విరాట్ కోహ్లి కార్ కలెక్షన్‌లోకి మరొక ఖరీదైన లగ్జరీ కారు!

Written By:

సచిన్‌కు బిఎమ్‌డబ్ల్యూ కార్లు... ధోనికి హమ్మర్... కార్లంటే విపరీతమైన ఇష్టం. మరి నేటి తరం క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లికి ఏ కార్లంటే ఇష్టం...? అందరికీ తెలిసిన సమాధానం - ఆడి. మీరు చదివింది నిజమే... విరాట్ కోహ్లీ ఆడి స్పోర్ట్స్ కార్లకు బానిసైపోయాడు. దీనిని నిజం చేసేలా మరో లగ్జరీ కారును ఎంచుకుని తనకు ఆడి కార్లంటే ఎంత ఇష్టమో చెప్పకనేచెప్పాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

భారత క్రికెట్ కెప్టెన్ మరియు యువ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఆడి కార్ల లగ్జరీ గ్యారేజిలోకి మరో ఖరీదైన కారును చేర్చుకున్నాడు. ఆడి ఇండియా అందుబాటులోకి తెచ్చిన న్యూ జనరేషన్ ఆడి క్యూ7 ను కొనుగోలు చేశాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

విరాట్ కోహ్లి మొదటి కారు ఆడి కారే కావడం విశేషం. ప్రస్తుతం విరాట్ వద్ద ఆర్8, ఆర్ ఎల్ఎమ్ఎక్స్, ఏ8ఎల్ సెడాన్ కార్లు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

విరాట్ ఎంచుకున్న సరికొత్త ఆడి క్యూ7 45 టిడిఐ కర్రెరా వైట్ కలర్ కారును ఆడి ఇండియా విభాగాధిపతి రాహిల్ అన్సారీ విరాట్‌కు అందజేశాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

ఈ సంధర్భంగా ఆడి గురించి విరాట్ మాట్లాడుతూ, ఆడి తయారు చేసే కార్లకు నేను చాలా కాలం నుండి అభిమాన మరియు ఔత్సాహిక కొనుగోలుదారుడిని, ఆడి తమ ఉత్పత్తుల ద్వారా యువకుల్లో యవ్వన శక్తిని రగిలిస్తుందని చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

కోహ్లీ కొనుగోలు చేసే ప్రతి కారుకు వెనుక ఓ కారణం ఉంటుంది. గుడ్డిగా కాకుండా తాను కొనుగోలు చేసే ప్రతి కారు యొక్క ప్రత్యేకతలు మరియు దాని సాధ్యాసాద్యాలను పరిశీలించి మాత్రమే ఎంచుకుంటానని తెలిపాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

మరి ఆడి క్యూ7 ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయానికి వస్తే, కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి... ఆడి క్యూ7 మిగతా స్పోర్టివ్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే లైట్ వెయిట్‌గా ఉంటుంది.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

లగ్జరీ స్పోర్టివ్ ఎస్‌యూవీ ఎంపిక చేసుకోదలిస్తే... అత్యుత్తమ లగ్జరీ స్పోర్టివ్ ఎస్‌యూవీ ఈ ఆడి క్యూ7 కారు. దాదాపు అన్ని స్పోర్టివ్ లక్షణాలను ఇది కలిగి ఉంది.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

సాంకేతికంగా శక్తివంతమైన ఇంజన్ గల లగ్జరీ సెడాన్ ఈ ఆడి క్యూ7. ఇందులో 3 లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఇందులో కలదు. తద్వారా గరిష్ట టార్క్ మరియు పవర్ నిరంతరం ఉత్పత్తి చేస్తుంది.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

తన వద్ద ఉన్న లగ్జరీ కార్ల జాబితాలోకి ఆడి క్యూ7 లగ్జరీ స్పోర్టివ్ కారును చేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

విరాట్ ఎంచుకున్న ఆడి క్యూ7 లగ్జరీ సెడాన్‌లో ఆడి ఇండియా 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న టిడిఐ డీజల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 248బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

అంతే కాకుండా ఆడి ఇండియా విభాగం 2016 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద 252బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2-లీటర్ల సామర్థ్యం ఉన్న టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

పైన తెలిపిన రెండు ఇంజన్ వేరియంట్లు ఉన్న క్యూ7 కారులో 8-స్పీడ్ ట్రిప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ అనుసంధాం కలదు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

ఆడి తమ క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గుండా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

క్యూ7 పనితీరు మరియు మెకానికల్‌ పరంగా అత్యాధునిక సాంకేతికతను అందివ్వడం మాత్రమే కాకుండా ఎక్ట్సీరియర్ మరియు డిజైన్ పరంగా ఫీచర్లు మరియు డిజైన్ లక్షణాలను ఇందులో గమనించివచ్చు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

సరికొత్త న్యూ జనరేషన్ ఆడి క్యూ7 లో మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, కొత్త సింగల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు 20-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ చక్రాలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

ఇంటీరియర్‌లో ఆడి సంస్థకు చెందిన ఎమ్ఎమ్ఐ టచ్ ద్వారా ఆపరేట్ చేయగల ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అదే విధంగా బ్లూటూత్ మరియు యుఎస్‌బి పోర్ట్‌ల అనుసంధానంతో మ్యూజిక్ ప్లే చేయగల ఆడి సౌండ్ సిస్టమ్ కలదు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

ఆడి ఈ క్యూ7 ఇంటీరియర్‌లో 12.7-అంగుళాల పరిమాణం ఉన్న ఆడి వర్చువల్ కాక్‌పిట్ స్క్రీన్ కలదు.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

నూతన ప్రమాణాలతో ఆడి అభివృద్ది చేసిన ఈ సరికొత్త క్యూ7 ఎస్‌యూవీ లోని డీజల్ వెర్షన్ లీటర్‌కు 14.75 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని ఆడి పేర్కొంది. ఈ శ్రేణిలో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల లగ్జరీ ఎస్‌యూవీ ఇదే.

విరాట్ కోహ్లీ ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ

ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ ధరలు...

  • ఆడి క్యూ7 ధర రూ. 80,95,000 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)
  • ఆడి క్యూ7 ధర రూ. 75,26,520 లు ఎక్స్-షోరూమ్(హైదరాబాద్)
  • ఆడి క్యూ7 ధర రూ. 90,70,977 లు ఆన్ రోడ్ హైదరాబాద్.
English summary
Read In Telugu To know More About Virat Kohli Gets The New Audi Q7 For His Car Collection

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark