అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింత నియామాలు

By Anil

రవాణాలో భద్రతారిత్యా ప్రమాదాలను అరికట్టడానికి ఎన్నో రకాల నియమాలు అమలులో ఉంటాయి. వాటిని పాటించని వారికి అదే స్థాయిలో శిక్షలు, జరిమానాలు (ఫైన్) వంటివి ఉంటాయి. ఇవి మనందిరికీ బాగానే సుపరిచితం.

అయితే ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని భయంకరమైన నియమాలు అమలులో ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే ఆదివారాల్లో కార్లను కడగడం నేరం, డ్రైవింగ్ చేస్తూ మధ్యపానం చేయవచ్చట. ఇలాంటి ఎన్నో రకాల నియమాలు మన ఊహలకందని రీతిలో అమల్లో ఉన్నాయి. అందులో కొన్ని భయంకరమైన నియమాలను క్రింది కథనంలో చూద్దాం రండి...

 16. ఇలాంటి బట్టలేసుకోకూడదు

16. ఇలాంటి బట్టలేసుకోకూడదు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి‌స్కోలో ఇలా ట్రౌసర్లు, చెడ్డీలతో ధరించి కార్లను కడగకూడదు. అలా కాదని కడిగారంటే భారీ జరిమానాలు చెల్లిచాల్సిఉంటుంది.

15. నిజమా...

15. నిజమా...

నిజమేనండి, కారు లేదా మీ వాహనం స్టార్ట్ చేసే ముందు దాని క్రింది బాగా చెక్ చేసుకోవాలి. ఎవ్వరూ లేరు తమ వాహనాల క్రింది లేరు అని నిర్ధారణకు వచ్చాకనే ప్రయాణం ప్రారంభించాలి. హిట్ అండ్ రట్ కేసులను నివారించడానికి ఈ నియమాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలా చెక్ చేసుకోకుండా వెళ్లడం ఏ పోలీసైనా చూశాడండే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

14. ఇది కూడా తప్పు కాదా ?

14. ఇది కూడా తప్పు కాదా ?

మీకో విషయం తెలుసా ? అమెరికాలోని అలాబామాలో కళ్లకు గంతలు కట్టుకుని తలను పూర్తిగా కప్పేసి డ్రైవింగ్ చేయడం ఏ విధమైన తప్పు కాదంట.

13. మద్యం త్రాగుతూ వెళ్లవచ్చు

13. మద్యం త్రాగుతూ వెళ్లవచ్చు

మందు బాబులకు శుభవార్త ఇండియాలో మద్య సేవిస్తూ వాహనం నడపకూడదు కదా, అయితే కోస్తా రికాలో మద్యం త్రాగుతూ వాహనం నడపవచ్చట. అయితే శరీరంలోని రక్తాని పరీక్షించినపుడు 0.75 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటే అదో నేరం అంట.

12. ప్రయాణంలో కొంచెం కంట్రోల్ చేసుకోండి

12. ప్రయాణంలో కొంచెం కంట్రోల్ చేసుకోండి

ఇటలీలోని ఎబోలి అనే నగరంలో కదులుతున్న కారులో ముద్దు పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా శిక్షార్హులే. ఈ నేరం పోలీసుల కంటపడితే సుమారు 415 .యూరోల జరిమానా విధిస్తారు.

11. ఆదివారాల్లో నల్ల కార్లు రోడ్డెక్కకూడదు

11. ఆదివారాల్లో నల్ల కార్లు రోడ్డెక్కకూడదు

డెనివర్ అనే ప్రదేశంలో ఆదివారం నాడు నల్లకారులో రోడ్డెక్కారో అంతే సంగతులు. అక్కడ ఆది వారం నల్ల కారులో బయటికి వెళ్లడం నేరమట. ఈ నియమానికి కారణం నిజంగా అక్కడున్న ప్రజానీకానికి కూడా తెలియదట.

10. భద్రంగా పట్టుకోండి

10. భద్రంగా పట్టుకోండి

సిప్రస్ అనే చోట కారును డ్రైవ్ చేస్తున్నపుడు చేతులు స్టీరింగ్ మీద లేకపోతే ఖచ్చితంగా ఫైన్ చెల్లించాల్సిందే.

09. ఆదివారాల్లో కార్లు కడిగారో అంతే సంగతులు

09. ఆదివారాల్లో కార్లు కడిగారో అంతే సంగతులు

స్విట్జర్లాండ్ దేశంలో ఆదివారాలలో కార్లను కడగకూడదట. సాధారణంగా ఆదివారాలనే సెలవుగా గడుపుతారు. అలాంటి ఆదివారాల్లో కార్లను కడగకూడదు అంటే ఎలా ? పోని నియమాన్ని కాదని కడిగారంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

08. ఉమ్మివేయడంలో ఇంత పక్షపాతమా ?

08. ఉమ్మివేయడంలో ఇంత పక్షపాతమా ?

జార్జ్‌లోని మెరియట్టా అనే నగరంలో కార్లు లేదా బైకులలో వెళ్లే వారు రోడ్డు మీద ఉమ్మివేయకూడదట బాగానే ఉంది. కాని ట్రక్కులో వెళ్లే వారు ఉమ్మవచ్చట. అసలు ఈ రూల్ ఎందుకు అమలు చేస్తున్నారో ఇంత వరకు ఎవరికీ అంతు చిక్కడం లేదు.

07. బురద నీళ్లు చల్లితే

07. బురద నీళ్లు చల్లితే

ఇలాంటి సన్ని వేశాలు ఎక్కువగా మన దేశంలో చోటు చేసుకుంటుంటాయి. కాని వాటిని ఏ చట్టాలు ఆపలేవు. కాని జపాన్‌లో ఇలా కాదు రోడ్డు మీద నడిచే వారి మీద వాహనం వెళ్లడం ద్వారా బురద నీళ్లు ఎగిరిపడితే దానికి కారణం అయిన వారు ఖచ్చితంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదేదో బాగుంది కదా. ఇపుడుడక్కడా అంతా పద్దతిగా డ్రైవ్ చేస్తూ వెళుతారు.

06. మురికి వాహనాలతో బయటకు రాకూడదు...

06. మురికి వాహనాలతో బయటకు రాకూడదు...

రష్యా దేశంలో కార్ల యాజమానులు మురికి కార్లతో బయటకు వచ్చారంటే అది నేరం. అందుకు సుమారుగా 2,000 రూబుల్స్ మన రుపాయల్లో 3,400 వరకు జరిమానా చెల్లించాలి.

05. అక్కడ ఆడవారు కార్లు నడపకూడదు

05. అక్కడ ఆడవారు కార్లు నడపకూడదు

ఇది ఇంకా భాదాకరమైన రూల్. సౌదీలో ఆడవారు కార్లు నడపకూడదు. అలా కాదని నడిపితే సౌదీ వారి కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

04. బాటసారుల భాద్యత ఎవరిది

04. బాటసారుల భాద్యత ఎవరిది

సాదారణంగా జీబ్రా క్రాసింగ్‌లలో రోడ్డు దాటడానికి సిగ్నల్స్ వద్ద కొంత సమయం కేటాయిస్తారు. అలా కాకుండా వాహనాలు ఎవీ రాలేదని బాటసారులు రోడ్డు దాటడానికి ప్రయత్నించినపుడు ఎదైనా కారు వచ్చిందంటే ఆగకూడదట. అంటే రోడ్డు మీద బాటసారులు ఉన్నా కూడా వాహనాలను ఆపకూడదట అలా ఆపితే జరిమానా విధిస్తారు. మనుషుల ప్రాణాలను సైతం తీసే ఈ నియమం బీజింగ్‌లో ఉంది.

03. ఇదేమి సరిబేసి విధానం

03. ఇదేమి సరిబేసి విధానం

కొన్ని స్పానిష్ దేశాలలో రోడ్ల మీద ఏకార్లంటే ఆ కార్లు పార్క్ చేయకూడదు. నెలలో సరి తేదీ ఉన్న రోజుల్లో కారు రిజిస్ట్రేషన్ చివరిలో సరి నెంబర్ ఉంటేనే పార్కింగ్ చేయాలి, అదే విధంగా బేసి తేదీలలో బేసి సంఖ్య ఉన్న కార్లను పార్క్ చేయాలి. అంటే బయటకు వెళ్లే ముందు తేదీ మరియు కారు రిజిస్ట్రేషన్ నంబరు చెక్ చేసుకొన్ని వెళ్లాలి లేదంటే జేబులు ఖాళీ అవడం ఖాయం.

 02. ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి

02. ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి

రాత్రి సమయాలలో వాహనాలు నడపడానికి వెలుతురు కోసం లైట్లను వినియోగిస్తాము. కాని స్వీడెన్‌లో మాత్రమే పగలు కూడా లైట్లను ఆఫ్ చేయకుండా ఆన్‌లో ఉంచాలి. అలా ఆన్‌లో లేవంటే కారు నడుపుతున్న వారు శిక్షార్హులు అవుతారు. దీనిని ఎందుకు అమలుపరుస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

01. బట్టలు లేకుండా వెళుతున్నారా ?

01. బట్టలు లేకుండా వెళుతున్నారా ?

థాయ్‌లాండ్ దేశంలో శరీరంలో పై భాగంలో ఏ విధమైన వస్త్రాలు లేకుండా పురుషులు మరియు స్త్రీలు కార్లు, బైకులు, ట్యాక్సీలలో వెళితే అక్కడ పెద్ద నేరం. అలా కాదని ఎవరయినా శరీరం పై భాగం బట్టల్లేకుండా వెళితే జరిమానా కట్టి రావాలి.

మరిన్ని కథనాల కోసం...

ఘాట్ రోడ్లపై సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా?

మరిన్ని కథనాల కోసం...

తడిసిన రోడ్లపై తప్పటడుగులు..

Most Read Articles

English summary
Weird Driving Rules Around The World
Story first published: Wednesday, May 11, 2016, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X