ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌషల్ ఓ సరికొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. తన ప్రేయసి (నటి) ఉపయోగించిన ఖరీదైన లగ్జరీ కారుకు సరిపోయే విధంగా ఉండేలా, అతను ఈ మల్టీ-మిలియన్ కారును ఎంచుకున్నాడు.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కంపెనీ దశే మారిపోయింది. ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ నుండి రేంజ్ రోవర్ ఎస్‌యూవీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంటుంది.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

రోల్స్ రాయిస్ కార్ల మాదిరిగానే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లు కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి మరియు స్టేటస్ సింబల్‌గా పరిగణించబడేవి. విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్, సాటిలేని పెర్ఫార్మెన్స్ మరియు అత్యుత్తమమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు ఈ కారు యొక్క ప్రధాన ప్రత్యేకతలు.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

అందుకే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ప్రపంచంలోని ధనికులకే కాదు, సెలబ్రిటీలకు కూడా అభిమాన కారుగా ఉంటుంది. తాజాగా, భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ నటుడు, ఉరి (URI) అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన విక్కీ కౌశల్ ఈ కొత్త లగ్జరీ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశాడు.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

ఇందుకు సంబంధించిన ఫొటోలను అతను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. విక్కీ కౌశల్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీకి సంబంధించిన ఖచ్చితమైన వేరియంట్ వివరాలు తెలియదు. కానీ, మార్కెట్లో ఈ కారు ధరలు సుమారు రూ.2.40 కోట్ల నుంచి రూ.4.38 కోట్ల మధ్యలో ఉన్నాయి.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, దేశీయ విపణిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బ్రాండ్ ఇటీవలే భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడిన రేంజ్ రోవర్ వేలార్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

దేశీయ విపణిలో రేంజ్ రోవర్ వేలార్ ప్రారంభ ధర రూ.79.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 246 హెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

కాగా, ఈ మోడల్‌లో పెర్ఫార్మెన్స్ వెర్షన్‌ను కోరుకునే వారి కోసం ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన స్టార్ హీరో

కొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 567 బిహెచ్‌పి శక్తి మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 283 కిలోమీటర్లు.

Most Read Articles

English summary
URI Fame Bollywood Actor Vicky Kaushal Buys A Brand New Range Rover SUV, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X