గంటకు 200 కి.మీ ల వేగంతో పరుగులు పెట్టే స్పెయిన్ రైలు భారత్‌కు

By Anil

ఇండియన్ రైల్వే గత విజయవంతంగా గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన తరువాత ఇప్పుడు స్పెయిన్ తయారు చేస్తున్న హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. స్పెయిన్‌‌కు చెందిన టాల్గో రైళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన పట్టాల మీద వీటిని ప్రయోగించి పరీక్షించనుంది. గంటకు 200 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టో టాల్గో రైళ్లను జూన్ నెలలో పరీక్షించనున్నారు.

ఇండియన్ రైల్వేలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టడానికి వస్తున్న టాల్గో రైళ్ల గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ట్రాక్

ట్రాక్

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో అత్యధిక వేగంతో పరుగులు పెట్టే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును నిజామొద్దీని స్టేషన్ నుండి అగ్రా వరకు నడుపుతున్నారు. కాబట్టి బహుశా ఈ టాల్గో రైళ్లను కూడా ఇదే ట్రాక్ మీద పరీక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దిగుమతి

దిగుమతి

ఈ హైస్పీడ్ రైళ్లను మార్చి 27 న బార్సిలోనాలో కార్గో షిప్ ద్వారా ఎగుమతి చేశారు. తొమ్మిది కోచ్‌లు గల ఈ రైలు ఏప్రిల్ 21 న ముంబాయ్‌ తీరాన్ని చేరుకోనున్నాది.

ఉచిత ధరతో

ఉచిత ధరతో

స్పానిష్‌కు చెందిన ప్రముఖ రైళ్ల తయారీ సంస్థ తమ టాల్గో రైళ్లను ఇండియన్ రైల్వే పట్టాల మీద పరీక్షలు జరపడానికి ఇండియన్ రైల్వేకు ఉచితంగా అందిస్తోంది.

ఇజ్జత్ నగర్ డిపోకు

ఇజ్జత్ నగర్ డిపోకు

ముంబాయ్ పోర్ట్‌కు ఈ రైలు చేరుకున్న అనంతరం దీనికి సంభందించి కస్టమ్స్‌ నుండి క్లియరెన్స్ పొందిన తరువాత, దీనిని ఇజ్జత్ నగర్ రైలు డిపోకు తరలిస్తారు. అటు పిమ్మట దీనికి జూన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

మొదటి టాల్గో రైలు

మొదటి టాల్గో రైలు

ఇండియన్ రైల్వే మంత్రి వర్గంలోని సీనియర్ అధికారి మాట్లాడుతూ, మొదటి టాల్గో రైలు పరీక్షను బారియల్లీ-మొరాదాబాద్ మధ్య పరీక్షించారు, అప్పటి దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉండేది.

 రెండవ సారి

రెండవ సారి

రెండవ సారి 180 కిలోమీటర్ల వేగంతో పల్వాల్-మథురా ల మధ్య మరొక టాల్గో రైలును పరీక్షించారు.

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్న టాల్గో రైలును ఢిల్లీ మరియు ముంబాయ్‌ల మధ్య పరీక్షించనున్నారు.

రైల్వే వారి సమాచారం ప్రకారం

రైల్వే వారి సమాచారం ప్రకారం

ఇండియన్ రైల్వే వారి కథనం ప్రకారం టాల్గో రైళ్లు మన పట్టాల మీద గంటకు 160 నుండి 200 కిలోమీటర్లు వేగం వరకు సునాయసంగా ప్రయాణించగలవని తెలిపారు. దీనికి కావాల్సిన ట్రాక్‌లలలో ఎటువంటి మార్పులు అవసరం లేదు అయితే దీని కోసం ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థ అవసరం అవుతుంది.

ఖర్చులు

ఖర్చులు

చిన్న చిన్ని ఖర్చులు మినాహిస్తే ఈ టాల్గో రైళ్లను చవకగా దిగుమతి చేసుకోవచ్చు, కస్టమ్ పన్నులు మరియు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులను కూడా టాల్గో సంస్థ భరించి వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు.

తక్కువ పవర్‌తో

తక్కువ పవర్‌తో

ఇండియన్ రైల్వే ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను ఇంధనంగా వినియోగించుకుటోంది. అయితే టాల్గో రైళ్లను వినియోగిస్తే 30 శాతం వరకు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి.

తక్కువ ప్రయాణం సమయం

తక్కువ ప్రయాణం సమయం

టాల్గో రైళ్లను వినియోగించడం ద్వారా ఇంధనాన్ని మాత్రమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా పొదుపు చేసుకోవచ్చు. ఇవి ఇండియన్ రైల్వేలోకి వస్తే హై స్పీడ్ రైళ్ల విభాగంలో మరొక కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు.

మరిన్ని కథనాలు మీకోసం....

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Talgo train trial at 200 kmph likely in June
Story first published: Monday, April 11, 2016, 12:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X