రోడ్డు క్రాస్ చేసేటపుడు ఇలాంటి పొరపాటు చేయకండి

Written By:

రోడ్డు దాటే సమయంలో రోడ్డుకు ఇరువైపులా గమనించాలి. ఈ చిన్న విషయాన్ని మరిచిపోతే ఊహించిన ప్రమాదం జీవితాల్ని కకావికలం చేస్తుంది. అందుకు నిదర్శనం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని పరమతి వేలూరులో జరిగిన ప్రమాదం.

నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

నమక్కల్ జిల్లాలోని పరమతి వేలూరులో హై వే మీద వేగంగా వచ్చిన కారు స్కూటర్ మీద రోడ్డు దాటుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. హై వే మీద వెళ్లేవాహనాలను గమనించకుండా రోడ్డు దాటడంతో ఘోర ప్రమాదానికి గురయ్యింది.

Recommended Video - Watch Now!
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

జీబ్రా క్రాసింగ్ వద్ద స్కూటర్ మీద నెమ్మదిగా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న మహిళను మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో గాలిలోనే మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమదం దృశ్యాలు సంఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను పరమతి వేలురూలో నివశించే ప్రియా గా స్థానికులు గుర్తించారు. ప్రమాదంలో ఈమె కుడి కాలును కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.

నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

రోడ్డు దాటుతున్నపుడు క్షణిక సమయం పాటు రోడ్డుకు ఇరువైపులా గనించి ఉంటే ప్రమాదం తప్పేది. జాతీయ రహదారి కావడంతో, అధిక వేగం మీద ఉన్న కారు ముందుకు ఉన్నట్లుండి స్కూటర్ రావడంతో కారు డ్రైవర్ స్పందించేలోపే ప్రమాదం జరిగిపోయింది.

నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా స్వల్పగాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగు విచ్చుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

నమక్కల్ స్కూటర్ కారు రోడ్డు ప్రమాదం

రోడ్డును దాటే సమయంలో ఇరువైపులా గమనించి వాహనాలు రాలేదని నిర్దారించుకున్న తరువాతే రోడ్డు దాటండి.

అధిక వేగంతో వెళుతున్న వాహనాలు వెళ్లిన తరువాతే రోడ్డును దాటండి. ఒక్క క్షణంపాటు ఆగితే సురక్షితంగా రోడ్డు దాటవచ్చు. ఆత్రంగా రోడ్డును దాటితే కోలుకోలేని ప్రమాదాలకు గురికావడం గ్యారంటీ. కాబట్టి రహదారి మీద ఉన్నపుడు చురుకుగా వ్యవహరించండి...

రోడ్డును దాటుతుండగా కారు ఢీకొనడంతో గాలిలో మూడు పల్టీలు కొట్టిన మహిళ - సీసీ టీవీలో రికార్డయిన ప్రమాద దృశ్యాలను ఈ వీడియోలో వీక్షించగలరు.

Image Courtesy - TV 9 Kannada

English summary
Read In Telugu: Woman Rider Flies Through Air After Being Hit By Car In Namakkal Road Accident

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark