వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

కారు సక్రమంగా పనిచేయాలంటే దానిలో ఆరోగ్యకరమైన ఇంజన్ ఉండటం ఎంత అవసరమో, అందులో చక్రాలు మరియు టైర్లు కూడా ఆరోగ్యకరంగా ఉండటం అంతే అవసరం. సాధారంగా, కార్లలో Wheel Alignment (వీల్ అలైన్‌మెంట్) అనేది చాలా కీలకమైన అంశం. వాహనాన్ని అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై నిత్యం ఉపయోగిస్తుండటం వలన కార్లలో వీల్ అలైన్‌మెంట్ దెబ్బ తింటుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

కార్లలో వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవటం వలన కార్లు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, కొన్ని ఈ సమస్య వలన కొన్ని ఊహించని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే, కార్లకు క్రమం తప్పకుండా వీల్ అలైన్‌మెంట్ చేయింటడం మంచిది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

సాధారణంగా, మనం మెకానిక్ షాపులకు వెళ్లినప్పుడు వీల్ అలైన్‌మెంట్ అనే పదం తరచుగా వింటూ ఉంటాం. నిజానికి కొంత మంది కొత్తగా కారు కొనేవారికి వీల్ అలైన్‌మెంట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. అసలు వీల్ అలైన్‌మెంట్ అంటే ఏమిటి? ఎందుకు అది అంత ముఖ్యమైనది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

వీల్ అలైన్‌మెంట్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, మీ కారులోని అన్ని 4 చక్రాలు మరియు టైర్లు సరిగ్గా ఒకే దిశలో తిరిగేలా చేయడమే దీని ప్రధాన లక్షణం. కారు ఎక్కువగా గతుకుల రోడ్లపై ప్రయాణించినప్పుడు లేదా పాట్ హోల్స్ మీద వేగంగా వెళ్లినప్పుడు ఆ కారులో వీల్ అలైన్‌మెంట్ పాడవ్వొచ్చు.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

చిన్న స్థాయిలో వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోయినా, అది మీ కారు పనితీరు మరియు నిర్వహణపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఏ కారైనా సరే దాని వీల్ అలైన్‌మెంట్ చాలా కచ్చితంగా ఉండాలి. సరైన చక్రాల అమరిక వల్ల కలిగే టాప్ 6 ప్రయోజనాలు ఏంటో చూద్దాం రండి.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

1. మైలేజ్ పెరుగుతుంది

మీ కారు చక్రాల అమరిక సరిగ్గా ఉన్నట్లయితే, అవి ఇంధనాన్ని ఆదా చేయటంలో సహకరిస్తాయి. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోయినట్లయితే, చక్రాలు మరియు టైర్లు సులువుగా దొర్లడం కష్టతరంగా ఉంటుంది. దీని వలన, వీటిని భారంగా ముందు నెట్టడానికి ఇంజన్ నుండి ఎక్కువ శక్తి మరియు టార్క్ ఖర్చు అవుతుంది. ఫలితంగా, ఇంధనం కూడా ఎక్కువ మండుతుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

తాజా నివేదికల ప్రకారం, వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేని కార్లలో మైలేజ్ సుమారు 10 శాతం వరకూ తగ్గుతుందని తేలింది. మైలేజ్ 10 శాతం తగ్గడం అంటే అది నిజంగా పెద్ద విషయమే. ముఖ్యంగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మండిపోతున్న మనలాంటి దేశాల్లో ఇది ఇంకా పెద్ద విషయం. కాబట్టి, మీ కారు మైలేజ్‌ను స్థిరంగా ఉంచుకోవటానికి అందులో వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండటం ఎంతో అవసరమని గుర్తుంచుకోండి.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

2. టైర్ల జీవితకాలం పెరుగుతుంది

మీ కారులో వీల్ అలైన్‌మెంట్ సమస్య ఉన్నట్లయితే, అది మీ కారు టైర్ల జీవితకాలాన్ని భారీగా తగ్గించేస్తుంది. చక్కగా మరియు సులువుగా తిరిగే చక్రాల వలన టైర్లు కూడా రోడ్డుపై సులువుగా దొర్లుతాయి. అదే, వీల్ అలైన్‌మెంట్‌లో సమస్య ఉంటే, ఆ భారమంతా టైర్ల పైన పడుతుంది. ఫలితంగా, టైర్లు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

