ఎట్టకేలకు లగ్జరీ కారు కొనుగోలు చేసిన రజనీకాంత్

Written By:

పరిచయం అవసరం లేని పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. సినీ లైఫ్ నుండి రియర్ లైఫ్ వరకు రజనీకాంత్ ఓ గొప్ప నటుడు, అంతే కాదండోయ్ మహా సంపన్నుడు కూడా... అయితే ఈయన నిరాడంబరత ముందు అందరూ వెనక్కితగ్గాల్సిందే. "ఎంత ఎదిగినా ఒదిగి ఉండమనే" నానుడికి అచ్చమైన ఉదాహరణ రజనీకాంత్ గారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

తన జీవితం మొత్తం మీద ఒక్క లగ్జరీ కారు కూడా లేదంటే నమ్మండి. ఇప్పటి వరకు అత్యంత సాధారణ వ్యక్తిగా ఓ ఇన్నోవా కారు మరియు పాత ప్రీమియర్ పద్మిని కార్లలో మాత్రమే ప్రయాణిస్తూ వచ్చాడు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

నాలుగు పచ్చనోట్లు సంపాదిస్తే లగ్జరీ కార్లలో తిరిగే ఎందరో నటీనటులను మనం చూసుంటాం. కానీ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఏ నాడు కోట్లకు కోట్లకు డబ్బులు తగలేసి లగ్జరీ కార్లకు బానిసకాలేదు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

అయితే మొత్తానికి సూపర్ స్టార్ గారు మొదటిసారిగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. గత కొంత కాలం నుండి రజనీ గారు రాజకీయ ప్రవేశం చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాల్లో రజనీకాంత్ గారు తొలిసారిగా లగ్జరీ కారులో ప్రయాణిస్తూ కనబడ్డారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ ఏంటి.... లగ్జరీ కార్లలో ఏంటని ఆరా తీస్తే.... సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశారని తెలిసింది. గత వారంలో అభిమానులతో జరిగిన సదస్సుకు ఆయన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5 లో అభివాదం చేస్తూ వెళ్లారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సినీ, స్పోర్ట్స్ మరియు రాజకీయ రంగాలలో ఉన్న తారలు, ప్రముఖులు మరియు దిగ్గజ వ్యక్తులు అత్యధికంగా ఇష్టపడే లగ్జరీ ఎస్‌యూవీలలో ఎక్స్5 ఒకటి. భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్‌కు ఈ కారంటే ఎంతో ఇష్టం.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

బవేరియన్ మోటార్ వర్క్స్(BMW) ఈ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీని విభిన్న వేరియంట్లలో రూ. 67.90 లక్షల నుండి 79.90 లక్షల మధ్య శ్రేణిలో ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని ప్రత్యేకంగా ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంచింది. దీని ధర రూ. 1.8 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇదే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ సచిన్ వద్ద. అయితే రజనీ రెగ్యులర్ వెర్షన్ ఎక్స్5 ఎంచుకున్నారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సాకేతికంగా కూడా బిఎమ్‌డబ్ల్యూ శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంది. ఇందులో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న 6-సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 258బిహెచ్‌పి పవర్ మరియు 580ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

5 మరియు 7 మంది కూర్చునే సీటింగ్ లేఔట్ ఆప్షన్‌లలో లభించే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో పానరోమిక్ సన్ రూఫ్ కలదు. రజనీకాంత్ గారు ఈ సన్ రూఫ్ నుండే అభిమానులకు అభివాదం చేశారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

ఇంపీరియర్ బ్లూ కలర్‌లో ఎక్స్5 సూపర్ స్టార్‌ గారికి ఖచ్చితంగా సరిపోయిందని చెప్పవచ్చు. అయితే గతంలో రజనీ గారు తరచూ టయోటా ఇన్నోవా వాహనాన్ని మాత్రమే వినియోగించేవాడు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

లగ్జరీ కార్లను ఎవరయినా బహుమానంగా ప్రధానం చేసినా కూడా రజనీ కారు స్వీకరించే వారు కారు. గతంలో రా వన్ సినిమా విజయం సాధించిన తరువాత షారుఖ్ ఖాన్ రజనీకి బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

ఇప్పుడు రజనీ వద్ద సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, టయోటా ఇన్నోవా, హోండా సివిక్ మరియు షెవర్లే తవెరా వెహికల్స్ ఉన్నాయి. పాత ఫియట్ కారుతో పాటు ప్రీమియర్ పద్మిని కార్లు కూడా సూపర్ స్టార్ సింపుల్ కార్ గ్యారేజీలో ఉన్నాయి.

బిమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కారు కొనుగోలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

ఇవన్నీ అటుంచితే, రజనీ గారి రాజకీయ ప్రవేశంపై సందిగ్దత అలాగే ఉంది. ఆయన సొంత పార్టీని ఎర్పాటు చేస్తారా...? లేదా ఇప్పటికే ఉన్న పార్టీలో చేరుతారా...? అనే విశయంపై ఎలాంటి స్పష్టత లేదు. తమిళనాట రాజకీయాల్లో రజనీ రంగ ప్రవేశం గురించిన ప్రశ్నలకు కాల చెప్పే సమాధానం కోసం వేచి చూడాల్సిందే...!

English summary
Read In Telugu Superstar Rajnikanth Buys BMW X5 Luxury Car
Story first published: Wednesday, May 24, 2017, 11:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark