అమెరికా అధ్యక్షుడి కోసం అధికారిక విమానంతో పాటు రహస్య విమానం కూడా

Written By:

ఏ దేశ అధ్యక్షుడి కోసం అయినా అధికారిక విమానం మరియు కార్లు ఖచ్చితంగా ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. అయితే మొదటి సారిగా ఓ దేశం తమ దేశ అధ్యక్షుడి కోసం రహస్యంగా విమానాన్ని వినియోగిస్తున్నట్లు బహిర్గతమయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు ఉన్నారు, అయితే వారందరిలో అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన అధ్యక్షుడు అమెరికా దేశాధినేత. ప్రపంచ దృష్టి ఈయన మీదే ఉంటుంది.
Picture credit: ABPIC/ @charlie Stewart 

అమెరికా శత్రు దేశాలు మరియు టెర్రరిస్టులు అమెరికా అధ్యక్షుడి అంతాన్ని కోరుకుంటారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రతలో భాగంగానే ఇలా అధికారిక మరియు రహస్య అధికారిక విమానాలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

అమెరికా అధ్యక్షుడు ఎక్కడి వెళ్లాలన్నా అధ్యక్షుడి భద్రతా విభాగం అధికారికంగా ఎయిర్ ఫోర్స్ వన్ మరియు కాన్వాయ్‌గా మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను అందుబాటులో ఉంచింది. ఎయిర్ ఫోర్స్ వన్ ద్వారా అది అధ్యక్షుడి విమానమే అని అందరూ గుర్తించే అవకాశం ఉంది.
Picture credit: Flickr/ Fasil Avgeek 

అమెరికా అధ్యక్షుడి ప్రయాణాన్ని గోప్యంగా ఉంచాలన్నా, ఆయన రహస్య ప్రయాణాలు చేయాలన్నా అందుకు ఎయిర్ ఫోర్స్ వన్ బదులు రహస్య విమానాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం అధ్యక్షుడి భద్రతా విభాగం రహస్య విమానాల్ని అందుబాటులో ఉంచుతూ వచ్చింది.

ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వన్ మూడు సీక్రెట్ విమానాలను అధ్యక్షుడి రహస్య ప్రయాణం కోసం అందుబాటులో ఉంచింది.
Picture credit: ABPIC/ @Erik Frikke 

ఈ విమానాలు ఎలాంటి ఎక్ట్సీరియర్ సొబగులు లేకుండా చూడటానికి సాధారణ విమానాల తరహాలోనే ఉంటాయి. వీటిని 1985లో కొనుగోలు చేశారు.
Picture credit: ABPIC/ @Erik Frikke 

యుద్ద సామాగ్రి రహిత గల్ఫ్‌స్ట్రీమ్ IV వీఐపీ విమానాలను ఎయిర్ ఫోర్స్ వన్ కొనుగోలు చేసింది. ఒక్కో గల్ఫ్‌స్ట్రీమ్ IV వీఐపీ విమానంలో రోల్స్ రాయిస్‌కు చెందిన రెండు టే టుర్బో ఫ్యాన్ ఇంజన్‌లు కలవు.
Picture credit: ABPIC/ @Russ Smith 

ఒక్కో గల్ఫ్‌స్ట్రీమ్ IV వీఐపీ విమానంలో 12 నుండి 16 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇవి పాత విమానాలు కాబట్టి ఇందులో ఆధునిక నియంత్రికలు మరియు మోడ్రన్ విమానాల తరహాలో ఇంస్ట్రుమెంటేషన్‌ లేదు.
Picture credit: ABPIC/ @Erik Frikke 

అయితే ఎయిర్ ఫోర్స్ వన్ బృందం వీటిని చక్కగా నిర్వహిస్తూ వచ్చింది. ఎల్లప్పుడూ ప్రయాణానికి సిద్దంగా ఉండేందుకు యుద్ద విమానాల తరహాలో వీటి నిర్వహణ చేపట్టడం జరిగింది.
Picture credit: Flickr/ Fasil Avgeek  

గల్ఫ్‌స్ట్రీమ్ విమానాలను అమెరికా ఎయిర్ ఫోర్స్ సి-20సిఎస్ అని పరిగణిస్తుంది. ప్రమాద సంక్షోభం తీవ్రంగా ఉన్నపుడు సురక్షితంగా అధ్యక్షుడిని తరలించడానికి అధికారిక విమానాన్ని కాకుండా రహస్య విమానాన్ని ఉపయోగించేందుకు ఉద్దేశించినది.
Picture credit: Flickr/ TCav 

దేశవ్యాప్తంగా యుద్ద భయాందోళనలు ఉన్నపుడు దేశవ్యాప్తంగా వైమానిక దళం ఓ డజను సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాలను ఎంచుకుంటుంది. భయాందోళనకర పరిస్థితులు ఎదురైనపుడు ఎయిర్ ఫోర్స్ వన్ బృందం ఈ సీక్రెట్ విమానాలను వినియోగించిన అధ్యక్షుడిని తరలిస్తూ ఉంటారు.
Picture credit: ABPIC/ @Kevin colbran 

గల్ఫ్‌స్ట్రీమ్ విమానాలు ఎయిర్‌ ఫోర్స్‌లో చాలా ప్రత్యేకమైనవి విమానంలోని ఉన్నపురాతణ నియంత్రణలు అనుమానాస్పదం అణ్వాయుధాల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పల్స్ కంటికి దొరికే అవకాశం చాలా తక్కువ.

ఈ సీక్రెట్ విమానాలు ఎయిర్ ఫోర్స్ యొక్క 89 వ ఎయిర్ లిఫ్ట్ విభాగంలో భాగంగా ఉన్నాయి.

English summary
Read In Telugu About US President's Secret Planes
Story first published: Monday, May 8, 2017, 18:27 [IST]
Please Wait while comments are loading...

Latest Photos