అధిక వేగంలో ఉన్న చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?

Written By:

అధిక వేగంతో ఉన్న కార్లను చూస్తున్నపుడు, వాటి చక్రాలను ఎప్పుడైనా గమనించారా....? గమనించినట్లయితే వేగంతో ఉన్న చక్రాలు వెనక్కితిరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా...? ఇలా జరగడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా క్రింది కథనంలో...

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

ముందు వైపుకు కదిలే చక్రాలు అధిక వేగంలో ఉన్నపుడు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపించడాన్ని స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అంటారు. మానవుని నిలకడ దృష్టి కారణంగా ఈ ప్రభావం ఏర్పడుతుంది.

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

అర్థం అవలేదా...? సరే మరింత వివరంగా చూద్దాం రండి... నిజానికి అధిక వేగంతో ఉన్న వాటిని (ఉదాహరణకు: హెలికాప్టర్ బ్లేడ్ లేదా కారు చక్రాలు) మన కళ్లు ప్రతి పాయింట్ వద్ద ఖచ్చితంగా చూడలేవు (చక్రం ఎన్ని సార్లు తిరిగితే అన్ని సార్లు ఖచ్చితంగా చూడలేవు).

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

వేగంగా కదిలేవాటిని మన కళ్లు సెకనుకి 10 నుండి 12 సార్లు ఫోటోల రూపంలో తీసుకుని వాటిని వలయాకారంలో అమర్చి మన కళ్లు చూసిన అనుభవాన్ని సింపుల్ లాజిక్‌తో మెదడుకు చేరవేస్తుంది.

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

ఇక్కడున్న చుక్కలు మన కళ్లు సేకరించిన ఫోటోలు అయితే, నల్లటి రేఖ వస్తువు ప్రయాణించే మార్గాన్ని సూచిస్తుంది. ఈ సమాచారాన్ని మెదడుకు చేరవేయడం ద్వారా మనం చూస్తున్న చక్రం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకుంటుంది.

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

అందుకే అధిక వేగంతో ఉన్న చక్రాలను చూసినపుడు అవి రివర్స్‌లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు హెలికాప్టర్ రెక్కలను చూసినపుడు కూడా ఇదే అనుభవం కలుగుతుంది.

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

అయితే నెమ్మదిగా తిరిగే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించవో తెలుసా మరి ? దీనికి వివరణ క్రింది స్లైడర్లో చూద్దాం రండి...

కదిలే చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది

నెమ్మదిగా తిరుగుతున్నపుడు దాని ప్రతి కదలికను మన కళ్లు ఖచ్చితంగా పసిగట్టగలవు, అప్పుడు ఒక సెకనుకు మన కళ్లు తీసుకునే ఫోటోలు ఒక పొడవాటి గీత మీద అమర్చి వాటిని మెదడుకు పంపిస్తాయి. కాబట్టి అలాంటి చక్రాలకు ముందుకు కదులుతున్నట్లు మనకు అనిపిస్తుంది.

English summary
Read In Telugu Why Do Car Wheels Appear To Spin Backwards

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark