ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

ఆటోమొబైల్ ప్రపంచంలో స్టీరింగ్ వీల్స్ అనేక రకాలుగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు స్టీరింగ్ వీల్ అంటే, కారు ముందు చక్రాలను కంట్రోల్ ఓ సాధనం మాత్రమే. కానీ, ఇప్పుడు అది ఏకంగా కారు మొత్తాన్ని కంట్రోల్ చేసే ఓ మెగా సాధనంగా మారిపోయింది. మొదట్లో స్టీరింగ్ వీల్స్ చాలా సింపుల్ గా ఉండేవి. అయితే, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగా స్టీరింగ్ వీల్స్ కూడా చాలా అధునాతనంగా మారాయి.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

ఈ ఆధునిక స్టీరింగ్ వీల్స్ సాయంతో కారులో సంగీతాన్ని కంట్రోల్ చేయవచ్చు, ఫోన్‌కాల్స్ చేయడం లేదా రిసీవ్ చేయడం చేయవచ్చు, అలాగే కారుని నిర్ధష్ట వేగంతో ప్రయాణించేలా క్రూయిజ్ కంట్రోల్ సెట్ చేయవచ్చు, గేర్లను మ్యాన్యువల్ గా స్టీరింగ్ వీల్ నుండే మార్చవచ్చు, వాయిస్ కమాండ్ బటన్ సాయంతో చేతివేళ్లతోనే కారులోని అనేక ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆధునిక స్టీరింగ్ వీల్స్ వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

కొత్తగా ట్రెండ్ అవుతున్న ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్..

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు మరియు లేటెస్ట్ కార్లలో కనిపిస్తున్న ఫీచర్. ఇది సాధారణ స్టీరింగ్ వీల్ మాదిరిగా గుండ్రంగా కాకుండా, క్రింది భాగంలో చదునుగా (ఫ్లాట్‌గా) D-ఆకారంలో ఉంటుంది. వీటినే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అంటారు. ఇది కారు ఇంటీరియర్ ను ఫ్యాన్సీగా మార్చడమే కాకుండా, డ్రైవర్లకు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

మొదట్లో రేసింగ్ కార్లలో ఉపయోగించే వారు..

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ ను మొదట్లో ఎక్కువగా రేసింగ్ కార్లలో ఉపయోగించేవారు. ఎందుకంటే, రేసింగ్ కార్ల ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా, వాటి లోపలి వైపు చాలా తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి, ఆ స్థలానికి తగినట్లుగా స్టీరింగ్ వీల్స్ ను మోడిఫై చేయడం ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చినదే ఈ ఫ్లాట్ స్టీరింగ్ వీల్. రేస్ కార్లలోకి డ్రైవర్లు సులువుగా ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి వీలుగా సన్నటి స్టీరింగ్ మరియు ఫ్లాట్ గా ఉండే స్టీరింగ్ వీల్స్ ను డిజైన్ చేశారు. అయితే, ఇప్పుడు ఫ్లాట్ స్టీరింగ్ వీల్ ఫీచర్ కేవలం రేస్ కార్లకు మాత్రమే కాకుండా, సాధారణ కార్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

మరింత ఎక్కువ లెగ్ రూమ్ లభిస్తుంది..

గుండ్రంగా ఉండే స్టీరింగ్ వీల్స్ కారణంగా డ్రైవర్లకు లెగ్ రూమ్ కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కారణంగా డ్రైవర్ల మోకాలి వద్ద ఎక్కువ ఖాలీ ఏర్పడి, వారికి వీలైనంత ఎక్కువ లెగ్ రూమ్ అందించడంలో ఇది సహాయపడుతుంది. ఇది డ్రైవర్ సులభంగా కారులోకి ప్రవేశించడానికి మరియు సులభంగా కారులో నుండి బయటకు రావడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కారణంగా సీటులో కూర్చున్న తర్వాత డ్రైవర్ తన కాళ్ళను స్వేచ్ఛగా కదపడానికి అనుమతిస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ సౌకర్యం మెరుగుపడుతుంది.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

కారుకి ప్రీమియం లుక్ తెచ్చిపెడుతుంది..

ఫ్లాట్ బాటమ్ యొక్క ఫ్యాన్సీ డిజైన్ కారణంగా, ఇది కారు ఇంటీరియర్‌కు మరింత వన్నె తెచ్చిపెడుతుంది. పైగా ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితమైన ఇలాంటి ఫీచర్ మీ ఎంట్రీ లెవల్ కారులో కూడా కనిపించినట్లయితే, అది తప్పకుండా చూపరులను ఆకట్టుకుంటుంది. ఒకవేళ ఇలాంటి ఫీచర్ మీ కారులో లేకపోయినట్లయితే, ఆఫ్టర్ మార్కెట్లో లభించే వాటితో దీనిని భర్తీ చేసుకోవచ్చు. అయితే, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారంటీలో ఉన్న కారులో ఇలాంటి మాడిఫికేషన్లను చేయడం వలన వారంటీ తిరస్కరించబడే ప్రమాదం ఉంటుంది మరియు కొన్ని కార్లకు ఇలాంటి స్టీరింగ్ వీల్స్ సెట్ కాకపోవచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకోవటం మంచిది.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

ధృడమైన స్టీరింగ్ వీల్స్..

సాధారణంగా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ 3-స్పోక్ డిజైన్‌తో ఉండి, అల్యూమినియం మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటాయి. అల్యూమినియం తేలికైన మరియు ధృడమైన లోహం కాబట్టి, ఇది ఒక మృదువైన స్టీరింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎవరైనా సరే సులభంగా స్టీరింగ్‌ని ఉపయోగించవచ్చు మరియు ఒక చేతితోనే తమ కారును సరైన దిశలో నడిపించవచ్చు. కానీ, గుర్తుంచుకోండి.. కారు స్టీరింగ్ వీల్ ను ఎల్లప్పుడూ రెండు చేతులతో 9-3 క్లాక్ పొజిషన్ లో మాత్రమే పట్టుకొని డ్రైవ్ చేయాలి, అదే సురక్షితం.

ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ (Flat Bottom Steering Wheel Advantages) ప్రయోజనాలు ఏంటి?

మీ స్టీరింగ్ వీల్‌ పొజిషన్ ను త్వరగా గుర్తించవచ్చు.

సాధారణంగా గుండ్రంగా ఉండే స్టీరింగ్ వీల్ కలిగిన కారులో దాని స్టీరింగ్ పొజిషన్ ను గుర్తించడం కాస్తంగా కష్టంగా ఉంటుంది. అదే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కలిగిన కార్లలో అయితే, స్టీరింగ్ యొక్క చదునైన భాగం (ఫ్లాట్ భాగం) క్రింది వైపుకు ఉన్నట్లయితే, అప్పుడు కారు యొక్క స్టీరింగ్ పొజిషన్ నేరుగా ఉందని సులువుగా గుర్తించవచ్చు. కాబట్టి, డ్రైవర్లు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ పొందడానికి ఈ విషయాన్ని కూడా ఓ ప్రధాన కారణంగా చూస్తున్నారు. అంతేకాకుండా, నేరుగా ఉండే హైవేలపై ఈ స్టీరింగ్ వీల్ కలిగిన కార్లు నడపటానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.

Most Read Articles

English summary
What are the advantages of flat bottom steering wheel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X