మారుతి సుజుకి గురించి నమ్మశక్యంగాని ఆసక్తికరమైన నిజాలు!!

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత 2013 లో 30 వార్షికోత్సవ సంభరాలను జరుపుకుంది. ఇవాళ్టి కథనంలో దశాబ్దాల చరిత్ర ఉన్న మారుతి గురించి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం రండి..

By N Kumar

మారుతి సుజుకి గతంలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌గా పిలువబడేది. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ మరియు ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ సుజుకి యొక్క అనుబంధ సంస్థగా మారుతి సుజుకి కొనసాగుతోంది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

1. చిన్న కార్ల తయారీపై భారత ప్రభుత్వం పెద్దగా ఆసక్తికనబరచలేదు. టోక్యో మోటార్ షో లో పాల్గొన్నపుడు చిన్న కార్లను గమనించిన ప్రభుత్వ బృందం. ఇండియాలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ చిన్న కార్ల తయారీకి పచ్చ జెండా ఊపింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

2. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ప్రారంభించడానికి ముందే కార్ల తయారీకి కావాల్సిన సాంకేతికత అభివృద్ది మరియు రీసెర్చ్ కోసం 1970 లో మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించబడింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

3.1982లో, మారుతిలో 26 శాతం మార్కెట్‌ వాటాను 20.8 మిలియన్ డాలర్లకు సుజుకి సంస్థ కొనుగోలు చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

4. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఒక కారును నిర్మాణానికి కావాల్సిన డిజైన్, సాంకేతికత మరియు అసెంబ్లింగ్ వంటి వాటిన్నింటిని కేవలం 13 నెలల్లోనే సమకూర్చుకుని తమ మొదటి కారును ఉత్పత్తి చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

5. 1983లో, మారుతి 800 కారును రూ. 48,000 ల ధరతో విక్రయాలకు సిద్దం చేసింది. అయితే అప్పట్లో ఈ కారును సుమారుగా లక్షల రుపాయలు పెట్టి కొనుగోలు చేయడానికి సుముఖత చూపేవారు.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

6. మొదటి మారుతి 800 కారు తాళాలను మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ హర్పాల్ సింగ్‍‌కు అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ చేతులతో ప్రదానం చేయించారు.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

7. మారుతి సంస్థలో కార్ల తయారీ కాంట్రాక్టును ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీని తీసుకోమని సూచించింది. అయితే అందుకు సంజయ్ గాంధీ నిరాకరించడం... జపాన్ కంపెనీ సుజుకి ఈ కాంట్రాక్టును చేజిక్కించుకోవడం చకచకా జపిగిపోయాయి.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

8. భారత దేశపు మొదటి మారుతి 800 కారుగా ఖ్యాతిని గడించిన కారు ఇప్పుడు తుప్పుపట్టి పోయింది. దీని ఓనర్ మరణించిన తరువాత ఈ పరిస్థితి వచ్చింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

9. కేవలం మూడేళ్లలోపే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఒరిజినల్ కారును విడుదల చేసింది. తరువాత ఒరిజినల్ కారు ఎస్ఎస్800 కారు స్థానంలోకి సరికొత్త మోడల్‌ను రీప్లేస్ చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

10. ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో విడి భాగాల తయారీ, ఉద్యోగ కల్పనలో అనేక పాలసీలు మరియు ఆటో పరిశ్రమలో సప్లయర్ మరియు తయారీదారుని మధ్య సంభందాన్ని పటిష్టపరచడంలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ సంచలనాత్మక విప్లవం తీసుకొచ్చింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

11. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మార్కెట్లోకి కార్లను ఉత్పత్తి చేయడానికి రెండు సంవత్సరాల నుండే కస్టమర్లలో అంచనాలను పెంచుకుంటూ వచ్చింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

12. 1997 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఫేవరెట్ కారును ఉత్పత్తి చేయడంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మరియు 1997 నుండి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించడాన్ని వేగవంతం చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

13. మీరు నమ్మినా... నమ్మకపోయినా... ఆ కాలంలో ఉన్న దాదాపు సంపన్నులందరూ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌కు చెందిన కారును కొనుగోలు చేశారు.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

14. 1997 కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి 10 కార్లలో ఎనిమిది మారుతి కార్లే ఉండేవి. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఖ్యాతి ఏ మేరకు ఉందో మీకే తెలుస్తుంది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

15. 1990 కాలంలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే మారుతి 1000 సెలూన్ అత్యంత ఖరీదైన కారు (అప్పట్లో దీని ధర రూ. 3.81 లక్షలు). అయినప్పటికీ ఈ కారుకు భారీ డిమాండ్ ఉండేది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

16. అప్పట్లో కస్టమర్లకు ఈ కార్లను విక్రయించేందుకు కంప్యూటర్ ఆధారిత లాటరీ సిస్టమ్ ప్రవేశపెట్టి, లాటరీ ద్వారా ఎంపికైన వారికి మారుతి 1000 సెలూన్ కారున విక్రయించేవారు.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

17. మారుతి 1000 సెలూన్ కారుకు డిమాండ్ అధికంగా ఉన్న 1990 కాలంలో మారుతి 800 కార్ల ఉత్పత్తిని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తాత్కాలికంగా నిలిపివేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

18. మారుతి సుజుకి సంస్థకు ఉన్న గుర్గావ్ మరియు మానేసర్ ప్లాంట్లను కలపితే 220 క్రికెట్ స్టేడియంలకు సమానం అవుతాయి.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

19. మారుతి సుజుకి సంస్థ యొక్క 20 వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని 2005లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

20. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే ఉద్దేశంతో మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ కారును పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

21. తరువాత 2007లో ఎస్ఎక్స్4 సెడాన్ కారును యూరోపియన్ మరియు జపాన్ దేశాల్లో కంటే ముందుగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

22. మారుతి సుజుకి అసెంబుల్ పరికరాలు మరియు 1,700 రోబోలను ఉపయోగించుకుని కేవలం 12 సెకండ్లలో ఒక కారును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

23. తొలినాళ్లలో ఒక్క కారును ఉత్పత్తి చేయడానికి 13 నెలల సమయం తీసుకున్న మారుతి ఇప్పుడు కేవలం 12 సెకండ్లలోనే ఉత్పత్తి చేస్తోంది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

24. మూడేళ్ల క్రితం, 2014 ఫిబ్రవరిలో తమ పాత మోడల్ మారుతి 800 కారును ఉత్పత్తి చేయడం నిలిపేసింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

25. సుమారుగా 26 ఏళ్ల పాటు మారుతి సంస్థకు కేంద్ర ప్రభుత్వం నియంత్రణల నుండి ఉపశమనం లభించింది. అయితే ఇప్పుడు అనేక విదేశీ సంస్థల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

26. గణాంకాల ప్రకారం, మారుతి 800 కారు ద్వారా జరిగిన ప్రమాదాల్లో తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు మూడు లక్షల మంది మరణించారు.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

27. భారత్‌లో పుట్టిన మారుతి 800 కారు పాకిస్తాన్‌లో ఎక్కువ ప్రసిద్ది చెంది అనేక మంది ఫేవరెట్ కారుగా నిలిచింది.

మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురించి ఆసక్తికరమైన నిజాలు!

28. జపాన్‌కు చెందిన సుజుకి యొక్క అనుబంధ సంస్థగా ఉన్నుప్పటికీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ భారత దేశం గర్వించదగ్గ కారు కంపెనీ. మారుతి ప్రవేశపెడుతున్న ఉత్పత్తులతో ఇప్పటికీ భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది.

Most Read Articles

English summary
Read In Telugu Unknown Facts About Maruti Udyog Limited
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X