100 కోట్ల మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రేపే సరికొత్త అవతారంలో ఎంట్రీ ఇస్తున్న డస్టర్

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌కు ప్రాణం పోసిన కారు ఏదైనా ఉందంటే అది రెనాల్ట్ డస్టర్ మాత్రమే. 2012లో విడుదలై తన రగ్గడ్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. కొన్నేళ్లుగా మార్కెట్ కు దూరమైన ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త రూపంలో, అత్యాధునిక టెక్నాలజీతో మళ్ళీ భారత గడ్డపై కాలు మోపబోతోంది. రేపు, అంటే మార్చి 17, 2026న ఈ న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ అధికారికంగా లాంచ్ కానుంది. ఈసారి రెనాల్ట్ కేవలం ఒక కారును మాత్రమే కాకుండా, మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసించే ఒక పవర్ఫుల్ వెపన్ తీసుకువస్తోంది.

కళ్ళు చెదిరే సరికొత్త డిజైన్
కొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్ చూస్తుంటే, పాత డస్టర్ లోని ఆ మొరటుతనం అలాగే ఉంచుతూనే, దానికి మోడ్రన్ టచ్ ఇచ్చారు. దీని ముందు భాగంలో ఉన్న స్లిమ్ ఎల్‌ఈడీ డిఆర్ఎల్స్ (LED DRLs) కారుకు ఒక ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. గ్రిల్‌పై పెద్ద అక్షరాలతో ఉన్న DUSTER లోగో కారుకు ఒక విభిన్నమైన ఐడెంటిటీని ఇస్తోంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, భారీ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చెస్ చుట్టూ ఉన్న బ్లాక్ క్లాడింగ్, ఎత్తైన రూఫ్ రైల్స్ ఈ కారును ఒక రియల్ ఎస్‌యూవీలా చూపిస్తున్నాయి. వెనుక భాగంలో ఉన్న ట్రయాంగులర్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్ కారుకు వెనక నుంచి కూడా స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి.

The King Returns All New 2026 Renault Duster Launching Tomorrow with Hybrid Power

భారతదేశం కోసమే ప్రత్యేక ప్లాట్‌ఫారమ్
రెనాల్ట్ ఈసారి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్లో వాడే ప్లాట్‌ఫారమ్ కాకుండా, భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన RGMP ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును రూపొందించింది. ఇది చాలా స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫారమ్. దీని వల్ల భవిష్యత్తులో ఇదే ప్లాట్‌ఫారమ్ పై 7-సీటర్ మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు బాడీ రోల్ తక్కువగా ఉండేలా రియర్ స్టెబిలైజర్ బార్‎ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మలుపుల్లో కూడా కారు చాలా స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వల్ల సిటీలో నడపడం సులభంగా ఉంటుంది, హైవేపై మంచి కంట్రోల్ లభిస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్, హై-టెక్ ఫీచర్లు
డస్టర్ లోపలికి వెళ్ళగానే మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. పూర్తిగా మార్చబడిన డ్యాష్‌బోర్డ్ డిజైన్ లగ్జరీ కార్లను తలపిస్తోంది. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, వెంట్ లేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. 518 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్ వేసే ఫ్యామిలీలకు ఇది వరమని చెప్పవచ్చు.

The King Returns All New 2026 Renault Duster Launching Tomorrow with Hybrid Power

మూడు ఇంజన్ ఆప్షన్లు - పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ విషయంలో రెనాల్ట్ ఎక్కడా తగ్గడం లేదు. కొత్త డస్టర్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది:
1.0 లీటర్ టర్బో పెట్రోల్: ఇది 100 PS పవర్, 160 Nm టార్క్‌ను ఇస్తుంది. బడ్జెట్ లో ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
1.3 లీటర్ టర్బో పెట్రోల్ (మైల్డ్ హైబ్రిడ్): ఇది ఏకంగా 163 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హైవే రైడింగ్ కి, వేగాన్ని ఇష్టపడే వారికి సరిపోతుంది.
1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: మైలేజీ, పవర్ రెండూ కావాలనుకునే వారి కోసం ఇది ఒక అద్భుతమైన ఇంజన్. ఇది దాదాపు 160 PS పవర్‌ను అందిస్తుంది.

సేఫ్టీకి పెద్ద పీట:
రెనాల్ట్ డస్టర్ 2026 లో సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో లెవల్-2 ADAS టెక్నాలజీని కూడా జోడించారు. దీనివల్ల రోడ్డుపై ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. ఈ కారుకు క్రాష్ టెస్ట్ లో 5-స్టార్ రేటింగ్ వస్తుందని కంపెనీ నమ్మకంగా ఉంది.

The King Returns All New 2026 Renault Duster Launching Tomorrow with Hybrid Power

ధర, పోటీ
కొత్త డస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ ధరతో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్ తో ఈ కారు పూర్తి వివరాలు, బుకింగ్స్ గురించి ఓ క్లారిటీ రానుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 16, 2026, 18:03 [IST]
English summary
The king returns all new 2026 renault duster launching tomorrow with hybrid power
Read more on: #renault #suv #hybrid suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+