మాసేరాటి మీద మనసు పారేసుకున్న సన్నీ

Written By:

నీలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చెందిన సుందరీమణులలో సన్నీ లియోన్ ఒకరు. బాలీవుడ్ చిత్రసీమలో స్థిరపడిన శృంగార తార సన్నీ లియోన్ వార్తల్లోకొచ్చినా... సినిమాల్లో నటించానా... సోషల్ మీడియాలో మెరిసినా... ప్రతిసారి ఎదో ఒక ప్రత్యేకం.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

కైపెక్కించే కళ్లు, శరీర వంపు సొంపులకో కుర్రకారును ఉర్రూతలూగించే బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ఇండియాలో తెలియని వారుండరు. ఈ శృంగార తారగా ముద్రవేసుకున్న సన్నీకి సినిమాలే కార్లన్నా కూడా పిచ్చి ఇష్టం. సన్నీ ఎంచుకునే కార్లు చూస్తే మాసేరాటి మత్తులో ఉందని ఇట్టే చెప్పేయవచ్చు.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

సన్నీ లియోన్ తాజాగా మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఇదివరకే ఆమె కార్ల జాబితాలో మాసేరాటి కారు ఉంది. ఇప్పుడు మరో కారును ఎంచుకుని తనకు మాసేరాటి కార్లంటే విపరీతమైన ఇష్టమని చెప్పకనే చెప్పింది.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

నలుగురు కూర్చుని ప్రయాణించే లగ్జరీ గ్రాండ్ టూరర్ మరియు పవర్‍‌ఫుల్ మాసేరాటి నెరిస్సిమో కారును అమెరికాలో కొనుగోలు చేసింది. అమెరికాలో దీని ధర 72,000 డాలర్లు(రూ. 47 లక్షలు)గా ఉంది. అక్కడ దీని ఆన్ రోడ్ ధర మన రుపాయల్లో 53 లక్షలు పైమాటే. ఇక ఇండియన్ మార్కెట్లో ఇదే కారు కావాలంటే 1.36 కోట్ల రుపాయలు వెచ్చించాల్సిందే.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

ఇండియన్ వెర్షన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో డీజల్ కారు, అయితే అమెరికన్ వెర్షన్ మోడల్‌లో ట్విన్ టుర్బో పెట్రోల్ వి6 ఇంజన్ కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్‌‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ జడ్ఎఫ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

ఈ కారుకు మరో ప్రత్యేకత ఉంది. మాసేరాటి అమెరికా మరియు కెనడా మార్కెట్లలో కేవలం 450 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా విక్రయిస్తోంది.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో బ్రాండ్ కార్లంటే ఇష్టం. అందాలను అప్పనంగా ఆరబోసే సన్నీకి మాసేరాటి అంటే మహా ఇష్టం. కొన్నేళ్ల క్రితం సన్నీ భర్త లియెనేకు మాసేరాటి క్వాట్రోపోర్తే కారును గిఫ్టుగా ఇచ్చాడు. వీటితో పాటు సన్నీ కార్ల గ్యారేజీలో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కూడా ఉంది.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

మాసేరాటి గిబ్లి నెరిస్సిమో కారులో ఆల్ బ్లాక్ ఎక్ట్సీరియర్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్పోర్టివ్ స్టీరింగ్ వీల్, పడల్ షిఫ్టర్స్, 12 రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న లెథర్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

ఆల్ బ్లాక్ ఇంటీరియర్‌లో గల ఇందులో బ్లైండ్ స్పాట్ మానిటర్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, రిమోట్ కార్ స్టార్టింగ్ సిస్టమ్ కలదు. ఇందులో రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి(345 మరియు 404బిహెచ్‌పి) చేసే 3-లీటర్ల ట్విన్ టర్బో వి6 ఇంజన్ కలదు.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

గిబ్లి నెరిస్సిమోలో ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో కూడా లభిస్తోంది. తక్కువ ఉత్పత్తి చేసే వేరియంట్ రియర్ డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. అయితే, వీటిలో సన్నీ లియోన్ ఏ వేరియంట్‌ను ఎంచుకుందనే విషయం తెలియరాలేదు.

సన్నీ లియోన్ మాసేరాటి గిబ్లి నెరిస్సిమో లగ్జరీ కారు

345Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే వేరియంట్ 5.6 సెకండ్లలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం 265కిమీలుగా ఉంది. అదే విధంగా 404Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే వేరియంట్ 0-100కిమీల వేగాన్ని 4.8 సెకండ్లలోనే చేరుకుంటుంది మరియు గరిష్ట వేగం 282కిమీలుగా ఉంది.

English summary
Read In Telugu: Sunny Leone buys Maserati Ghibli Nerissimo luxury car worth over 1 crore in India
Story first published: Wednesday, October 11, 2017, 12:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark