రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

ప్రస్తుతం ఎక్కువమంది బైక్ వినియోగదారులు ఇష్టపడే బైకులలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్. ఇది కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే ఇటీవల ఒక వ్యక్తి తన TVS XL100 మోపెడ్‌ని ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లాగా రూపొందించాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

భారతీయ మార్కెట్లో వెహికల్ మాడిఫికేషన్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ కారణంగానే దేశంలో మాడిఫైడ్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మోడిఫైడ్ బైక్ తయారుచేసిన వ్యక్తి పేరు రాకేష్ బాబు. యితడు ఇంతకంటే ముందు సుజుకి సమురాయ్ బైక్ ఇంజిన్‌ను ఉపయోగించి వోక్స్‌వ్యాగన్ బీటిల్ తరహా కారును అభివృద్ధి చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

స్క్రాప్ భాగాలతో ఈ కారును డిజైన్ చేశాడు. ఈ కారును డిజైన్ చేసిన తర్వాత రాకేష్ బాబు చాలా మంది దృష్టిని ఆకర్షించగలిగాడు. కారు వీడియో వైరల్ కావడంతో, అవి యూట్యూబ్‌లో కూడా పాపులర్ అయ్యాయి. వీరికి పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కూడా వచ్చారు. రాకేష్ బాబు ఇప్పటి వరకు చాలా రకాల వాహనాలను డిజైన్ చేశారు.

అయితే ఇప్పుడు రాకేష్ బాబు TVS XL100 మోపెడ్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌గా మార్చాడు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 మోపెడ్‌ను బుల్లెట్ బైక్‌లా తయారు చేసేందుకు రాకేష్ బాబు చాలా కష్టపడ్డారు. ఆ క్రమంలో XL100 మోపెడ్‌లోని అనేక భాగాలు తీసివేయబడ్డాయి. అయితే ఇందులో బుల్లెట్‌కు ఉండవలసిన భాగాలు ఉన్నాయి. ఇందులో ఛాసిస్ నిర్మాణంలో స్వల్ప మార్పులు కూడా చేయబడ్డాయి.

XL100 మోపెడ్ లో ఉన్న రియర్ సస్పెన్షన్ స్థానంలో వేరొక సస్పెన్షన్ భర్తీ చేయబడింది. ఇంధన ట్యాంక్ స్థానం కూడా మార్చబడింది. పాత ఇంధన ట్యాంక్‌ను తొలగించి, ఫైబర్ గ్లాస్ డమ్మీ ట్యాంక్‌ను అమర్చారు. ఈ ట్యాంక్ బుల్లెట్ బైక్‌ను చాలా ఆకర్షణీయంగా చేసింది. సీట్లు, హెడ్‌లైట్లు, ఇండికేటర్ లైట్లు, సైడ్ ప్యానెల్‌లు మరియు బ్యాటరీ కంపార్ట్‌మెంట్ బుల్లెట్ బైక్‌కు సరిపోయేలా రీడిజైన్ చేయబడ్డాయి. ఈ తరహా చర్యల ద్వారా మినీ బుల్లెట్ బైక్‌ను రూపొందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

ఇంజిన్ విషయంలో రాకేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఈ వెహికల్ లో ఉన్న ఇంజిన్ XL100 మోపెడ్ లో ఉన్నది కాదని, ఇందులో వేరే ఇంజిన్ ఉపయోగించినట్లు తెలిసింది. బుల్లెట్ బైక్ ఇంజన్ లా కనిపించేలా ఫైబర్ ప్యానెళ్లతో తయారు చేసిన నకిలీ ఇంజన్ ఇది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

కిడ్స్ (అబ్బాయిలు) ఉపయోగించడానికి అనుకూలంగా ఈ మాడిఫైడ్ బైక్ రూపొందించబడి ఉంటుంది. సాధారణంగా భారతదేశంలో ఇలాంటి వాహనాలను సవరించడం నేరం. అయితే రాకేష్ బాబు పనిని మెచ్చుకోకుండా ఉండలేమని వాహనదారులు చెబుతున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

ఇదిలా ఉండగా ఇటీవల అస్సాంకు చెందిన వ్యక్తి నలుగులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఒక స్కూటర్ తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. ఈ స్కూటర్ కి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వింతగా కనిపించే స్కూటర్ తయారు చేసిన వ్యక్తి ఎడి ఆటోమొబైల్ వర్క్‌షాప్ యజమాని 'అతుల్ దాస్' అని తెలిసింది. కొన్ని వారాల క్రితమే ఈ స్కూటర్‌ను డెవలప్ చేసినట్లు అతడు చెప్పారు. ఈ స్కూటర్ తయారు చేయడానికి అతుల్ దాస్ రెండు స్కూటర్లను కొని వాటిని ఒకదానితో ఒకటి జతకట్టే విధంగా రూపొందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

ఈ స్కూటర్ తయారు చేయడం వల్ల అతని కుటుంబంలోని నలుగురు వ్యక్తులూ ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇందులో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తన కుటుంబం కోసమే ఈ స్కూటర్ ని ప్రత్యేకంగా రూపొందించుకోవడం జరిగింది అని ఆయన అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

ఈ స్కూటర్ తయారు చేయడం గురించి, అతుల్ దాస్ మాట్లాడుతూ, ఈ స్కూటర్‌ను తయారు చేయాలనేది నా కల, ఆ కల ఇప్పుడు నిజమయ్యింది. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు మరొక వాహనం తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

తాను మూడేళ్ల క్రితం ఈ పనిని ప్రారంభించినట్లు చెబుతూ ఇప్పటికి నా కల నిజమైంది అని చెప్పారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ స్కూటర్ తయారు చేయడానికి నాకు 30,000 రూపాయలు ఖర్చు అయ్యాయని అతడు చెప్పాడు. అతను తన భార్య, కుమార్తె మరియు కొడుకుతో కలిసి నగరంలోని అనేక ప్రాంతాలను ఈ స్కూటర్ పై సందర్శించినట్లు కూడా పేర్కొన్నాడు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా మారిన TVS XL100.. మీరూ చూడండి

భారతదేశంలో ఏదైనా వాహనాన్ని సవరించడం చట్టవిరుద్ధమని గమనించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు మోటారు వాహనాల చట్టం ప్రకారం, వాహనాలు పబ్లిక్ రోడ్లపై నడపకూడదు. ప్రజలు అలాంటి వాహనాలను రేసింగ్ ట్రాక్ లేదా ఫామ్‌హౌస్ వంటి ప్రైవేట్ ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. పబ్లిక్ రోడ్లపై కనిపిస్తే, వాహనాలను రవాణా శాఖ లేదా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tvs xl moped modified like a royal enfield bullet video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X