తేజాస్ ఎక్స్‌ప్రెస్ తొలి ట్రిప్పులోనే రూపు రేఖలన్నీ మార్చేశారు

Written By:

విదేశీ తరహా రైళ్లు, వాటిలో ఉన్న సదుపాయాలు మనకూ ఉంటే బాగుండు అని ఎంతో మందికి అనిపించి ఉంటుంది. అయితే మొత్తానికి ఇండియన్ రైల్వే అలాంటి సదుపాయాలతో ఓ లగ్జరీ రైలు "తేజాస్ ఎక్స్‌ప్రెస్" పేరుతో ప్రారంభించింది.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నుండి గోవా వరకు ఈ రైలు సేవలను రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గారు జండా ఊపి మే 22, 2017 వ ప్రారంభించారు. ఈ రైలు గోవాకు చేరుకుని మొదటి ట్రిప్పును విజయవంతంగా పూర్తి చేసుకుంది.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

మంగళవారం గోవాకు చేరుకోనున్న రైలుకు స్వాగతం పలకడానికి రైల్వే అధికారులు వచ్చారు. రైలు గోవా చేరుకున్న తరువాత, దాని స్థితిని చూసి అధికారులు అవాక్కయ్యారు

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

అంతే కాకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన మరుగు దొడ్లను కూడా అపరిశుభ్రంగా మార్చేశారు. భోగీల్లోని లోపలి వైపు గచ్చు మీద మరియు గోడలను మురికి మురికిగా చేశారు.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

తేజాస్ రైలులో ప్రతి సీటుకు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లను ఏర్పాటు చేసారు. వీటిని కూడా ధ్వంసం చేశారు. ఇన్ఫోటైన్‌మెంట్‌కు అనుసంధానం చేసే హెడ్ ఫోన్స్‌ను కూడా దోచేశారు.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

రైలు బయటివైపును వీక్షించేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న కిటికీ అద్దాలను ఏర్పాటు చేయగా, వాటిలో ఒక దానిని పగలగొట్టారు. తొలి రోజు మొదటి ప్రయాణంలోనే ఇంతలా రైలు మార్చేయడం చాలా దురదృష్టకరం.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

మన దేశంలో కూడా మెరుపు వేగంతో ప్రయాణించే లగ్జరీ రైలు సర్వీసు ఉందని గర్వంగా చెప్పుకోవాల్సిన తరుణంలో, రైలులో అందించిన ఫీచర్లను దొంగలించి, కంపార్ట్ మెంట్లను సర్వ నాశనం చేశారు.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు వారానికి ఐదు రోజులు ముంబాయ్ - గోవాల మధ్య నడవనుంది. ఈ తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును మరిన్ని ఇతర మార్గాల్లో కూడా నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించుకుంది.

తొలి ట్రిప్పులోనే రైలు రూపు రేఖలు మార్చేశారు!

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎల్‌సిడి తెరలు, ఆటోమేటిక్ క్లోజ్‌డ్ డోర్లు, టీ మరియు కాఫీ యంత్రాలు, బ్రెయిలీ లిపి గల బోర్డులు, డిజిటల్ బోర్డులు, ప్రయాణికుల వివరాలతో కూడిన ఎలక్ట్రానిక్ చార్టులు వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu Tejas Express Completes Its First Trip — The Damage Is Shocking
Story first published: Thursday, May 25, 2017, 18:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark