ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంతో ప్రయాణించే టాప్-5 విమానాలు

దేశవిదేశాలకు ప్రయాణించడానికి ఉన్న ఏకైక రవాణా మార్గం ఎయిర్ ట్రావెల్. ఖండాతరాలలోని సుదూరం దేశాలను కేవలం కొన్ని గంటల్లోనే చేరుకుంటున్నాము. ఇందుకు అధిక వేగంతో ప్రయాణించే విమానాలు కీలకంగా నిలిచాయని చెప్పవ్

By N Kumar

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

దేశవిదేశాలకు ప్రయాణించడానికి ఉన్న ఏకైక రవాణా మార్గం ఎయిర్ ట్రావెల్. ఖండాతరాలలోని సుదూరం దేశాలను కేవలం కొన్ని గంటల్లోనే చేరుకుంటున్నాము. ఇందుకు అధిక వేగంతో ప్రయాణించే విమానాలు కీలకంగా నిలిచాయని చెప్పవ్చచు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఐదు విమానాలనే దూర ప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తున్నాయి.

ఇవాళ్టి కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే ఐదు విమానాల గురించి తెలుసుకుందాం రండి...

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

5. బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్

దూర ప్రాంత ప్రయాణాలకు ఎయిర్‌లైన్స్ సంస్థ ఎక్కువగా ఎంచుకుటున్న విమానాల్లో బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి. విశాలమైన క్యాబిన్ బోయింగ్ 777 విమానంలో రెండు శక్తివంతమైన ఇంజన్‌లు ఉన్నాయి. ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే 13,649కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

బోయింగ్ 777 విమానం యొక్క గరిష్ట వేగం గంటకు 1037కిలోమీటర్లు (0.84 మ్యాక్)గా ఉంది. తక్కువ నిర్వహణ ఖర్చు మరియు అధిక మైలేజ్ దీని సొంతం. ఈ విమానం జనరల్ ఎలక్ట్రిక్ జిఇ 90 మరియు ప్రాట్ అండ్ విట్నీ లేదా రోల్స్ రాయిస్ ట్రెంట్ 800 ఇంజన్‌లతో లభ్యమవుతోంది.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

4. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

నాలుగవ స్థానంలో ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సిరీస్ విమానం దూర ప్రాంత ప్రయాణాలకు ఎంచుకుంటున్న విమానాల్లో ఒకటి. రెండు ఇంజన్‌లు గల ఈ విమానంలో గరిష్టంగా 335 మంది వరకు ప్రయాణించవచ్చు. బోయింగ్ 767 తో పోల్చుకుంటే ఇందులో 20 శాతం మంది ఎక్కువ మంది ప్రయాణించవచ్చు.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం గరిష్ట వేగం గంటకు 1050 కిలోమీటర్లు (0.85 మ్యాక్)గా ఉంది. 787 సిరీస్‌లో ఉన్న 787-10 విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 11,908 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో జిఇ ఎలక్ట్రిక్ మరియు రోల్స్ రాయిస్ ఇంజన్‌లు ఉన్నయి.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

3. ఎయిర్‌బస్ ఏ380

విమానయాన రంగంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు గట్టి పోటీనిస్తున్న విమానం ఎయిర్‍‌బస్ ఏ380. ప్రపంచపు అతి పెద్ద ప్యాసింజర్ విమానంగా నిలిచిన ఎయిర్‌బస్ ఏ380లో గరిష్టంగా 544 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్‌బస్ ఏ380లో ప్రయాణిస్తే ఎయిర్‌ట్రావెల్‌లో ఉన్న విలాసవంతమైన అనుభూతిని పొందుతారు.

Picture credit: Airbus

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

ఎయిర్‌బస్ ఏ380 విమానం యొక్క గరిష్ట వేగం కూడా 1050 కిలోమీటర్లుగానే ఉంది. జిబి 7200 లేదా రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ ఆప్షన్‌లో లభించే ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 15,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రెండు అరలలో ఉన్న సీటింగ్ లేఔట్ ఇందులో ఉంది.

Picture credit: Airbus

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

2. బోయింగ్ 747-400

బోయింగ్ 747-400 ప్యాసింజర్ ప్లేన్ కూడా డబుల్ డెక్కర్ విమానం. ఇందులో ఎయిర్‌బస్ ఏ380 తరహా రెండు అరలలో ఉన్న సీటింగ్ లేఔట్ ఉంది. బోయింగ్ 747 సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న 747-400 విమానంలో నాలుగు ఇంజన్‌లు ఉన్నాయి. ఇందులో గరిష్టంగా 416 మంది వరకు ప్రయాణించవచ్చు.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

బోయింగ్ 747-400 విమానం గరిష్ట వేగం గంటకు 1056 కిలోమీటర్లు (0.855 మ్యాక్)గా ఉంది. ప్రాట్ అండ్ విట్నీ, జిటి ఎలక్ట్రిక్ మరియు రోల్స్ రాయిస్ నుండి సేకరించిన ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఇందులో ఒక్కసారి ఇంధనం నింపితే గరిష్టంగా 7,585కిమీల వరకు నాన్-స్టాప్‌గా ప్రయాణిస్తుంది.

Picture credit: Boeing

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

1. బోయింగ్ 747-8

బోయింగ్ 747 థర్డ్ జనరేషన్ వెర్షన్ 747-8 విమానాన్ని 2005లో పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో దేశాధ్యక్షులు ఈ విమానాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. అందులో అమెరికా అద్యక్ష విమానం కూడా ఇదే. ఇందులో గరిష్టంగా 410 మంది వరకు ప్రయాణించవచ్చు.

Picture credit: Wiki Commons

అత్యంత వేగంతో ప్రయాణించే విమానాలు

బోయింగ్ 747-8 విమానం ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంతో ప్రయాణించే విమానం. దీని గరిష్టం వేగం గంటకు 1062 కిలోమీటర్లు (0.86 మ్యాక్)గా ఉంది. నాలుగు శక్తివంతమైన ఇంజన్‌లు ఉన్న 747-8 ప్లేన్‌లో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే నాన్-స్టాప్‌గా 16,436కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది.

Picture credit: Wiki Commons

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: The fastest passenger plane in the sky
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X