TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
జీవితం మొత్తం రోల్స్ రాయిస్-బెంట్లీ కార్ల మధ్యే
భారతదేశపు అత్యంత సంపన్నుల పిల్లల్లో అంబానీ కుమారులదే అగ్రస్థానం. ఇండియాలోనే కాదు, పశ్చిమాసియా మొత్తం మీద కూడా వీరే అత్యంత సంపన్నులు. అంబానీ కుమారుల డైలీ లైఫ్‌లో లగ్జరీ కార్లు చాలా కామన్. లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ముఖేష్ అంబానీ పుత్ర రత్నాల వద్ద ఎలాంటి లగ్జరీ కార్లు ఉన్నాయో చూద్దాం రండి.....
ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో కూతురు ఇషా అంబానీ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఈమె సోదరులు ఆకాశ్ అంబానీ మరియు అనంత్ అంబానీలకు తండ్రిలాగే కార్లంటే విపరీతమైన ఇష్టం. అనంత్, ఆకాశ్‌లు పలు లగ్జరీ కార్లలో ముంబై వీధుల్లో చక్కర్లుకొడుతుంటారు.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే - అనంత్ అంబానీ
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారులో ముంబై వీధుల్లో తిరుగుతూ అనేకసార్లు మీడియా కంటపడ్డాడు. ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే రోల్స్ రాయిస్ ఇండియా యొక్క టాప్ రేంజ్ మోడల్. ఎలాంటి అదనపు ఫీచర్లు లేకుండానే దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 8.84 కోట్లుగా ఉంది.
సాంకేతింకగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారులో 6.75-లీటర్ల కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 454బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
బెంట్లీ బెంట్యాగా - ఆకాశ్ అంబానీ
ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ కలర్ బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీ అంటే అమితమైన ఇష్టం. ఇండియాలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలలో బెంట్లీ బెంట్యాగా మొదటి స్థానంలో ఉంది.
బెంట్లీ బెంట్యాగా లగ్జరీ ఎస్‌యూవీ గరిష్టంగా 3.85 కోట్ల రుపాయలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. సాంకేతికంగా ఇందులో 6.0-లీటర్ కెపాసిటి గల డబ్ల్యూ12 ఇంజన్ కలదు. 600బిహెచ్‌పి పవర్ మరియు 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఎస్‌యూవీ కేవలం 4.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది.
రేంజ్ రోవర్ వోగ్ - ఆకాశ్ అంబానీ
ఆకాశ్ అంబానీ ఖాతాలో ఉన్న మరో ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ వోగ్. అనంత్ మరియు ఆకాశ్ అన్నదమ్ములు అప్పుడు రేంజ్ రోవర్ వోగ్‌లో వెళుతుంటారు. ఇద్దరి వద్ద వేరు వేరు రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఒక్కో రేంజ్ రోవర్ వోగ్ ధర సుమారుగా రూ. 3.47 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
సాంకేతికంగా శక్తివంతమైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ 3.0-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్, 4.4-లీటర్ కెపాసిటి గల వి8 టుర్బో డీజల్ ఇంజన్ మరియు 5-లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో లభ్యమవుతోంది.
మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి - అనంత్ అంబానీ
మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి లగ్జరీ ఎస్‌యూవీలో అనంత్ అంబానీ ఎన్నోసార్లు కెమెరా కంటికి చిక్కాడు. మెర్సిడెస్ జి-క్లాస్ సిరీస్‌కు చెందిన జి63 ఏఎమ్‌జి వేరియంట్‌ను అనంత్ కలిగి ఉన్నాడు. సాంకేతికంగా ఇందులో 543బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 5.5-లీటర్ కెపాసిటి గల వి8 ఇంజన్ కలదు.
డబ్ల్యూ 221 మెర్సిడెస్ ఎస్-క్లాస్
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ డబ్ల్యూ221 అంబానీ ఫ్యామిలీ తరచూ వినియోగిస్తుంటుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో అంబానీ కుటుంబం ఎన్నో వేడుకలకు వెళుతుంది. దీనిని అయితే, అంబానీ ఫ్యామిలీ డ్రైవర్ లేదా ఆకాశ్ అంబానీ డ్రైవ్ చేస్తాడు.
బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్
అంబానీ ఫ్యామిలీ ఉపయోగించే కార్లలో బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ అతి ముఖ్యమైన మోడల్. ఆకాశ్ అంబానీ వద్ద ఉండే దీని ధర సుమారుగా రూ. 60 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. తన సోదరి ఇషా అంబానీ మరియు ఒకసారి కత్రినా కైఫ్‌ను కూడా ఆకాశ్ ఈ కారులోనే తీసుకెళ్లాడు.
బిఎమ్‌డబ్ల్యూ ఐ8 - అనంత్ అంబానీ
భారతదేశపు ఏకైక హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐ8. ఆడి ఇండియా యొక్క స్పోర్ట్స్ కారు అంబానీ కార్క లెక్షన్‌లో చోటు దక్కించుకుంది. దీనిని అనంత్ అంబానీ తరచూ ఎక్కువగా వాడుతుంటాడు. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఏకంగా లీటర్‌కు 47కిమీల మైలేజ్ ఇస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా యొక్క రెండవ అత్యంత ఖరీదైన మోడల్ ఐ8 హైబ్రిడ్. దీని ధర రూ. 2.14 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో నడిచే ఇది గరిష్టంగా 357బిహెచ్‌పి పవర్ మరియు 570ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ
కొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ సెడాన్ కారు. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నపుడు ఎక్కువగా ఈ కారునే ఎంచుకుంటారు. దీని ధర సుమారుగా 8 కోట్ల రుపాయలకు పైమాటే.
ప్రయాణికులకు భద్రతకు పెద్ద పేట వేసిన బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ కారులో సాంకేతికంగా 5.5-లీటర్ కెపాసిటి గల వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది కేవలం 6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.
ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?
సుమారుగా 168 కార్లను కలిగి ఉన్న ముఖేష్ అంబానీ: విమానాలు,లగ్జరీ నౌకలు ఇంకా ఎన్నో...!!