సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

Written By:

18 వ ఏట రూ. 20,000 లతో బిజినెస్ ప్రారంభించిన సునీల్ భారతీ మిట్టల్ భారతీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ స్థాపించి నేడు 16 సంస్థలకు అధిపతి అయ్యాడు. స్వశక్తితో ఎదిగి ఇప్పుడు దేశీయ ప్రధాన వ్యాపార రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్ మిట్టల్.

స్వయం కృషితో ఎదిగిన సునీల్ మిట్టల్ ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఈయన సక్సెస్ స్టోరీతో పాటు ఇతను ఎలాంటి కారును ఉపయోగిస్తున్నాడో చూద్దాం రండి...

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

అతి పిన్న వయస్సులో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అందివచ్చిన అనేక వ్యాపార అవకాశాలను చేజిక్కించుకుంటూ అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చారు. టెలికాం, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హోటల్, వ్యవసాయం, ఆహారం వంటి రంగాలలో 16 సంస్థలను స్థాపించారు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే 1976 ఏప్రిల్‌లో తన 18 వ ఏట 20 వేల రుపాయల పెట్టుబడితో సైకిళ్ల తయారీ సంస్థకు విడి భాగాలు(క్రాంక్ షాఫ్ట్) తయారు చేసి, సప్లై చేసే వ్యాపారం ప్రారంభించాడు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

అనతి కాలంలో వ్యాపారాన్ని వృద్ది చేసి, తన ఇద్దరు అన్నదమ్ములైన రాకేష్ భారతీ మిట్టల్ మరియు రాజన్ భారతీ మిట్టల్ ను భాగస్వామ్యంగా చేసుకుని భారతీ ఓవర్‌సీస్ ట్రేడింగ్ అనే దిగుమతులకు చెందిన కంపెనీ ప్రారంభించాడు. సైకిళ్ల విడి భాగాలు తయారు చేస్తూనే నూలు పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

విద్యుత్ లేని సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పోర్టబుల్ జనరేటర్లను ఇండియాలో విక్రయించడానికి వచ్చిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్స్ ప్రతినిధులతో సునీల్ మిట్టల్ ఒప్పందం కుదుర్చుకుని 1980 దశకంలో మంచి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే విదేశీ ఉత్పత్తుల దిగుమతి బ్యాన్ కారణంగా ఆ వ్యాపారానికి అంతటితో ముగింపు పలికాడు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

జనరేటర్ల దిగుమతి రద్దు కావడంతో అంతటి ఆగిపోలేదు సునీల్ మిట్టల్, తరువాత ఎదురయ్యే మార్కెట్ అవకాశాల కోసం వేచి చూశాడు. తైవాన్ పర్యనటకు వెళ్లిన సునీ‌ల్‌కు అక్కడ బటన్లను నొక్కే ల్యాండ్ ఫోన్లు కనబడ్డాయి. అయితే అప్పటికీ ఇండియాలో రోటరీ డయల్ ప్యాడ్(గుండ్రంగా తిప్పే) ఉన్న ల్యాండ్ ఫోన్లే ఉండేవి. అయితే తైవాన్ నుండి విడి పరికరాలు దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసుకుని విక్రయించాలని భావించినా, విదేశీ వస్తు దిగుమతి రద్దు అంశం మళ్లీ అడ్డువచ్చింది.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

విదేశీ ఉత్పత్తుల వ్యాపారానికి స్వస్తి పలికి, భారతీ టెలికాం లిమిటెడ్ స్థాపించి జర్మనీకి చెందిన సైమన్స్ సహకారంతో ఎలక్ట్రిక్ పుష్ బటన్ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించాడు. ప్రసిద్దిగాంచిన బీటిల్ ఫోన్లను ఉత్పత్తి చేసిన భారతీ టెలికాం లిమిటెడ్ అప్పట్లో ఫ్యాక్స్ మెషిన్లను కూడా ఉత్పత్తి చేసింది.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

ఫోన్ల తయారీ నుండి టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు 1992లో ఢిల్లీ సెల్ల్యూలార్ లైసెన్స్‌ను వేలం వేసినపుడు చాకచక్యంగా టెండర్ సొంతం చేసుకున్నాడు సునీల్ మిట్టల్. 1995లో ఢిల్లీలో భారతీ సెల్ల్యూలార్ లిమిటెడ్ స్థాపించాడు. కొంతకాలానికి ఎయిర్‌టెల్ అనే పేరును పెట్టాడు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది వినియోగదారులతో భారత దేశపు అతి పెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించింది.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

