అదుపుతప్పి భారీ వేగంతో ప్రహరీని ఢీకొన్న వ్యాగన్ఆర్: సీసీటీవీ ఫుటేజిలో రికార్డయిన ప్రమాదం

Written By:

మన దేశంలో కొన్ని లక్షల మంది వద్ద వాహనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరగడం, రోడ్డు ప్రమాదాల కారణంగా కొంత మంది చనిపోతూ ఉంటారు. మన ఇండియాలో ఇది ప్రతినిత్యం సహజం. ప్రమాదాల గురించి తెలుసుకున్న తరువాత తక్కువ వ్యవధిలోనే మరచిపోతాం. ఎందుకంటే ఆ ప్రమాదాలను ప్రత్యక్షంగా చూడం కాబట్టి. నిజంగా రోడ్డు ప్రమాదం జరిగే సందర్భం ఎంత భయంకరంగా ఉంటుందో నేటి కథనం లోని వీడియో ద్వారా వీక్షించండి...

అదుపుతప్పి భారీ వేగంతో ప్రహరీని ఢీకొన్న వ్యాగన్ఆర్

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడిబిది ప్రాంతంలోని మస్తికట్టేలో చోటు చేసుకుంది. మారుతి వ్యాగన్ ఆర్ కారు అత్యధిక వేగంతో వచ్చి మాన్విత్ అపార్ట్‌మెంట్‌కు ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టింది.

అదుపుతప్పి భారీ వేగంతో ప్రహరీని ఢీకొన్న వ్యాగన్ఆర్

ఈ ఘటనలో ప్రహరీ కూలిపోగా ప్రమాదానికి గురైన కారు పసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

అదుపుతప్పి భారీ వేగంతో ప్రహరీని ఢీకొన్న వ్యాగన్ఆర్

వివరాల్లోకి వెళితే, రోన్నీ మస్తికట్టె అనే వ్యక్తి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌లో అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ వచ్చాడు. అపార్ట్‌మెంట్ వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రక్కనే ఉన్న కాంపౌండ్‌వాల్‌ను ఢీకొని, ముందు వైపు పార్క్ చేసి ఉన్న స్విఫ్ట్‌ను బలంగా తాకి రోడ్డు మీద బోల్తాపడింది.

అదుపుతప్పి భారీ వేగంతో ప్రహరీని ఢీకొన్న వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్ కారును నడుపుతున్న రోన్నీ మస్తికట్టేకు చిన్న గాయాలు మినహాయిస్తే, రెండు కార్లలో ఉన్న మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తరువాత స్విఫ్ట్ డిజైర్ కారులో ఉన్న మహిళ మరియు పాప బయటకు వచ్చారు. ఈ ప్రమాదం నుండి వారిద్దరూ అదృష్టవశాత్తు తప్పించుకున్నారు.

ప్రమాదానికి గల కారణం

ప్రమాదానికి గల కారణం

ప్రమాదం జరిగిన సందర్భంలో వర్షం ఎక్కువగా ఉంది, దీంతో రోడ్డు మీద నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు హైడ్రోప్లేనింగ్‌కు గురయ్యి, అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది.

హైడ్రోప్లేనింగ్ ఎలా ఏర్పడుతుంది?

హైడ్రోప్లేనింగ్ ఎలా ఏర్పడుతుంది?

నీరు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద అధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు నీటి యొక్క పీడనం వాహనం టైర్ల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నీరు చక్రాల క్రింద నుండి ప్రక్కకు వెదజల్లినప్పటికీ, కారు టైర్లకి మరియు రోడ్డుకు మధ్య మందంతో నీటి పొర ఒక ఏర్పడుతుంది. ఈ సమయంలో స్టీరింగ్, బ్రేక్ మరియు పవర్ కంట్రోల్ మీద పట్టు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. దీనినే హైడ్రోప్లేనింగ్ అంటారు.

ప్రమాద ఘటనను వీడియో ద్వారా వీక్షించగలరు....

English summary
Read In Telugu: WagonR Crashes Into Concrete Wall And Swift Dzire
Story first published: Tuesday, June 13, 2017, 15:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark