Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

అమెరికన్ కార్ బ్రాండ్ Ford India (ఫోర్డ్ ఇండియా) భారత మార్కెట్లో తన చివరి ఇన్నింగ్స్ ను ఆడుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ఐకానిక్ కార్ కంపెనీ మనదేశంలో తమ కార్ల ఉత్పత్తిని నిలిపివేయబోతోంది. భారత కార్ మార్కెట్లో ఫోర్డ్ అనే గొప్ప కార్లను ప్రవేశపెట్టింది. చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడుతున్నారు.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

భారతదేశంలో దశాబ్ధాల చరిత్ర కలిగిన అమెరికన్ కార్ బ్రాండ్ Ford (ఫోర్డ్), ఇక్కడి మార్కెట్లో తమకు సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టం రావటం మరియు కార్ల అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫోర్డ్ భారత మార్కెట్లో విక్రయించిన కార్లలో కొన్ని ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. ఆ కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

1. 2015 Ford EcoSport 1.0 Liter Eco Boost (ఫోర్డ్ ఎకోస్పోర్ట్)

ఫోర్డ్ బ్రాండ్ నుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వచ్చి, సెన్సేషన్ సృష్టించిన కారు Ford EcoSport 1.0 Liter Eco Boost. ఈ కారును తొలిసారిగా 2013 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేశారు. అప్పటి నుండి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారత మార్కెట్లో చాలా అగ్రెసివ్ గా ముందుకు సాగిపోయింది. అమ్మకాల పరంగా అద్భుతమైన పనితీరును కనబరిచి, కంపెనీ ఓ విజయవంతమైన కారుగా అవతరించింది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

2015 Ford EcoSport 1.0 Liter Eco Boost 1.0L కారును కంపెనీ తమ లేటెస్ట్ ఎకోబూస్ట్ ఇంజన్‌తో ప్రవేశపెట్టింది. ఈ కారులో 999 సీసీ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 123 బిహెచ్‌పి పవర్ ను మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇంజన్ వరుసగా 5 సంవత్సరాల పాటు 'ఇంజన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకుంది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

2. 2003 Ford Endeavour (ఫోర్డ్ ఎండీవర్)

విఐపిలు, సెలబ్రిటీలు మరియు ఎస్‌యూవీ ప్రియులు మెచ్చిన ఫుల్-సైజ్ ఎస్‌యూవీ Ford Endeavour (ఫోర్డ్ ఎండీవర్). భారత మార్కెట్లో ఈ విభాగంలో 18 సంవత్సరాలకు పైగా తన స్థానాన్ని నిలుపుకున్న మోడల్ ఫోర్డ్ ఎండీవర్. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త తరం ఫోర్డ్ ఎండీవర్, డిజైన్ మరియు స్టైల్ పరంగా దాని స్వంత ఆకర్షణను కలిగి ఉన్నప్పటికీ, ఇది 2003 ఫోర్డ్ ఎండీవర్‌తో పోటీపడదనే చెప్పాలి.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

ఫోర్డ్ బ్రాండ్ యొక్క క్లాసిక్ ఎస్‌యూవీగా మరియు దాని హెరిటేజ్ యొక్క షాడోగా ఫోర్డ్ ఎండీవర్ ఓ విజయవంతమైన కారుగా నిలిచింది. ఈ పెద్ద ఎస్‌యూవీలో, కంపెనీ ఆ సమయంలో శక్తివంతమైన 2.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో ఈ ఇంజన్ యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉండేది. అంతేకాదు. ఈ 2003 ఫోర్డ్ ఎండీవర్ 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌ తో కూడా లభించేది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

3. 2010 Ford Figo (ఫోర్డ్ ఫిగో)

2003 ఫోర్డ్ ఎండీవర్ మాదిరిగానే ఈ 2010 Ford Figo (ఫోర్డ్ ఫిగో) కూడా భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో దాని స్వంత పరిణామాన్ని కలిగి ఉంది. మొదటి తరం ఫిగో హ్యాచ్‌బ్యాక్ ను కంపెనీ 2010 లో ప్రవేశపెట్టింది. దీని కాంపాక్ట్ డిజైన్ మరియు ఫోర్డ్ బిల్డ్ క్వాలిటీ కారణంగా, ఇది అప్పట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉండేది. కంపెనీ ఈ కారును ఫియస్టా బి ప్లాట్‌ఫామ్‌ పై నిర్మించింది, ఫలితంగా ఫిగో తక్కువ కెర్బ్ వెయిట్ ను కలిగి ఉండేది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

ఈ కారును ఆ సమయంలో మార్కెట్‌లో 1.4-లీటర్ TDCI డీజిల్ ఇంజన్‌ తో విక్రయించబడింది. ఈ ఇంజన్‌ మంచి రైడ్ క్వాలిటీని మరియు బెటర్ మెయింటినెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ కారులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ కారు ఈ విభాగంలో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్ తో పోటీపడేది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

4. 2011 Ford Fiesta 1.6S (ఫోర్డ్ ఫియాస్టా)

అంతకు ముందు ఫోర్డ్ విక్రయించిన ఐకానిక్ సెడాన్ Ford Ikon (ఫోర్డ్ ఐకాన్) కి వారసుడిగా కంపెనీ తమ కొత్త Ford Fiesta 1.6S (ఫోర్డ్ ఫియాస్టా)ను ప్రవేశపెట్టింది. ఫియాస్టా సెడాన్ డిజైన్ ఐకాన్ సెడాన్ డిజైన్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా మరియు మోడ్రన్ గా ఉండేది. ఈ కారుతో, కంపెనీ భారతదేశ ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఓ పెద్ద విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఫియస్టా దాని క్రమబద్ధీకరించిన సస్పెన్షన్ సెటప్ మరియు హైడ్రాలిక్ స్టీరింగ్ కారణంగా ప్రజల్లో మంచి జనాదరణ పొందింది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

ఫోర్డ్ ఫియస్టా అత్యంత కఠినమైన రోడ్లపై కూడా మెరుగైన కంట్రోల్ ను అందించింది. ఫోర్డ్ ఫియస్టా మార్కెట్లో 1.4 లీటర్ టిడిసిఐ ఇంజన్‌ తో విక్రయించబడింది, కానీ తర్వాత కంపెనీ ఈ కారును కొత్త 1.6 లీటర్ డ్యూరాటోర్క్ ఇంజన్‌ తో పరిచయం చేసింది, ఇది గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని త్పత్తి చేసేది. అప్పట్లో ఈ ఇంజన్ చాలా సక్సెఫుల్ ఇంజన్ గా పరిగణించబడేది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

Image Courtesy: Bestcarmagz

5. 2008 Ford Ikon Generation 2 (ఫోర్డ్ ఐకాన్ సెకండ్ జనరేషన్)

ఫోర్డ్ తమ పాపులర్ ఐకాన్ కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. మనదేశంలో మొదటి తరం ఫోర్డ్ ఐకాన్ (Ford Ikon First Generation) కారును కంపెనీ తొలిసారిగా 1999లో ప్రవేశపెట్టింది. అప్పట్లో దాని పొడవాటి డిజైన్ తో ఇది అనేక కార్ ప్రియును ఆకర్షించింది. ఆ తర్వాత ఇందులో రెండవ తరం ఫోర్డ్ ఐకాన్ (Ford Ikon Second Generation) కారును కంపెనీ 2008లో ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ కారు లగ్జరీ సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో లాంచ్ చేయబడింది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

ఫోర్డ్ ఐకాన్ భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఈ కంపెనీకి ఓ విజయవంతమైన కారు మరియు మనదేశంలో ఈ అమెరికన్ కార్ బ్రాండ్ వ్యాపారాన్ని ముందుకు తీసువెళ్లడంలో ఇది కీలకపాత్ర పోషించింది. కంపెనీ ఈ కారును 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పరిచయం చేసింది, దీని సహాయంతో ఈ కారు మెరుగైన పనితీరును అందించింది.

Ford బ్రాండ్ నుండి మర్చిపోలేని టాప్ 6 కార్స్.. వీటిలో మీ ఫేవరెట్ కార్ ఉందా?

Image Courtesy: Rudolf Stricker/Wiki Commons

6. 2004 Ford Fusion (ఫోర్డ్ ఫ్యూజన్)

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) మరియు క్రాస్ఓవర్ విభాగాలు పెద్దగా ప్రాముఖ్యంలో లేనప్పుడు ఫోర్డ్ ఇండియా 2004 సంవత్సరంలో తమ Ford Fusion (ఫోర్డ్ ఫ్యూజన్) ను ప్రవేశపెట్టింది. ఈ కారు హై-రూఫ్ ను కలిగి ఉండి, ఎమ్‌పివి మరియు హ్యాచ్‌బ్యాక్ ల డిజైన్ ను కలగలిపి రూపొందించిన క్రాస్‌ఓవర్‌ గా ఉండేది. ఫోర్డ్ ఫ్యూజన్ కారును 5 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో పరిచయం చేశారు మరియు భారతదేశంలో క్రాస్ఓవర్ విభాగాన్ని ప్రారంభించిన ఘనత కూడా ఈ మోడల్ కే దక్కుతుందని చెప్పవచ్చు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Top six iconic cars from ford that indians will never forget details
Story first published: Saturday, September 11, 2021, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X