ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

మరో రెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలో థియేటర్లలో గర్జించేందుకు వస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. హైదరాబాద్‌లో సంచరించే కార్ల అద్దాలపై నల్ల ఫిల్ములను (బ్లాక్ ఫిల్మ్ లేదా టింటెడ్ ఫిల్మ్) తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారును పోలీసులు ఆపారు.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

ఈ స్పెషల్ డ్రైవ్‌లో జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్‏తో పాటుగా ఆయన తనయుడు మరియు మరొక వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు సమాచరం. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను గుర్తించి వాటి అద్దాలపై అంటించిన బ్లాక్ ఫిల్మ్ లను మరియు ప్రత్యేకమైన స్టిక్కర్లను తొలగించారు.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

అనుమతి పొందిన వివిఐపిలకు మాత్రమే బ్లాక్ ఫిల్ములు ఉపయోగించవచ్చు..

సాధారణంగా, సెలబ్రిటీలు తమ అభిమానులకు కనిపించకుండా ఉండేందుకు కార్లకు నల్లటి అద్దాలను ఉపయోగిస్తుంటారు. నిజానికి, కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్ములను ఉపయోగించడం చట్టరీత్యా నేరం. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సెలబ్రిటీలు తప్ప ఇతరులెవరూ కూడా తమ వాహనాలపై బ్లాక్ ఫిల్ములను ఉపయోగించకూడదు. మోటార్ వాహన చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, బయటి వైపు నుంచి చూస్తే కారు లోపల విజిబిలిటీ సరిగ్గా ఉండాలి. దీనిని విజువల్ ట్రాన్స్మిషన్ లైట్‌ ద్వారా కొలుస్తారు.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

కారులోని అద్దాలకు ఎంత శాతం వరకూ టింట్ ఉండొచ్చు..?

మోటారు వాహనాల చట్టం 1989 ప్రకారం, అనుమతించదగిన పరిమితికి మించి దృష్టిని పరిమితం చేసే విండ్‌షీల్డ్స్ మరియు వాహనాల కిటికీలపై టింటెడ్ గ్లాస్ లేదా సన్ ఫిల్మ్‌లను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు 2012లో నిషేధించింది. ఈ నిబంధన ప్రకారం, ప్రతి మోటారు వాహనం యొక్క ఫ్రంట్ విండ్‌స్క్రీన్ మరియు రియర్ విండోలు 70 శాతం విజువల్ ట్రాన్స్మిషన్ లైట్‌ను అనుమతించాల్సిన అవసరం ఉందని మోటార్ వాహన చట్టం చెబుతోంది.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

అలాగే, ఈ చట్టం ప్రకారం, సైడ్ విండోస్ కూడా 50 శాతం విజువల్ ట్రాన్స్మిషన్ లైట్‌ను అనుమతించే ఫిల్మ్స్ లేదా టింటెడ్ గ్లాస్‌ను కలిగి ఉండాలి. అంటే, పోలీసులు కారును ఆపినప్పుడు, సదరు విండ్ షీల్డ్ ద్వారా లైటు వేసినప్పుడు కారులోని పరిస్థితులు లేదా పరిసరాలు తప్పనిసరిగా బయటకు కనిపించేలా ఉండాలనేదే ఈ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా నాలుగు చక్రాల వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో సుప్రీం కోర్డు నాలుగు చక్రాల వాహనాలకు డార్క్ టింట్ వాడకాన్ని నిషేధించింది.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఫేక్ స్టిక్కర్లు ఉపయోగిస్తున్నారు..

ట్రాఫిక్ స్టాప్‌ల నుండి తప్పించుకునేందుకు, చాలా మంది కార్లకు నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్లను ఉపయోగించి తిరుగుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు, గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్ మరియు ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న వాహనాలను కూడా గుర్తించి వాటిపై ఉన్న ఆ ప్రత్యేక స్టిక్కర్లను మరియు అద్దాలపై ఉన్న బ్లాక్ ఫిలింలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలకు మరియు నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలకు కూడా జరిమానాలు విధించారు.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

వైరల్ అయిన ఎమ్మెల్యే మనవడి నెంబర్ ప్లేట్ ఫొటో

సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతింది. అది కొందరికి గుర్తింపుని తెచ్చిపెడితే, మరికొందరికి చిక్కులు తెచ్చిపెడుతుంది. అలాంటి ఓ సంఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని ఓ యువకుడు తన బైక్ ముందు వైపు నెంబర్ ప్లేట్ పై "నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎమ్ఆర్ గాంధీ మనవడు" అని రాసి ఉంచిన ఫొటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాల్సిన చోట ఇలాంటి పిచ్చిరాతలు ఉండటంతో నెటిజెన్లు విమర్శల వర్షం కురిపించారు. ఆ ఫొటో కాస్తా అటూ ఇటూ షేర్ అయ్యి చివరికి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సీరియస్ అయిన పెద్దబాసులు వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా క్రింది అధికారులను అదేశించారు. నగరంలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే, జరిమానాలు విధించాల్సిందిగా కోరారు.

ట్రిపుల్ఆర్ (RRR) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపిన పోలీసులు.. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి!

మార్చి 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఆర్ఆర్ఆర్..

ఎన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తేజ్ ప్రధాన హీరోలుగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 25 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. డీవీవీ ఎంటర్ట్నైమెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్, శ్రియాశరన్ తదితరులు కీలకపాత్రలలో నటించారు.

Most Read Articles

English summary
Tollywood actor jr ntr car pulled over by cops for tinted windows details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X