రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

Written By:

ఇండియాలో రహదారి నియమాలను పాటించకుండా ప్రయాణిస్తున్న వారే ఎక్కువ రోడ్డు ప్రమాదపాలవుతున్నారు. పరిమితికి మించిన వేగంతో డ్రైవ్ చేయడం, రహదారి నియమాలను ఉల్లంఘించడం మరియు వన్ వే, రాంగ్ రూట్లలో ప్రయాణించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయి.

ఇలాంటి ఉల్లంఘనలను నివారించడాకి పూనే పోలీసులు టైర్ కిల్లర్స్ అనే కాన్సెప్ట్‌తో వచ్చాయి. రాంగ్ రూట్లలో వెళ్లే ఎవరైనా సరే వలకు చిక్కిన చేపల్లా ఇక్కడ ఇరుక్కుపోవడం ఖచ్చితం.

టైర్ కిల్లర్స్

ఇండియాలో సగానికి పైగా డ్రైవర్లు మరియు రైడర్లు డ్రైవింగ్ రూల్స్‌ను అస్సలు లెక్కచేయరు. రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రమాదాలు తగ్గించాలంటే చట్టం మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. ఇందుకు పరిష్కారం, రూల్స్ కంటే కఠినమైన ప్రత్యామ్నాయాలను అమలు చేయడం.

టైర్ కిల్లర్స్

సిటీల్లో వాహనదారులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్న నియమాల్లో రాంగ్ సైడ్ డ్రైవ్ చేయడం ఒకటి. ఇది చాలా చిన్న అంశమే కావచ్చు. కానీ, ముందు వస్తున్న వాహనాలకు ఎదురెళ్లడం చాలా ప్రమాదకరం. సిటీల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది.

టైర్ కిల్లర్స్

ఇలాంటి, రోడ్డుకు రాంగ్ సైడ్ రైడ్ మరియు డ్రైవ్ చేసే డ్రైవర్ల ఆటకట్టించడానికి పూనే నగర ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త పద్దితిని అవలంభిస్తున్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించే అవకాశం ఉన్న మార్గాల్లో టైర్ కిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు.

టైర్ కిల్లర్స్

రాంగ్ రూట్లో ప్రయాణించడానికి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. కానీ, పూనే సిటీ రోడ్ల మీద ఇలాంటి టైర్ కిల్లర్లు రావడంతో వాహన చోదకులు రాంగ్ రూట్లో వెళ్లాలంటేనే బయపడుతున్నారు.

టైర్ కిల్లర్స్

టైర్ కిల్లర్స్ అంటే ఏమిటి? నో పార్కింగ్ ప్రదేశంలో కారు లేదా బైకును పార్క్ చేస్తే, ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు తరలిస్తారు. మరి, రాంగ్ రూట్లో ప్రయాణించే వారిని ఎదుర్కోవడానికి ఇనుప కమ్మీలతో చేసిన పదునైన పళ్లు గల ఐరన్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తారు. వీటినే టైర్ కిల్లర్స్ అంటారు.

టైర్ కిల్లర్స్

అంటే ఎంట్రీ ఉన్న రోడ్డులో వెళితే, మీ వాహనానికి మరియు బైకుల టైర్లకు ఎలాంటి నష్టం కలగదు. కానీ నో ఎంట్రీ మార్గంలో ప్రయాణిస్తే, వాలు కోణంలో ఏర్పాటు చేసిన పదునైన ఇనుప చువ్వలు టైర్లలోకి దూసుకెళతాయి.

Recommended Video - Watch Now!
Speeding Truck Loses Control On A Wet Road - DriveSpark
టైర్ కిల్లర్స్

పూనేలోని అమనోరా పార్క్ టౌన్‌లో ఏర్పాటు చేసిన పదునైన పళ్లు గల ఇనుప కేజ్‌ను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేశారు. ఇది, రోడ్డుకు ఒక వైపునున్న వాహనాలు మాత్రమే వెళ్లడానికి సహకరిస్తుంది. అలా కాదని వ్యతిరేక దిశలో వెళ్లితే టైర్లను డ్యామేజ్ చేస్తుంది.

టైర్ కిల్లర్స్

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలలో ఎక్కువగా ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇందులో చాలా వరకు డ్రైవర్ లేదా రైడర్ రహదారి నియమ నిభందనలు పాటించకపోవడమే ప్రధాన కారణం.

టైర్ కిల్లర్స్

దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించే వారి ఆటకట్టించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేయడం చక్కటి పరిష్కారమని చెప్పవచ్చ. త్వరలో, ముఖ్యమైన పట్టణాల్లో ఉన్న ప్రధాన కూడళ్లలో టైర్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి తీసుకొచ్చిన టైర్ కిల్లర్స్ కాన్సెప్ట్ గురించి మరియు హైదరాబాద్ మరియు విజయవాడ వంటి నగరాల్లో వీటి ఏర్పాటు పై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి....

టైర్ కిల్లర్స్

1.నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు గురించి మీకు తెలుసా...?

2.చాలా మందికి తెలియని ట్రాఫిక్ రూల్స్ మరియు వాటి ఫైన్ల వివరాలు

3.తమషా రహదారి గుర్తులు: సృజనాత్మక ఇండియాలో ఇలాంటివి చూశారా...?

4.క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ లింక్ చేసుకోండి

5.మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న బైకులు

Source: Rushlane

English summary
Read In Telugu: Tyre killers installed in pune to stop wrong side drivin

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark