విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన రెండు కొత్త లగ్జరీ కార్లు, ఇవే.. మీరు చూసారా..!!

సాధారణంగా సినీ తారలకు, రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు మరియు క్రికెటర్లకు లగ్జరీ కార్లు మరియు బైకులంటే చాలా ఇష్టం. ఈ సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పటికే మనం చాలామంది ప్రముఖుల కొత్త కార్లను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇందులో ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం, ఇందులో భాగంగానే ఇతడు చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో సూపర్ కార్లు మరియు లగ్జరీ SUV లు కూడా ఉన్నాయి. ఐతే కాకుండా కోహ్లీ భారతదేశంలో ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ కారణంగానే ఇతడు గతంలో టాప్-ఆఫ్-లైన్ ఆడి కార్లను పొందాడు. అయితే కోహ్లీ ఇప్పుడు ఆడి కంపెనీ యొక్క మరో కొత్త కార్ తన గ్యారేజిలో చేర్చినట్లు సమాచారం.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ ఇటీవల కొత్త ఈ-ట్రాన్ మరియు ఈ-ట్రాన్ జిటి తన గ్యారేజీలో చేర్చారు. ఇటీవల కాలంలోనే ఇతడు బ్లూ కలర్ ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ SUV మరియు రెడ్ కలర్ ఆడి ఈ-ట్రాన్ జిటి ఫోర్-డోర్ కూపేలో ప్రయాణిస్తున్న ఒక వీడియో కూడా బయటపడింది. ఈ రెండు కార్లు ఆడి ఇండియా ఒరిజినల్ కంపెనీ, స్కోడా ఆడి ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేయబడ్డాయి.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

విరాట్ కోహ్లీ ఆడి కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా సుదీర్ఘ కాలం ఉండటం వల్ల, ఇతనికి ఈ రెండు కార్లను కంపెనీ గిఫ్ట్ గా అందించినట్లు తెలిసింది.

ఇందులో కోహ్లి ప్రయాణించిన బ్లూ కలర్ ఆడి E-Tron SUV దాని శ్రేణిలో టాప్ E-Tron 55 వేరియంట్, ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కలయికతో ఆల్-వీల్-డ్రైవ్ డిజైన్‌ను పొందుతుంది. ఈ-ట్రాన్ SUV యొక్క కంబైన్డ్ మోటార్లు 402 బిహెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలవు. ఈ SUV యొక్క గరిష్ట పరిధి 484 కిలోమీటర్లు. ఇది 95 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

E-Tron 55 వేరియంట్ యొక్క ఈ స్పెషల్ వేరియంట్ ధర రూ. 1.18 కోట్లు. ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ఈ-ట్రాన్ 50, ఈ-ట్రాన్ 55 మరియు ఈ-ట్రాన్ 55 స్పోర్ట్‌బ్యాక్ అనే మూడు వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

ఈ-ట్రాన్ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఏబీఎస్ విత్ బ్రేక్ అసిస్ట్, లెన్ డిపార్చర్ వార్నింగ్ మరియు పార్క్ అసిస్ట్ ఫంక్షన్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

ఇక ఈ వీడియోలో కనిపించే రెడ్ కలర్ ఆడి ఈ-ట్రాన్ విషయానికి వస్తే, ఇది జిటియు టాప్-వేరియంట్. ఇది ముందు మరియు వెనుక ఇరుసులపై ఎలక్ట్రిక్ మోటార్‌తో ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతుంది, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి, ఇది 637 బిహెచ్‌పి పవర్ మరియు 830 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

ఈ కొత్త ఈ-ట్రాన్ జిటియు 84 కిలోవాట్ లిథియం లిథియం-అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది గరిష్టంగా 472 కిమీల పరిధిని అందిస్తుంది.ఈ వేరియంట్ ధర రూ. 2.16 కోట్లు. ఈ కారు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారతదేశానికి దిగుమతి చేయబడుతుంది. దీనిని జర్మనీలోని ఆడి బోలింగర్ హాఫ్ యూనిట్‌లో తయారు చేశారు.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

ఈ ఎలక్ట్రిక్ కార్ కూపే E-Tron మరియు RS E-Tron అనే రెండు మోడళ్లలో విక్రయించబడింది. ఆడి E-Tron GT కారు 4,989 మిమీ పొడవు, 1,964 మిమీ వెడల్పు, 1,418 మిమీ ఎత్తు మరియు 2,903 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది. ఈ కారు మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఇబిజ్ వైట్, అజూర్ బ్లూ, ఫ్లోరిస్ట్ సిల్వర్, కెమోరా గ్రే, మైథోస్ బ్లాక్, సుజుకి గ్రే, టాక్టికల్ గ్రీన్, టాంగో రెడ్ మరియు డేటోనా గ్రే. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

సెలబ్రిటీ ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా సెలబ్రిటీలకు ఆడి తన ఆధునిక కార్లను అందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆడి కార్లను కలిగి ఉన్న విరాట్ కోహ్లీతో పాటు, బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్ మరియు కియారా అద్వానీ దంపతులకు కూడా ఆధునిక కార్లను అందించింది.

విరాట్ కోహ్లీ గ్యారేజీలో చేరిన కొత్త కార్లు.. మీరు చూసారా..!!

ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి గ్యారేజీలో ఆడి ఆర్8, ఆర్8 LMX, ఆర్8 వి10 ప్లస్, ఏ8 ఎల్ డబ్ల్యు12 క్వాట్రో, ఆర్ఎస్5, ఎస్6, క్యూ7 మరియు క్యూ8 వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు రేంజ్ రోవర్ వోగ్, లంబోర్గిని గల్లార్డో, బెంట్లీ కాంటినెంటల్ జిటి మరియు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

Most Read Articles

English summary
Virat kohli gets new audi e tron and e tron gt electric cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X