నిజానికి అరిగిపోయిన టైర్లు కూడా వీల్ అలైన్‌మెంట్‌ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మీ కారులో మూడు కొత్త టైర్లు ఉండి, ఒక టైరు మాత్రం బాగా అరిగిపోయి ఉన్నట్లయితే, అది మీ కారు వీల్ అలైన్‌మెంట్‌ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా, మీ కారులో నాలుగు కొత్త టైర్లు ఉండి, అందులో ఒక టైరు మాత్రమే విచిత్రంగా అరిగిపోతున్నట్లయితే, ఆ కారులో వీల్ అలైన్‌మెంట్ సమస్య ఉన్నట్లు అర్థం.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఎప్పటికప్పుడు మీ కారులో వీల్ అలైన్‌మెంట్ మరియు టైర్ రొటేషన్ చేయించడం. ఇలా చేయడం వలన మీ కారు యొక్క టైర్ల జీవితకాలం పెరుగుతుంది. మైలేజ్ మాదిరిగానే టైర్ల జీవితకాలం పెంచడం చాలా మంచిది. ఎందుకంటే, ఇది మీకు డబ్బు ఆదా చేయడంలో సహకరిస్తుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

3. విడిభాగాలకు నష్టం తగ్గుతుంది

చక్రాల అమరిక (అదే వీల్ అలైన్‌మెంట్) సరిగ్గా లేకపోతే, మీ కారులోని ఇతర ముఖ్యమైన విడిభాగాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, కారులోని బేరింగ్స్, బ్రేకులు, సస్పెన్షన్ మరియు ట్రాన్స్‌మిషన్ వంటి వాటిలో కదిలే భాగాలు ఉంటాయి కాబట్టి ఇవి పాడయ్యే అవకాశం ఉంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

చక్రాల అమరిక సరిగ్గా లేకపోతే, ఈ భాగాలన్నీ కూడా సరిగ్గా పనిచేయడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అదే, చక్రాల అమరిక సరిగ్గా ఉన్నట్లయితే, ఇలాంటి కీలక విడిభాగాలకు జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా కారు రిపేర్లు కూడా తగ్గుతాయి. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

4. స్టీరింగ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది

మీ కారులో మెరుగైన వీల్ అలైన్‌మెంట్ ఉంటే, దాని స్టీరింగ్ వీల్ పనితీరు కూడా అంతే మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేని కార్లలో, స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడంలో మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టీరింగ్ వీల్ నియంత్రణ సరిగ్గా లేకపోతే, రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

మీ కారులో స్టీరింగ్ ఓవైపు లాగుతున్నట్లుగా అనిపించినా, లేదా స్టీరింగ్‌తో కారును అటు ఇటూ తిప్పడం భారంగా అనిపించినా అలాంటి కార్లలో వీల్ అలైన్‌మెంట్ సమస్య ఉందని గ్రహించాలి. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉంటే, స్టీరింగ్ విషయంలో తలత్తే అనవసరమైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

5. మెరుగైన హ్యాండ్లింగ్ / స్మూత్ రైడ్

మీ కారు యొక్క వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉన్నట్లయితే, దాని హ్యాండ్లింగ్ కూడా అంతే మెరుగ్గా ఉంటుంది. వీల్ అలైన్‌మెంట్ చక్కగా ఉన్న కార్లతో మీరు ఎలాంటి రోడ్లపై డ్రైవ్ చేసినా సరే, దాని హ్యాండ్లింగ్ ఖచ్చితంగా ఉంటుంది. వీల్ అలైన్‌మెంట్ ఖచ్చితంగా ఉండే కార్లు రోడ్లపై సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

6. మెయింటినెన్స్ ఖర్చు తగ్గుతుంది

రిపేర్లు తగ్గించుకోవటం అంటే మెయింటినెన్స్ ఖర్చు తగ్గించుకోవడమేనని గుర్తుంచుకోండి. కార్లలో క్రమం తప్పకుండా వీల్ అలైన్‌మెంట్, టైర్ రొటేషన్ చేయించుకోవటం వలన భవిష్యత్తులో ఎదురయ్యే అనవసరపు మరమ్మత్తులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా, ఆ కారు యొక్క మెయింటినెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

వీల్ అలైన్‌మెంట్ వలన కలిగే 7 చక్కటి ప్రయోజనాలు

7. భద్రత పెరుగుతుంది

మంచి వీల్ అలైన్‌మెంట్ కలిగిన కార్లను సురక్షితమైన కార్లుగా చెప్పవచ్చు. మీ కారు వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉంటే, రోడ్డుపై దాని నియంత్రణ కూడా మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా, రోడ్డుపై భద్రత కూడా పెరుగుతుంది. ప్రస్తుత వర్షాకాలపు సీజన్‌లో కారు సురక్షితంగా ఉండేలా చూసుకోవటం ఎంతో ముఖ్యం. ఇది మీకు మరియు మీతో పాటు ప్రయాణించే మీ బంధువులు మరియు స్నేహితులందరికీ ప్రయోజనం చేకూర్చే విషయం.

Most Read Articles

English summary
Top 7 benefits of wheel alignment in cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X