ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం 7 కోట్ల ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ బస్సు

Written By:

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, మూడో కూటమితో కేంద్ర రాజకీయ పగ్గాలు చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మరియు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దమైన కేసీఆర్‌కు నక్సల్ ముప్పు ఉన్నట్లు అధికారులను అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్యమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Recommended Video - Watch Now!
Cars Owned By Indian Celebrities - DriveSpark
కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

జిల్లా పర్యటనల కోసం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర రవాణ శాఖకు అప్పగించినట్లు తెలిసింది.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారు. మరియు కేసీఆర్ గారికి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఎక్కువగా ఉండటంతో, ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ప్రూఫ్ బస్సును తయారు చేయించనున్నారు.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

ఇటీవల తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు సుమారుగా పది మంది మావోలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సల్స్ నుండి కేసీఆర్‌కు ముప్పు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సుమారుగా రూ. 7 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ కోనుగోలు చేసే అవకాశం ఉంది.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

కేసీఆర్ కోసం వద్ద ఇప్పటికే 4 కోట్ల రుపాయలు విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ బస్సు ఉంది. దీనికి, అదనంగా మరిన్ని భద్రత మరియు ఇంటీరియర్ ఫీచర్లతో ఈ బస్సును కొనుగోలు చేస్తున్నారు. కొత్త బస్సు అందుబాటులోకి వస్తే, పాత బస్సును ప్రత్యామ్నాయ అవసరాలకు ఉపయోగిస్తారు.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

నూతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు కోసం టెండర్లను ఆహ్వానించేందుకు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు ప్రతిపాదనను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా బస్సులో ఉండాల్సిన అన్ని తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు, బుల్లెట్ ప్రూఫ్ మరియు ల్యాండ్ మైన్ ప్రూఫ్ అంశాలని పరిశీలించి, తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను జిఎడి కి పంపుతారు.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు

అనుమతులు వచ్చిన తరువాత, టెండర్లను ఖరారు చేసిన అనంతరం రెండు లేదా మూడు నెలల్లోపు బుల్లెట్ ప్రూఫ్ బస్సు సిద్దం కానుంది. ప్రస్తుతం కేసీఆర్‌కు జడ్ ప్లస్ సెక్యురిటీ ఉంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ 24 గంటలు వ్యక్తిగత భద్రతను పర్యవేక్షిస్తుంటుంది.

కేసీఆర్ మెర్సిడెస్ బెంజ్ బస్సు
English summary
Read In Telugu: Telangana CM Chandrasekarrao May Get New Bullet Proof Bus Soon
Story first published: Wednesday, March 7, 2018, 17:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark