త్రిషకు కళ్లు తిరిగే కానుక ఇవ్వనున్న బాయ్‌ఫ్రెండ్

Written By:

తమిళ, తెలుగు చిత్రాల్లో ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు తెర వెనకకు వెళ్లిపోయిన ప్రముఖ నటి త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌ను పెళ్లాడబోతోందని, ఈ నెలలోనే నిశ్చితార్థం జరుగబోతోందని త్రిష్ తన ట్విట్టర్ పేజీలో పేర్కొంది. అంతేకాదు.. వీరద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోని కూడా ఆమె మైక్రోబ్లాగింగ్ సైటులో పోస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో.. నిశ్చితార్థం రోజున త్రిషకు అద్దిరిపోయే కానుక ఇవ్వాలని వరుణ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆ కానుక ఏంటంటే.. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన, అరుదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్. భారతదేశంలో అతి తక్కువ మంది ప్రముఖుల వద్ద ఉండే ఈ కారు ఇకపై త్రిష ఇంటి ముందు కూడా ఉండనుందన్నమాట.

త్రిషకు వరుణ్ గిఫ్ట్ చేయనున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఖరీదు సుమారు రూ.7 కోట్లట.

మరి ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

త్రిషకు బాయ్‌ఫ్రెండ్ కాస్ట్లీ గిఫ్ట్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

వేరియంట్స్

వేరియంట్స్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు మొత్తం నాలుగు బాడీ టైప్స్‌లో లభిస్తుంది. అవి ఫాంటమ్ సెలూన్, ఫాంటమ్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఫాంటమ్ కూపే.

హ్యాండ్ బిల్ట్

హ్యాండ్ బిల్ట్

ప్రతి రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ప్రత్యేకంగా చేతుల్తోనే తయారు చేస్తారు. ఈ కార్లను ఇంగ్లాండ్‌లోని గుడ్‌వుడ్ వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఒక కారును పూర్తిగా తయారు చేయటానికి దాదాపు 60 జతల చేతులు కలిసి పనిచేస్తాయి.

ఇంజన్

ఇంజన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6749సీసీ, 12-సిలిండర్, వి12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్, డ్రైవ్‌ట్రైన్

ట్రాన్సిమిషన్, డ్రైవ్‌ట్రైన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుంచి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో ఇంజన్ గరిష్టంగా 5350 ఆర్‌పిఎమ్ వద్ద 453 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ధర

ధర

భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.4.38 కోట్ల నుంచి రూ.4.60 కోట్ల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఫాంటమ్
రోల్స్ రాయిస్ ఫాంటమ్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
As per the sources, actress Trisha is going to get lavish swanky vehicle from her would-be husband. Varun Manian is likely to gift Trisha a beautiful, wonderful jet black color Rolla Royce Phantom car which is worth of Rs 7 Crores.
Story first published: Friday, January 9, 2015, 17:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos