వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

భారతదేశంలో వాహన చట్టాలు తీవ్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాహనాలపై ఒక్క వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్ప ఇంకేమి ఉండకూడదని కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వాహనంపై పేర్లు కనిపిస్తే అటువంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ అడిషినల్ ట్రాన్స్ పోర్ట్స్ కమిషనర్ ముఖేష్ చంద్ర రాష్ట్రంలో వాహనాలపై ఇండికేటర్ స్టిక్కర్లను ఏర్పాటు చేసి వాహనాలపై ఇన్వాయిస్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇప్పుడు రాజకీయ పార్టీ స్టిక్కర్లు మరియు కులాలకు సంబంధించిన స్టిక్కర్లను వాహనాలపై వేసుకుని తిరుగుతున్న వాహనాలు చట్ట విరుద్ధమని ప్రకటించడం జరిగింది.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

వాహనంపై వ్యక్తుల పేర్లు, కులాల పేర్లు వంటి వాటిని వేసుకోవడం ఇప్పుడు పూర్తిగా నిషేధించబడింది. ఇలాంటి స్టిక్కర్లను ఉపయోగిస్తున్న వాహనాలకు ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మహారాజ్‌గంజ్ కమిషనర్ కార్యాలయం వెలుపల ఆపి ఉంచిన కారు వెనుక విండ్‌స్క్రీన్‌పై కులం పేరు రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా పోలీసులు ఈ వాహనానికి జరిమానా విధించారు.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

పోలీసులు ఇలా చేయడంతో కమిషనర్ కార్యాలయం లోపల గొడవ జరిగింది. ఎందుకంటే ఇది అక్కడి ఒక అధికారి వాహనం కాబట్టి. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి రావడంతో వాహనదారులు ముందు జాగ్రత్తగా తమ వాహనాలపై వేసుకున్న స్టిక్కరలను తొలగించడం ప్రారంభించారు. చాలామంది వాహనదారులు ప్రస్తుతానికి తప్పించుకునే నేపథ్యంలో అక్కడనుంచి వెళ్లిపోతున్నారు.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

పోలీసుల దర్యాప్తులో ప్రభుత్వ అధికారి ఈ కారు తన బంధువులలో ఒకరికి చెందినదని, అతనిది కాదని చెప్పారు. పోలీసులతో మాట్లాడుతూ, కుల స్టిక్కర్‌ను వాహనాలపై వేసుకుంటే జరిమానా విధిస్తారని విషయం తనకు తెలియదని చెప్పారు. ఇది చట్టవిరుద్ధమని తనకు తెలిసి ఉంటె తప్పకుండా దానిని తొలగించేవాడినని తెలిపారు.

MOST READ:మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; వివరాలు

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగానే ఈ విధమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ అధికారికి కూడా 5 వేల రూపాయలు జరిమానా విధించారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, వాహనంలో ఎక్కడైనా జాత్యహంకారాన్ని ఎత్తి చూపే పేర్లు ఉండటం చట్టవిరుద్ధం.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

చట్టం ప్రకారం, వాహనంపై కులం పేరు మొదలైనవి రాయడం ద్వారా జాత్యహంకారం పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి చర్య కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం, వాహనం యొక్క నంబర్ ప్లేట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే రాయవచ్చు. ఇది కాకుండా, వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై ఎలాంటి పోస్టర్ లేదా స్టిక్కర్ వేయడం నిషేధం.

MOST READ:ద్విచక్ర వాహనాల అమ్మకాలలో కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న తెలంగాణ

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టు వాహనాల నంబర్ ప్లేట్లలో పేర్లు తొలగించాలని రాష్ట్ర రవాణా శాఖను కోరింది. అటువంటి వాహనాల నంబర్ ప్లేట్లను తనిఖీ చేసి పేర్లను తొలగించాలని కూడా రాష్ట్ర రవాణా శాఖను కోర్టు ఆదేశించింది.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

నంబర్ ప్లేట్‌లోని పేరును తమ అధికారిక వాహనంలో రాజ్యాంగ స్థానాల్లో కూర్చున్న ఉద్యోగులు మాత్రమే ఉపయోగించవచ్చని కోర్టు పేర్కొంది. ఇది కాకుండా, వాహనంలో లేదా ప్రైవేట్ వాహనంలో ఇతర అధికారుల పేర్లను వ్రాయడానికి అనుమతి లేదు.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఈ విషయం విన్న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పంచాయతీ ఛీప్స్, పంచాయతీ సర్వెంట్స్, ప్రైవేటు సంస్థల కార్యదర్శులు, స్వచ్ఛంద సంస్థల అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా వారి పేర్లను వాహనాలపై రాస్తారని చెప్పారు.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

హైకోర్టు న్యాయమూర్తులు కూడా తమ ప్రైవేట్ వాహనంలో పేర్లు రాయడానికి అనుమతించరని ధర్మాసనం తెలిపింది. దిగువ కోర్టులలో పనిచేసే అధికారులను వారి ప్రైవేట్ వాహనాల నుండి వారి పేర్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, నేమ్ ప్లేట్ లేదా వాహనం యొక్క ఏదైనా ఇతర పేరు రాయడం ఖచ్చితంగా చట్టవిరుద్ధం. మోటారు వాహనాల చట్టంలో, రాజ్యాంగ పదవులలో నియమించబడిన అధికారులకు మాత్రమే అధికారిక వాహనం యొక్క నంబర్ ప్లేట్‌లో వారి పేర్లు రాయడానికి అనుమతి ఉంది.

Most Read Articles

English summary
UP Police Fined Government Official For Using Cast Name Sticker On Vehicle. Read in Telugu.
Story first published: Thursday, December 31, 2020, 10:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X