పట్టాల మీద పార్కింగ్ చేసిన వెహికల్ కోసం నిలిచిపోయిన రైలు: వీడియో

ఓ డ్రైవర్ టాటా జెనాన్ వెహికల్‌ను పొరబాటున రెండు చక్రాలు పట్టాల మీద ఉండేలా చేశాడు. నెమ్మదిగా వచ్చిన రైలు ఆ వెనకాల ఆగిపోయింది. ఆ కారు డ్రైవర్ మాత్రం ఏమీ పట్టనట్లు, అస్సలు తన వెనకాల రైలు వచ్చినట్లు కూడా

By Anil Kumar

ఇండియాలో అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకోవడం సాధారణ విషయమేమీ కాదు. సువిశాల భారతదేశంలో ఉన్న రోడ్డు రవాణా ప్రపంచంలోనే రెండవ పెద్దది మరియు రైలు రవాణా నాలుగవ పెద్దది.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

చాలా వరకు రైలు మరియు రోడ్డు మార్గాలు ఉమ్మడిగా కలిసి వెళుతుంటాయి, అయితే రెండింటి మధ్య కనీసం దూరం ఉంటుంది. కొన్ని చోట్ల ఒకదానినొకటి క్రాస్ చేయడానికి లెవల్ క్రాసింగ్, ఫ్లైఓవర్లు మరియు సొరంగ మార్గాలు ఉన్నాయి.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

కానీ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నగరంలో రోడ్డు మరియు రైలు మార్గాలు రెండు చాలా దగ్గరగా ఉంటాయి. వీలైనంత స్థలం లేకపోవడంతో రెండింటి మధ్య బారికేడ్లను కూడా ఏర్పాటు చేయలేకపోయారు.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

ఓ డ్రైవర్ టాటా జెనాన్ వెహికల్‌ను పొరబాటున రెండు చక్రాలు పట్టాల మీద ఉండేలా చేశాడు. నెమ్మదిగా వచ్చిన రైలు ఆ వెనకాల ఆగిపోయింది. ఆ కారు డ్రైవర్ మాత్రం ఏమీ పట్టనట్లు, అస్సలు తన వెనకాల రైలు వచ్చినట్లు కూడా గుర్తించలేదు.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

ఇంతలో పూర్తిగా ఆగిపోయిన రైలు దారివ్వమంటూ పెద్దగా శబ్దం చేసింది. ఆ శబ్దంతో తేరుకున్న టాటా జెనాన్ డ్రైవర్ తన వెనుక రైలు ఆగి ఉందని గ్రహించి, తన వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

ఎలాంటి కారణం లేకుండా రైలును ఆపడం చట్టరీత్యా నేరం. అందుకు కారణమైన వారికి జరిమానా విధించి, జైలు శిక్ష కూడా విధిస్తారు. ఏదేమైనప్పటికీ, అక్కడున్న పరిస్థితులను గమనిస్తే ఇలాంటివి సర్వసాధారణం అని తెలుస్తోంది.

వీడియోలో చూస్తే, పట్టాల వెంబడి చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అయితే, ఒక డ్రైవర్ రెండు చక్రాలు పట్టాల మీద ఉండేలా పార్కింగ్ చేయడంతో రైలు నిలిచిపోయింది. రైలు మరియు రోడ్డు మార్గాలు పక్కపక్కనే ఉండటంతో చాలా ఇరుకుగా ఉంటుంది. ఇక రైళ్లు కూడా మెరుపు వేగంతో కాకుండా నెమ్మదిగా వెళుతుంటాయి.

పట్టాల మీద నిలిచిపోయిన రైలు

విభిన్న ప్రాంతాలు, ప్రజలు, వారి జీవన శైలి, భాషలు, వేషధారణలు, ఆహారపుటలవాట్లు మరియు చారిత్రక కట్టడాలకుఇండియా ప్రత్యేకం. వీటితో పాటు ఇలాంటి మరెన్నో అరుదైన సంఘటనలు ఇండియాలో జరుగుతూనే ఉంటాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Xenon blocks moving train, caught on video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X