉపయోగించిన కారు

మరిన్ని సెలబ్రిటీ కార్లు , విమానాలు మరియునౌకలకు సంభందించిన ఆసక్తికరమైన కథనాలను తెలుగు చదవండి.....

Most Read Articles

English summary
Subhash Chandra Bose’s Car Restored; Unveiled By President Pranab Mukherjee
Story first published: Saturday, January 21, 2017, 13:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X