మొన్న బిల్ట్ క్వాలిటీ, నేడు రిలయబిలిటీ నిరూపించుకున్న టియాగో

Written By:

నిర్మాణ నాణ్యత మరియు విశ్వసనీయత పరంగా టాటా కార్లు బాగా ప్రసిద్ది. మొన్న ముంబాయ్‌లో కురిసిన వర్షాల్లో భారీ వరద ప్రవాహాన్ని టాటా టిగోర్ కారు సురక్షితంగా దాటేసింది. ఇది, టాటా కార్ల విశ్వసనీయతను నిరూపిస్తే, తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన కస్టమర్ టాటాకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

తలక్రిందులైన టాటా టియాగో

ఈ వారం ప్రారంభంలో రమేష్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతా నుండి తలక్రిందులైన టాటా టియాగో ఫోటోలను షేర్ చేశాడు. అతని కథనం మేరకు, ఈ ఘటన ముంబాయ్ నగరంలో చోటు సంభవించింది.

తలక్రిందులైన టాటా టియాగో

టియాగో కారులో ముంబాయ్ సిటీలో వెళుతున్నపుడు భారీ వర్షానికి రోడ్డు సరిగా కనబడకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో టియాగో కారు రోడ్డు మీద పల్టీ కొట్టి తలక్రిందులుగా నిలబడిపోయింది. అయితే కారు తల భాగం ధృడంగా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

తలక్రిందులైన టాటా టియాగో

టియాగో యాక్సిండెట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, చాలా వరకు ప్రమాదాలలో సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లను అందివ్వడంతో బడ్జెట్ ధరలో మంచి విక్రయాలను సాధిస్తోంది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
తలక్రిందులైన టాటా టియాగో

టాటా మోటార్స్ తొలిసారిగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆదారంగా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. టియాగో విక్రయాల్లో టాటాకు మునుపెన్నడూ లేని విక్రయాలు సాధించిపెడుతోంది. ఒక్కోసారి క్విడ్ మరియు సెలెరియో దరిదాపు విక్రయాలను సాధించింది.

తలక్రిందులైన టాటా టియాగో

ఆగష్టు 2017 లో 7,000 యూనిట్ల టియాగో కార్లను టాటా విక్రయించింది. టాటా తమ హిస్టరీ 7,000 సేల్స్ మైలు రాయిని దాటడం అదే మొదటిసారి. టియాగో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. టియాగో ధరల శ్రేణి రూ. 3.33 లక్షల నుండి రూ. 5.76 లక్షలుగా ఉన్నాయి.

Picture credit: Shifting-gear

English summary
Read In Telugu: Tata Tiago turns upside down in accident – Built quality saves its passengers
Story first published: Friday, October 13, 2017, 1:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark