తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని అడిషినల్ కలెక్టర్స్ కోసం 32 కియా కార్లను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రగతి భవన్ లో తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరియు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీటిని పచ్చజెండా ఊపి అడిషనల్ కలెక్టర్లకు అందజేశారు.

రాష్ట్రంలో ఉన్న అడిషినల్ కలెక్టర్లు తమ గ్రామ సందర్శనల కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి అందించడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కొక్క కియా కార్నివాల్ కారు ధర రూ. 30 లక్షల నుంచి రూ. 31 లక్షల వరకు ఉంటుంది. ఈ వాహనాలు ఎప్పుడు ఎలా డెలివరీ చేసుకున్నారు అనేదానిపై ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే అడిషినల్ కలెక్టర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అందించడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

తెలంగాణ అడిషినల్ కలెక్టర్లకు కియా కార్నివాల్ కార్లను అందించిన విషయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం అప్పుల్లో నడుస్తోంది. అది మాత్రమే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత వల్ల మరింత ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో దాదాపు 11 కోట్ల విలువైన కార్లను కొనుగోలుచేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

ఈ ఘటనపై తెలంగాణాలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో అధికంగా ఉన్న సమయంలో అధికారుల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఈ లగ్జరీ కార్లను ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేసిన కుతంత్రం ఇది అని, వారు తప్పుబట్టారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

కరోనా సమయంలో ప్రజాధనాన్ని ఇలా వృధాచేయడం ఏ మాత్రం సమంజసం కాదని కూడా వారు ప్రస్తావించారు. బిజెపి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనికి దుమ్మెత్తిపోస్తుండగా, మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రంగా విమర్శించింది.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

ఈ చర్యపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ, హాస్పిటల్స్ లో ఆక్సిజన్ బెడ్లు పెంచడానికి లేక ప్రజా రవాణాకు ఉపయోగపడే బస్సుల కొనుగోలుకు ఆ డబ్బును వినియోగించి ఉంటే చాలా సమంజసంగా ఉంటుంది అని వారు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

కరోనా లాక్ డౌన్ వల్ల తెలంగాణా రాష్ట్రానికి దాదాపు 4500 కోట్ల రూపాయల లోటు ఏర్పడిందని మంత్రి హరీశ్ రావు చెప్పిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ గుర్తు చేశారు. ఈ విధమైన ఆర్ధిక మాంద్యం ఉన్న సమయంలో అడిషినల్ కలెక్టర్లకు కియా కార్లను కొనుగోలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే 2015 లో 10 జిల్లాల్లోని కలెక్టర్లకు లేటెస్ట్ టయోటా ఫార్చునర్స్ కార్లను కొనిచ్చింది. అంతే కాకుండా తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులకు కూడా ఈ కార్లను అందించడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ప్రతిపక్షాలు, ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన కియా కార్నివాల్ కార్లు దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కార్లు. కియా కార్నివాల్ కార్లు విశాలంగా ఉండటమే కాకుండా అత్యాధునిక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో కియా కార్నివాల్ కార్లకు ప్రత్యక్ష పోటీదారులు లేదు. కానీ కార్నివాల్ టయోటా ఇన్నోవా క్రిష్టా యొక్క అమ్మకాలపై ప్రాభవాన్ని చూపిస్తుంది.

Most Read Articles

English summary
Telangana Government Buys 32 Kia Carnival Luxury MPVs. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X