ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం: యుద్ద విమానాలను కూడా ల్యాండ్ చేయవచ్చు

Written By:

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ని నేడు ములాయంసింగ్ 78 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకుల మిగతా ఇతర జాతీయ రహదారుల వలె సాదారమైనది కాదు. ఎందుకంటే ఈ రహదారి ప్రారంభత్సవ వేడుకల్లో సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ మరియు మిరేజ్ 2000 యుద్ద విమానాలు కూడా పొల్గొన్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఈ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే కేవలం వాహనాలు తిరగడానికి మాత్రమే కాదు. అత్యవసర పరిస్థితుల్లో యుద్ద విమానాలను కూడా ల్యాండ చేయవచ్చు. అంటే యుద్ద విమానాలు వీటిని రన్ వే లుగా వాడుకోవచ్చన్నమాట.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

బారియల్లీ త్రిషూల్ మరియు గ్వాలియర్ యుద్ద విమానాల సైనిక స్థావరం నుండి మొత్తం 11 యుద్ద విమానాలు నేటి (నవంబర్ 21, 2016) ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే రహదారి ప్రారంభోత్సవంలో పాల్గొన్నాయి.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి తెలిపిన వివరాల మేరకు మొత్తం ఎనిమిది విమానాలు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యి తరువాత టేకాఫ్ తీసుకున్నాయి మరియు సరిగ్గా మూడు విమానాలు రహదారి ప్రారంభ సమయంలో గాలిలోనే చక్కర్లు కొట్టాయి.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఉత్తర ప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలైన ఆగ్రా-లక్నో మధ్య ఉన్న జాతీయ రహదారి మీద అత్యవసర సమయంలో యుద్ద విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్ లకు ఉన్న అనుకూలతలను పరీక్షించడానికి కొన్ని యుద్ద విమానాల ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావించారు. అయితే ఈ రహదారి ప్రారంభోత్సవం త్వరలో జరుగుతున్నందున అదే రోజున ట్రయల్ రన్ నిర్వహించాలను భావించారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని అతి తక్కువ కాలవ్యవధి కేవలం 22 నెలల్లోపు నిర్మించారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

సుమారుగా 13,200 కోట్ల రుపాయల నిధులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టని ఈ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే రహదారి పొడవు 302 కిలోమీటర్లుగా ఉంది. డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో వాహనరాకపోకలకు అనుమతివ్వనున్నారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

గత సంవత్సరం మే మాసంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా ఫ్రెంచ్ దస్సాల్ట్ మిరేజ్-2000 యుద్ద విమానాన్ని ఉత్తర ప్రదేశ్ లోని మథుర జిల్లాలో ఉన్న రాయ గ్రామానికి సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద యుద్ద విమానాలను ల్యాండింగ్ మరియు టేకాఫ్ చేసి, ఆర్మీ ఆపరేషన్లకు ఉన్న సాధ్యాసాద్యాలను పరీక్షించారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఇతర దేశాలతో భూబాగపు సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల మీద యుద్ద విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్ లకు వీలయ్యే విధంగా పరీక్షలు చేస్తోంది ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో యుద్ద విమానాల ద్వారా సైన్యం స్వల్ప కాలంలోనే ఆ ప్రదేశాలను చేరుకోవచ్చు.

దస్సాల్ట్ మిరేజ్ 2000 యుద్ద విమానం గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు..

దస్సాల్ట్ మిరేజ్ 2000 యుద్ద విమానం గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు..

ఫ్రెంచ్ కు చెందిన ప్రముఖ గగన విహంగాల తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ ఈ మిరేజ్ యుద్ద వాహనాన్ని అభివృద్ది చేసింది. వీటిని 1978 లో పూర్తి స్థాయిలో తయారు చేసింది. తరువాత 1982 నవంబరులో ప్రపంచానికి పరిచయం చేసింది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ఈ మల్టీ రోల్ లైట్ వెయిట్ యుద్ద విమానాన్ని అనతి కాలంలోనే ప్రపంచ దిగ్గజ దేశాలు తమ వాయు ధళంలోకి ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ విమానాలు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వంటి వాటిలో భాగంగా ఉంది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ మిరేజ్ 2000 యుద్ద విమానాలను 1978 నుండి 2007 వరకు ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు సుమారుగా 601 యుద్ద విమానాలు వివిధ దేశాలలోని వాయు ధళాలలో సేవలందిస్తున్నాయి.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ప్రస్తుతం మిరేజ్ యుద్ద విమానాలు సింగల్ సీట్ మరియు 2-సీటింగ్ కెపాసిటితో దస్సాల్ట్ మిరేజ్ 2000ఎన్ మరియు దస్సాల్ట్ మిరేజ్ 200డి అనే వేరియంట్లతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో అంతర్గత ఇంధన స్టోరేజి సామర్థ్యం గరిష్టంగా 3,978 లీటర్ల వరకు ఉంది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ప్రాథమికంగా ఈ మిరేజ్ యుద్ద విమానాల్లో SNECMA M53 అనే ఆఫ్టర్ బర్నింగ్ టుర్బోఫ్యాన్ అనే ఇంజన్ ను పరిచయం చేసింది. తరువాత SNECMA M53 - p2 వర్షన్ ఇంజన్‌ను అభివృద్ది చేశారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

దస్సాల్ట్ మిరేజ్ 2000 యుద్ద విమానం యొక్క గరిష్టం వేగం గంటకు 2,336 కిలోమీటర్లుగా ఉంది. మరియు ఒక్క విమానం సుమారుగా 6,300 కిలోల బరువును మోసుకెళుతుంది.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద మొత్తం 49 మిరేజ్ 2000 శ్రేణి విమానాలు ఉన్నాయి. అందులో సింగల్ సీటింగ్ సామర్థ్యం ఉన్న 42 మరియు ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉన్నవి 7 ఉన్నాయి.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే

గతంలో 2004 ఏడాదిలో పది దస్సాల్ట్ మిరేజ్ 2000హెచ్ఎస్ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఒక్కో మిరేజ్ 2000 యుద్ద విమానం ధర సుమారుగా 23 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

 
English summary
Sukhoi Mirage Fighters To Be Part Of Agra Lucknow Expressway Inauguration
Story first published: Monday, November 21, 2016, 17:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos