అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

భారతదేశంలోని రోడ్లు చాలా సవాళ్లతో కూడుకున్నవి. మనదేశంలో ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాహనాలు నడిపే వారిలో రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన లేకపోవడం, అధిక వేగంతో వాహనాలు నడపడటం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉండటం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనం నడిపేవారు మరియు అవతలి వారు ఇద్దరూ నష్టపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ నష్టం అంచనాలకు మించి ఉంటుంది.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన తమ ప్రాణాలను రక్షించుకోవడంతో పాటుగా ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చు మరియు వాహనాలకు జరిగిన నష్టాన్ని కూడా కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అలాంటి సమయంలో ప్రమాదం జరిగిన తక్షణమే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

డ్రైవింగ్ చేయడం ఆపేయండి

వాహనం నడుపుతున్నప్పుడు అనుకోని విధంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే వెంటనే వాహనాన్ని డ్రైవ్ చేయడం ఆపివేయడం. ఇది తప్పనిసరిగా అనుసరించాల్సినది మరియు చట్టపరమైన చర్య కూడా. మీ వాహనం వలన అవతలి వాహనానికి లేదా వ్యక్తికి లేదా ఇతరుల ఆస్తులకు చిన్న ప్రమాదం జరిగినా ఘటనా స్థలం నుంచి పారిపోకూడదు, అలా చేస్తే పోలీసులు మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. హిట్ అండ్ రన్ కేసులో భారీ జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

కాబట్టి, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే వరకూ సంయమనం పాటించాలి. ఎదుటి వ్యక్తులతో వాగ్వాదానికి లేదా కొట్లాటకు దిగుకూడదు. పోలీసులు వచ్చిన వెంటనే ప్రమాదం జరగడానికి గల కారణాలను క్లుప్తంగా వివరించండి. యాక్సిడెంట్స్ అనేవి ఎవ్వరూ కావాలని చేయరు, కొన్ని సందర్భాల్లో ఇవి అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. అందుకు గల కారణాలను పోలీసులకు వివరించడం మీకే బలాన్ని చేకూరుస్తుంది.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

అందరూ సురక్షితంగా ఉన్నారో లేదో చూసుకోండి

యాక్సిడెంట్ జరగగానే చాలా మంది షాక్‌కు గురవుతారు. ఆ షాక్‌లో వారికి తగిలిన గాయాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి, చిన్నపాటి ప్రమాదం జరిగినా సరే వెంటనే వాహనాన్ని వెంటనే నిలిపివేసి మీ వాహనం అలాగే ఎదుటి వాహనంలోని వ్యక్తులందరూ క్షేమంగా ఉన్నారా లేదో చూసుకోండి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ప్రధమ చికిత్స అందేలా చూడండి. వెంటనే అత్యవసర సహాయానికి కాల్ చేయండి. అవసరమైతే, పోలీసులు మరియు అంబులెన్స్‌కి సమాచారం అందించి క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించండి.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

వైద్య సహాయం తీసుకోండి

కొన్ని సందర్భాల్లో ప్రమాద తీవ్రతను అంచనా వేయడం చాలా కష్టం. అది వ్యక్తులకు గానీ లేదా వాహనాలకు గానీ. మీ వాహనంలో ఎల్లప్పుడూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చూసుకోండి. ప్రమాదంలో ఎవ్వరికైనా చిన్నపాటి గాయాలు అయితే, ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ సాయంతో ప్రథమ చికిత్స చేయండి. ఒకవేళ ఎవరైనా తీవ్రంగా గాయపడినట్లయితే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి. అవసరమైన వారికి తక్షణమే వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం అని గుర్తుంచుకోండి.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రమాదం గురించి తెలియజేయండి

ఇలాంటి సమయాల్లో వాహన ఇన్సూరెన్స్ ప్రాధాన్యత చాలా మందికి తెలుస్తుంది. మనకేం కాదులే అనే ధైర్యంతో చాలా మంది వాహనాలకు సరైన ఇన్సూరెన్స్ లేకుండానే నడుపుతుంటారు. ఇది చట్టరీత్యా నేరం మరియు ప్రమాద సమయాల్లో మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం. కాబట్టి, రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనం తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమాను కలిగి ఉండాలి. కుదిరితే, తమ స్వంత వాహనాల డ్యామేజ్ ను కూడా కవర్ చేసే సమగ్ర బీమాను కూడా కలిగి ఉంటడం ఇంకా మంచిది.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

యాక్సిడెంట్ తర్వాత ఎవ్వరకీ గాయాలు కాలేదని నిర్ధారించుకొని లేదా వైద్య సాయం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత మీ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను తెలియజేయండి. ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి కాల్ చేయడం ద్వారా మీరు వీలైనంత త్వరగా మీ క్లెయిమ్‌ను నమోదు చేసుకోవచ్చు. మీ వాహనం మరియు థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన నష్టం గురించి వారికి సవివరంగా తెలియజేయండి.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

ఫోటోలు తీయండి

ప్రమాదంలో మీ వాహనం మరియు ఇతరులకు జరిగిన నష్టాలను చూపించేందుకు వాటికి సంబందించిన ఫొటోలను తీయండి. ఇవి మీకు సాక్ష్యంగా కూడా పనికి వస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఈ ఫొటోలు చాలా కీలకంగా పనిచేస్తాయి. ప్రమాదంలోని నష్టాన్ని స్పష్టంగా చూపించడానికి మీరు వివిధ కోణాల నుండి ఫొటోలను తీయండి. వీడియో సాక్ష్యం కూడా మంచిదే. వీలైనంత వరకూ మీ వాహనంలో డ్యాష్‌క్యామ్ అమర్చుకుని ఉండేలా చూసుకోండి. ఇది అసలు ఎవరి తప్పు వలన ప్రమాదం జరిగిందనేది కూడా తెలియజేస్తుంది.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

మీ కారును వెంటనే రిపేర్ చేయించుకోండి

ప్రమాదంలో డ్యామేజ్ అయిన వాహనాన్ని వెంటనే రిపేరు చేయించుకోండి. అయితే, మీ స్వంత ఖర్చులతో రిపేరు చేయించుకోడవానికి ముందు, మరమ్మత్తు ఖర్చుల కోసం మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. మీ వాహనానికి కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే, అది ఎదుటి వారి వాహనానికి జరిగిన డ్యామేజ్‌ని మాత్రమే కవర్ చేస్తుంది. అదే, మీ వాహనానికి కాంపర్హెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటే అది మీ వాహనానికి అయిన డ్యామేజ్ మరియు మీ వాహనం వలన ఇతరులకు జరిగిన నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి, రిపేరుకు ముందు మీ పాలసీదారుతో చర్చించండి.

అయ్యయ్యో యాక్సిడెంట్ జరిగిందే ఇప్పుడెలా.. కంగారు పడకండి, ఈ చిట్కాలు పాటించండి..!

ఒకవేళ, మీ వాహన రిపేరు ఖర్చు మీరే భరించాల్సి వస్తే, తక్షణమే వాహనాన్ని సరైన మెకానిక్ లేదా షోరూమ్ లలో రిపేర్ చేయించుకోండి. అలాకాకుండా, ప్రమాదంలో జరిగింది చిన్న డ్యామేజ్ కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఆ తర్వాత మీ వాహనంలో పలు రకాల ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అస్సలు ఎవ్వరికీ రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. ఒకవేళ, దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రమాదానికి గురైతే, కంగారుపడకుండా పైన తెలిపిన చిట్కాలను పాటించండి.

Most Read Articles

English summary
Tips to follow when involved in vehicle accident details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X