ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించి ఓ సర్వే ప్రకారం, ప్రపంచ ఫేవరెట్ కారు కలర్‌‌గా తెలుపు రంగు మొదటి స్థానంలో నిలిచింది. మరి వరల్డ్ సెకండ్ ఫేవరెట్ కార్ కలర్ ఏమిటో చూద్దాం రండి...

By N Kumar

కొత్త కారు కొనేముందు చాలా మంది కారు కలర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొంత మంది కేవలం కారు రంగును చూసే కొనుగోలు చేస్తుంటారు. మరికొంత మంది అయితే ఏ రంగు ఎంచుకోవాలి అని తికమకపడుతుంటారు. అయితే ఇలాంటి వారందరినీ కదిలిస్తూ జరిగిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మెచ్చిన రంగు తెలుపు అని తేలింది.

ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

"చూసన్ మీడియా" అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కార్ కలర్‌గా తెలుపు మొదటి స్థానంలో నిలిచింది. మరియు ఎక్కువ మంది ఎంచుకుంటున్న రెండవ కలర్ ఎంటో చెప్పగలరా....?

ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

చాలా మంది సిల్వర్ కలర్ ఉంటుందిలే అనుకుంటారు కదా...? అయితే ఆశ్చర్యకరంగా ప్రపంచపు రెండవ పాపులర్ కారు కలర్ నలుపుగా నిలిచింది. తెలుపు తరువాత ఎక్కువ మంది ఎంచుకుంటున్న కారు కలర్ బ్లాక్.

ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

సర్వే తెలిపిన గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల మీదకు చేరిన కార్లలో 37 శాతం తెలుపు రంగువి కాగా, 18 శాతం నలుపు రంగు కార్లు ఉన్నాయి.

ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

వరుసగా మూడవ స్థానంలో గ్రే మరియు సిల్వర్ నిలిచాయి. 11 శాతం చెప్పున ఈ రెండు రంగుల్లో ఉన్న కార్లు ప్రపంచ రోడ్ల మీద తిరుగాడుతున్నాయి. తరువాత స్థానంలో ఉన్న అతి ముఖ్యమైన కలర్ ఎరుపు.

ప్రపంచం మొత్తం ఎక్కువగా మెచ్చే కార్ కలర్

సర్వే ప్రకారం ఉత్తర అమెరికాలో 10 శాతం కార్లు ఎరుపు రంగులో ఉండటం కావడం గమనార్హం. ఒక్కో దేశం ఒక్కో రంగుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అయితే వరుసగా ఉన్న తొలి మూడు స్థానాల్లోని రంగులు అన్ని దేశాల్లో కూడా ఒకేలా ఉన్నాయి.

Most Read Articles

English summary
Also Read In Telugu: World’s Favourite Car Colour Revealed, world's best car colour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X