5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

ఈ సంవత్సరం మొదటి నుంచి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి వార్తల్లో వింటున్నాము. ఈ విభాగంలో కొత్త కొత్త టూ వీలర్ వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలు అప్డేటెడ్ టెక్నాలజీతో, ఎలక్ట్రిక్ స్వైపింగ్ బ్యాటరీలు కూడా వస్తున్నాయి. ఈ విధమైనటువంటి వాహనాలు తయారు చేయడం సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ మన ఊహకు అందని విషయం ఏమిటంటే ఎలక్ట్రిక్ విమానాలు కూడా రాబోతున్నాయి, వివరాలలోకి వెళదాం రండి...

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

ఎలక్ట్రిక్ విమానాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశముంది అని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. ఐదేళ్ల కాల వ్యవధిలో ఎలక్ట్రిక్ విమానాలను వినియోగంలోకి రానున్నట్టు ఇటీవల టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ లకు సంబంధించిన డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

అయితే బ్యాటరీల రూపకల్పనలో, బ్యాటరీల శక్తి సాంద్రత మెరుగు పడటానికి ఇంకా సమయం పడుతుందని , వీటిపై విమానాల డిజైన్లు ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే భవిష్యత్తు అంతా ఉంటాయి అని, అందులో సందేహ మే లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర కార్ల తయారీదారులు అందరూ మెరుగైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి పోటీ పడుతుండగా, ఎలాన్ మస్క్ టెస్లాతో ఈ పోటీని అధిగమించాడు.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

టెస్లా కార్లు కొత్త స్థాయిల్లో వీటి పనితీరు, రూపకల్పనలతో విద్యుత్ వాహన ప్రపంచంలోకి వీటిని తీసుకొచ్చాయి మరియు వీరు కేవలం ఎలక్ట్రిక్ కార్ల వద్ద ఆపివేసే ఉద్దేశ్యంలో లేదని తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ ట్రక్ ను ప్రదర్శించింది, ఇది ట్రక్ విభాగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

టెస్లా తయారీలో ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కూడా ఉంది. అన్ని రకాల విద్యుత్ యంత్రాలను అభివృద్ధి చేయడానికి సహాయపడే వివిధ రకాల బ్రాండ్లను కూడా కంపెనీ కొనుగోలు చేసింది. ఎలాన్ మస్క్ ఒకప్పుడు రాకెట్లు తప్ప అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ గా తయారు చేయవచ్చని చెప్పారు. ఈ మార్గంలోనే టెస్లా పనిచేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సంవత్సరాల క్రితం, ఎలాన్ మస్క్ ఒక విటిఓఎల్ ( వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్) విమానం సిద్ధంగా చేసారు, కానీ దానికి అవసరమైన బ్యాటరీలకు అధిక శక్తి సాంద్రతతో తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాలలో పవర్ జెట్ ఇంజిన్లకు ఉపయోగించే జెట్ ఇంధనం ఎక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉందని, అయితే నిల్వ చేసిన శక్తిని చలనానికి మార్చడంలో బ్యాటరీలు మెరుగ్గా ఉన్నాయని మస్క్ చెప్పారు.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

నింజా అనే పేరు గల వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విధంగా ట్వీట్ చేసాడు, "బ్యాటరీ ఆఫ్ కావడం వల్ల విమానాలు ఎగరడం సాధ్యమేనా? లేదా శక్తివంతమైన తగినంత బ్యాటరీ ఉందా? దీనికి "ఎలాన్ ఈ విధంగా జవాబు ఇచ్చాడు," అవును, కానీ ఇంకా బ్యాటరీ పరిధి చాలా పరిమితంగా ఉందని. బ్యాటరీ శక్తి సాంద్రత మెరుగుపడటం అనేది రాబోయే సంవత్సరాల్లో ఇది మారుతుంది" అని చెప్పాడు.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

"బ్యాటరీ శక్తి సాంద్రత ప్రస్తుతం సుమారుగా 300 Wh/kg వద్ద ఉంది, తన ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కు 400 Wh/kg అవసరం అని మస్క్ పేర్కొన్నాడు. బ్యాటరీ శక్తి సాంద్రత అనేది ఒక నిర్దిష్ట మొత్తం బరువున్న బ్యాటరీ ద్వారా బయటకు వచ్చే శక్తి పరిమాణం తప్ప మరేమీ కాదు. దీనిని ఒక కిలోగ్రామ్ వాట్-అవర్ లో కొలుస్తారు.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

శక్తి సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే, బ్యాటరీ బరువుగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలుగుతుంది. తక్కువ విమానం బరువు వలన ఖచ్చితంగా బ్యాటరీలు బరువు ఉండకూడదు. అందువల్ల బ్యాటరీ శక్తి సాంద్రత మెరుగుపడటానికి మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుంది.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

ముఖ్యంగా, టెస్లా సంస్థ యొక్క బ్యాటరీ సాంకేతికతలను పొందేందుకు అనుమతించే మాక్స్ వెల్ సాంకేతికతలను కూడా కొనుగోలు చేసింది. ఇందులో అల్ట్రాకెపాసిటర్ లు, డ్రై ఎలక్ట్రోడ్స్ వంటి అధునాతనమైనవి ఉంటాయి. మాక్స్ వెల్ డిజైన్ శక్తి సాంద్రత యొక్క అధిక స్థాయిలకు చేరుకోవడానికి పొడి ఎలక్ట్రోడ్లు ఉపయోగిస్తుంది.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

అంటే మనం త్వరలో టెస్లా ఎలక్ట్రిక్ విమానాన్ని చూడగలం. ఇది ముందుగానే ఊహించినదే అని చెప్పవచ్చు, ఎందుకంటే మేము టెస్లా బిల్డింగ్ రాకెట్లు, సూపర్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు మరియు హైపర్ లూప్ వంటి ప్రాజెక్టులను కూడా చూశాం. కాబట్టి, భవిష్యత్తులో టెస్లా ఎలక్ట్రిక్ విమానం ఎగరడం చూసినప్పుడు పెద్దగా ఆశ్చర్యం వుండదు.

5 ఏళ్లలో ఎలక్ట్రిక్ విమానాలు సాధ్యమే అని చెప్పిన టెస్లా సీఈఓ

టెస్లా ఎలక్ట్రిక్ విమానాల పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

టెస్లా ప్రపంచంలో కొన్ని ఉత్తమమైన ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ ఎలక్ట్రిక్ విమానాలపై తన దృష్టిని సారించింది. కొన్ని పరిశోధనల ప్రకారం, విమానయానం వలన ప్రపంచ వ్యాప్తంగా రెండు శాతం వరకు కాలుష్యం జరుగుతోంది, దీనిని మస్క్ మరియు అతని బృందం నివారించబోతోంది.

Most Read Articles

English summary
Electric aircraft may soon become a commercial reality according to Tesla CEO Elon Musk.Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X