ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

ఇటీవలి కాలంలో మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మీరు గమనించారా? గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని చూస్తోంది. మారుతున్న పరిస్థితులు మరియు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహణ కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు మరియు వినియోగం గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఈ వాహనాల వినియోగానికి మరింత ఆజ్యం పోశాయి. దీంతో ప్రజలు సాంప్రదాయ దహన యంత్రాల నుండి మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతున్నారు.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ వాహనాల వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉండటం అనేది పర్యావరణం పట్ల మీ వ్యక్తిత్వాన్ని మరియు ప్రత్యేకతను ప్రతిబింబింపజేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ప్రజాకర్షణను పొందుతాయి. నిశ్శబ్దమైన రైడ్ మరియు కారు వెనుక వైపు పొగలు చిమ్మే టెయిల్ పైప్స్ లేకపోవడం, ఇంధనంపై వెచ్చించే డబ్బును ఆదా చేసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రిక్ వాహనాల వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

కొన్ని సంవత్సరాల క్రితం ఇది సాధారణ దృశ్యం కానప్పటికీ, ఇప్పుడు వీధుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి బస్సుల వరకు అన్నింటికి విద్యుద్దీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఒక సాధారణ కారు కొనుగోలుదారుగా, మీ మొదటి ప్రాధాన్యత ఆచరణాత్మకమైన, సులభమైన, డ్రైవింగ్‌కు మరియు రోజువారీ ప్రయాణానికి అనుకూలమైన మరియు తక్కువ-ధర కలిగిన వాహన యాజమాన్యాన్ని కొనుగోలు చేయడం. ఇందుకు చక్కటి ప్రత్యమ్నాయాలే ఎలక్ట్రిక్ వాహనాలు.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

ఉదాహరణకు, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం అనేది బాగా కలిసి వచ్చే విషయాలలో ఒకటి. ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్ని విభాగాల్లో రాణిస్తున్నప్పటికీ, వినియోగదారులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారనేది కూడా వాస్తవమే. భారతదేశంలో ఈవీ యజమానిగా ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటో ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఈనాటి మన కథంలో దేశంలో ఈవీ వినియోగదారులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం

మనదేశంలో పెట్రోల్ బంకులు అందుబాటులో ఉన్నంత సులువుగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేవు. అయితే, పెట్రోల్ బంకులలో కూడా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇది పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

బ్యాటరీ రీఛార్జింగ్ పాయింట్లు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలకు ఇంధనం నింపే స్టేషన్ ల మాదిరిగానే పనిచేస్తాయి. నిరంతర వినియోగం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ చార్జింగ్ తగ్గతూ వస్తుంది. అటువంటి సందర్భాలలో ఎలక్ట్రిక్ వాహనాలను రీఛార్జ్ చేయడం ఎంతో అవసరం. అయితే, ఈ రోజుల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడం చాలా కష్టమైన పని. మెట్రో నగరాల్లో వీటి లభ్యత ఫర్వాలేదనిపించినప్పటికీ, హైవేలపై మాత్రం ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

అందుకే, ఎలక్ట్రిక్ వాహనాలతో దూర ప్రయాణాలు చేయాలంటే, అవి మార్గ మధ్యంలో ఎక్కడ ఆగిపోతాయోనని వాటి యజమానులు హడలెత్తిపోతున్నారు. ఫలితంగా, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం సిటీ ప్రయాణాలకు మాత్రమే అనువైనవిగా పరిగణించబడుతున్నాయి. అతితక్కువ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా చార్జ్ చేసే సూపర్ ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్ అడుగడునా అందుబాటులోకి వచ్చినట్లయితే, భవిష్యత్తులో రోడ్లపై అన్నీ ఎలక్ట్రిక్ కార్లే కనిపిస్తాయి.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

త్వరగా ఛార్జ్ ఖాలీ అవుతుందనే ఆందోళన

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్న వారిని మరియు కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారిని వేధించే మరో విషయం బ్యాటరీ రేంజ్. ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ వేగంతో నడిపితే, చార్జ్ త్వరగా ఖాలీ అవుతుంది, అదే తక్కువ వేగంతో నడిపితే చార్జింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. చార్జింగ్ సదుపాయాలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం మరియు ఆయా ఎలక్ట్రిక్ వాహనాలు ఆఫర్ చేసే బ్యాటరీ రేంజ్ అంతంతమాత్రంగానే ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులను కలవరపరచే మరొక అంశంగా చెప్పుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసే వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఆ వాహనం యొక్క రేంజ్ ఎంత అని. నిజానికి, ఆటోమొబైల్ కంపెనీలు చెప్పే బ్యాటరీ రేంజ్ కి, వాస్తవ పరిస్థితుల్లో మనకు లభించే రేంజ్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కంపెనీలు సర్టిఫై చేసే రేంజ్ కొన్ని ప్రత్యేక పరిమితులకు లోబడి ఉంటాయి. కానీ రియల్ టైమ్ లో మనం నడిపే తీరు, నడిపే రోడ్డు, వెహికల్ పై లోడ్, బ్రేకింగ్, బంపర్ టూ బంపర్ ట్రాఫిక్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కంపెనీలు చెప్పే రేంజ్ కి పడిపోకండి, నిజానిజాలు తెలుసుకోండి.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

సర్వీస్ సదుపాయాలు సరిగ్గా లేకపోవడం

సాధారంగా పెట్రోల్, డీజిల్ వాహనాలలో ఏదైనా సమస్య వస్తే, వీధి పక్కన ఉండే మెకానిక్ కూడా దానిని సరిచేయగలడు. కాబట్టి, ధైర్యంగా వాటిని ఎంత దూరం అయినా తీసుకువెళ్లవచ్చు. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సర్వీస్ అనేది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. నిజానికి, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల మాదిరిగా ఎలక్ట్రిక్ వాహనాలకు తరచూ సర్వీస్ అవసరం లేకపోయినప్పటికీ, అందులో కూడా అరిగి, కరిగిపోయే భాగాలు ఉంటాయి కాబట్టి, వాటిని కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకోవడం అవసరం.

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా..? ఒక్క నిమిషం..! దేశంలో ఈవీ యజమానులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు!

ఎలక్ట్రిక్ వాహనాలలో కదిలే భాగాలు తక్కువగా ఉన్నప్పటికీ, అందులోని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ షార్ట్ సర్క్యూట్ కి లేదా ఇతర సాంకేతిక లోపాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన సర్వీస్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం కూడా చాలా మంది ఈవీ యజమానులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి. ఏదేమైనప్పటికీ, నాణేకి రెండు వైపులు ఉన్నట్లు, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి.

Most Read Articles

English summary
The major challenges for electric vehicles in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X