సునీల్ భారతీ మిట్టల్ స్థాపించిన ఎయిర్‌టెల్ భారత మొదటి మరియు ప్రపంచ మూడవ అతి పెద్ద టెలికాం సంస్థగా అవతరించి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20 దేశాల్లో దాదాపుగా 300 మిలియన్ ప్రజలకు టెలికాం సేవలందిస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ 14.75 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

సునీల్ మిట్టల్ స్థాపించిన భారతీ ఎంటర్‌ప్రైజస్‌లో భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ టవర్స్, భారతీ రియాలిటీ, భారతీ అక్సా లైఫ్ ఇన్సూరెన్స్, ఫీల్డ్ ఫ్రెష్, గార్మెంట్ ఇన్‌వెస్ట్‌మెంట్, సెంటమ్ లెర్నింగ్, హైక్ గ్లోబల్ లిమిటెడ్, ఎస్‌బి ఎనర్జీ, బీటెల్, ఎయిర్‌టెల్ ఆఫ్రికా మరియు సౌత్ ఏసియా, ఎయిర్‌టెల్ జెర్సీ మరియు గర్న్సీ, ఎమ్‌టెల్, వన్‌వెబ్ మరియు నోర్లాక్ హాస్పిటాలిటీ వంటి 16 అనుభంద సంస్థలున్నాయి.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

2007 లో పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత సునీల్ భారతీ మిట్టల్ నికర సంపద 780 కోట్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. ధనవంతుల జాబితాలో ఇండియాలో 8 వ మరియు ప్రపంచంలో 198 వ స్థానంలో నిలిచాడు. వేల కోట్ల సంపద కలిగి ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. మరి సునీల్ భారతీ మిట్టల్ ఎలాంటి కారును ఉపయోగిస్తున్నాడో చూద్దాం రండి...

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

వ్యాపారంతో పాటు ఇతనికి మోటార్ స్పోర్ట్స్ కూడా ఇష్టమే, కొన్ని సందర్బాల్లో దేశీయంగా జరిగే మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటూ ఉంటారు. సునీల్ మిట్టల్ తరచూ మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 లగ్జరీ సెడాన్ కారును ఉపయోగిస్తుంటారు. మెర్సిడెస్ అందించే లగ్జరీ ఫీచర్లు ఇందులోనే అత్యధికం.

ప్రత్యేకతలు...

ప్రత్యేకతలు...

దూర ప్రాంత ప్రయాణాలకు ఎంతో అనువైనది, పెద్ద పరిమాణంలో ఉన్న డిస్ల్పేలు, ప్రయాణికుల కోసం వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి. యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్ కలదు. తానంతట తానుగా పార్కింగ్ చేసుకునే సదుపాయం ఈ కారులో ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

న్యావిగేషన్, టెలిఫోన్, ఆడియో, వీడియో, ఇంటర్నెట్ సదుపాయం, ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ మరియు ప్యానరోమిక్ సన్ రూఫ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

సాంకేతికంగా ఇందులో 4663సీసీ సామర్థ్యం గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 453బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. నలుగురు ప్రయాణించే సామర్థ్యం ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 లోని శక్తివంతమైన ఇంజన్, వేగవంతమైన యాక్సిలరేషన్‌ కూడా ఇవ్వగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది. 8-లీటర్ల పెట్రోల్‌తో 100కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

సునీల్ భారతీ మిట్టల్ సక్సెస్ స్టోరీ మరియు కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 లగ్జరీ సెడాన్ ధనవంతుల హోదాకు తగినట్లు రూపొందించబడిన కారు. వీటిని మించిన కార్లు ఇప్పుడు మార్కెట్లో అనేకం ఉన్నాయి. కానీ హోదా మరియు హుందా విషయంలో దీని ప్రత్యేకతే వేరు. అందుకే కాబోలు సునీల్ భారతీ మిట్టల్ గారు వ్యక్తిగతంగా దీనిని ఎంచుకున్నారు.

English summary
Read In Telugu Intresting Facts About Sunil Bharti Mittal And His Car Collection
Story first published: Monday, June 12, 2017, 18:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark