కారు అద్దం మీదున్న అంచుల్లో నల్లటి చుక్కలు ఎందుకుంటాయో తెలుసా ?

Written By:

కారులో ముందు వైపు కూర్చున్నపుడు ఫ్రంట్ మిర్రర్‌కు నలువైపులా అంచుల్లో నల్లటి చుక్కలను గమనిస్తాము. ఈ బ్లాక్ డాట్స్ ఎందుకుంటాయో తెలుసా ?ఈ బ్లాక్ డాట్స్ అందివ్వడం వెనుకున్న రీజన్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

వాహనాల్లో ముందు వైపు ఉన్న అద్దాలకు అంచుల వద్ద బ్లాక్ డాట్స్ రావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వాహనం యొక్క ఫ్రే‌మ్‌కు అద్దాన్ని ఫిక్స్ చేయడానికి సిరామిక్ పదార్థాన్ని వినియోగిస్తారు, తద్వారా అక్కడ నల్లటి పట్టీ ఏర్పడుతుంది.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

బయట నుండి నీరు మరియు గాలి లోపలికి చేరకుండా మిర్రర్‌ను బాడీకి ఫిక్స్ చేయడం కోసం ఆ పదార్థాన్ని వినియోగిస్తారు.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

వాహనం అద్దాలను తయారుచేసే క్రమంలో పూర్తిగా తయారయ్యే క్రమంలో వాటిని వేడి చేయడం జరుగుంది. తద్వారా సూర్యుడిని నుండి వచ్చే వేడికి మరియు చలికాలంతో పాటు అన్ని వాతావరణ పరిస్థితులతో చర్యజరిపినపుడు పగిలిపోకుండా ధృడంగా ఉంటాయి.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

మరి బ్లాక్ డాట్స్ ఎందుకుంటాయనేది మన ప్రశ్న, మెటల్ బాడీతో అద్దం అతుక్కుని ఉండటం వలన వెహికల్ బాడీ నుండి వేడి అద్దాన్ని చేరే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి అంచుల వెంబడి నల్లటి చుక్కలను ప్రింట్ చేస్తారు.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

అతినీలలోహిత(UV) కిరణాలు సరాసరిగా అద్దం మీద పడినపుడు పాడవకూడదనే ఉద్దేశ్యంతో వీటిని ప్రింట్ చేయడం జరుగింది.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

అద్దాన్ని బాడీ ఫ్రేమ్‌ లోకి ఫిక్స్ చేసిన అనంతరం బయటివైపుకు కనిపించే బ్లాక్ బార్డర్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు బ్లాక్ డాట్స్ అందించారని అనిపిస్తుంది. కానీ సన్ లైట్ మిర్రర్ మీద పడినపుడు, బ్లాక్ డాట్స్ నీడ కారులోపల అందమైన బార్డర్‌ను క్రియేట్ చేస్తుంది.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

కొన్ని కార్లలో సూర్య కిరణాలు డైరక్ట్‌ పడటాన్ని నివారించడానికి, కారు లోపల రియర్ వ్యూవ్ అద్దాన్ని అమర్చిన పై భాగంలో బ్లాక్ డాట్స్ అందిస్తారు.

కారు అద్దం మీద నల్లటి చుక్కలు ఎందుకు ఉంటాయి

కొన్ని వాహన తయారీ సంస్థలు కార్ల అద్దాలకు అంచులలో విభిన్న డిజైన్‌లలో బ్లాక్ డాట్స్ అందిస్తాయి. బ్లాక్ మార్క్స్ ఏ స్టైల్లో ఉన్నా వాటి అవసరలం మాత్రం ఒక్కటే అని గుర్తుంచుకోండి.

English summary
Read In Telugu: What Black Dots On Car Windshields Do
Story first published: Tuesday, June 20, 2017, 19:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark