రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!

By Anil

రైలు ప్రయాణం అంటే మనకు చిన్నప్పటినుండి ఎంతో సరదా కదా. ఆరు భోగీలు ఉండే రైలు నుండి 60 భోగీలు ఉండే రైలు వరకు అందులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. దీనంతటికి కారణం ఒక్క లోకో పైలట్లు మాత్రమే. బయటి నుండి గమనిస్తే వారి పని ఎంతో సులభంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని రైలు ఇంజన్‌లో నుండి అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొన్ని వేల కిలోమీటర్లు రైలును నడపడం రైలు డ్రైవర్లకు ఎంతో కష్టంతో కూడుకున్నది.

రోజుకు 25 మిలియన్ ప్రజలను మరియు 3 మిలియన్ టన్నుల బరువును ప్రతి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసయడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. కాని జీతభత్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వారి జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది అని చాలా మంది ఊహించి ఉంటారు. కాని ఇండియన్ రైల్వేలో ఉన్న లోకో పైలట్లు చెప్పుకోలేని ఎన్ని ఇబ్బందులను ఎదుుర్కొంటున్నారు. మనం ఎప్పుడూ విననీ కననీ వారి పని వాతావరణం గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

1. గొప్ప భాద్యత

1. గొప్ప భాద్యత

రోజు వారి రైలు డ్రైవర్ల జీవితంలో సమారుగా 250 లక్షల మంది ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అంతే కాకుండా 30 లక్షల టన్నుల సరుకులను సురక్షితంగా రవాణాచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే దేశ రవాణాలో రైల్వే రంగం ఎంతో కీలకమైనది. ఇంతటి వ్యవస్థను లోకో పైలట్లు గొప్ప బాధ్యతతో నిర్వర్తిస్తున్నారు అని చెప్పవచ్చు.

2. రైలు డ్రైవర్ల సంఖ్య

2. రైలు డ్రైవర్ల సంఖ్య

ఇండియన్ రైల్వేలో సుమారుగా 9,213 వరకు రైలు ఇంజన్‌లు కలవు. సరుకు రవాణా మరియు ప్రయాణికుల రైళ్లకు సుమారుగా 70,000 వరకు రైలు డ్రైవర్లు సేవలందిస్తున్నారు.

3. నిజాయితీ గల ఉద్యోగులు

3. నిజాయితీ గల ఉద్యోగులు

దాదాపుగా 170 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర గల ఇండియన్ రైల్వేలో ఇంత వరకు ఏ లోకో పైలట్ కూడా ఉద్యోశ పూర్వకంగా రైలు ప్రమాదాన్ని జరిపినట్లు ఎలాంటి ధాఖలాలు లేవు. అయితే రైలు డ్రైవర్లు వారి ప్రాణాలను సైతం అడ్డు పెట్టి కొన్ని వేల మంది ప్రయాణికులను కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నిజాయితీ ఉద్యోగులు ఏ రంగంలో ఉంటారు చెప్పండి.

4. పని గంటలు

4. పని గంటలు

ఏడు పని గంటలున్నవారు 12 గంటలకు పని చేస్తారు. మరియు ప్రతి లోకో పైలట్ కూడా 30 గంటల పాటు విశ్రాంతితో సగటున 72 గంటలు పాటు చేస్తున్నారు. రెండు రైళ్లకు మధ్య గల అలస్యాన్ని లేదా రెండు సర్వీసుల మధ్య గల సమయాన్ని విశ్రాంతి క్రింద లోకో పైలట్లు యొక్క విశ్రాంతి గంటలుగా లెక్కిస్తారు.

 5. ఇది నిజంగానే కష్టం

5. ఇది నిజంగానే కష్టం

చాలా మంది లోకో పైలట్లు తమ కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటారు. కాని వారానికి కేవలం ఒక్క రోజు మాత్రేమే ఇంట్లో గడుపుతున్నారు. ఇండియన్ రైల్వోలో చాలా మంది లోకో పైలట్లు అయిష్టంగానే విధులకు హాజరవుతారు.

6. అంత సులభం కాదు

6. అంత సులభం కాదు

చాలా మంది విధ్యార్థులు లోకో పైలట్ ఉద్యోగాన్ని కోరుకుంటారు. కాని ఇది అంత సులభం కాదు. సాధారణంగా రైల్వే రంగంలో ఉన్న సాధారణ స్థాయి ఉద్యోగాలకు 10 లేదా 12 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి. కాని లోకో పైలట్ ఉద్యోగానికి కొన్ని రకాల డిప్లొమా మరియు ఇంజనీరింగ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. కేవలం శారీరక పరీక్షలు మాత్రమే కాకుండా రైల్వే బోర్డు నిర్వహించే అర్హత పరీక్షల్లో కూడా నెగ్గాల్సి ఉంటుంది.

7. శిక్షణ

7. శిక్షణ

ఎంపికైన అభ్యర్థులు ముందుగా అనువజ్ఞులైన రైలు డ్రైవర్ల అధ్వర్యంలో సుమారుగా 60,000 కిలోమీటర్లు పాటు రైలును నడపాల్సి ఉంటుంది. ఆ తరువాత లోకో షెడ్డులో రైలింజన్లను పార్క్ చేయడం. మరియు గూడ్సు రైలు బండ్లను నడపాల్సి ఉంటుంది.

8. ప్రమోషన్లు

8. ప్రమోషన్లు

గూడ్స్ రైళ్లు మరియు లోకో మోటివ్ యార్డులలో శిక్షణ తీసుకున్న తరువాత ఎంతో కమిట్‌మెంట్‌తో కూడుకున్న ఉద్యోగం ప్యాసింజర్ రైళ్లకు లోకో పైలట్‌గా ప్రమోట్ చేస్తారు. అంతకు ముందు వరకు వారి ప్రాణాలు మాత్రమే ఇబ్బందుల్లో ఉంటాయి. ఒక్క సారి ప్యాసింజర్ రైళ్లకు ప్రమోట్ అయ్యాక ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ గమ్యాన్ని చేరుతూ ఉండాల్సి ఉంటుంది.

9. ఇది ఎంతో కష్టతరమైనది

9. ఇది ఎంతో కష్టతరమైనది

సరుకు రవాణా చేసే రైలు డ్రైవర్లకు ఆ రైలును ఫలాణా సమయంలోపు గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి వారి మామూలు పని గంటలకన్నా ఎక్కువ సమయం పాటు పని చేయాల్సి ఉంటుంది. వారి మాటల్లో ఈ బాధ వర్ణణాతీతంగా ఉంటుంది.

10. భాద్యతాయుతంగా

10. భాద్యతాయుతంగా

రైలు డ్రైవర్ రైలును స్టేషన్‌లోకి సరైన సమయంలో తీసుకురావడం మరియు రైలు ప్రయాణలో జరిగే అన్ని రకాల అపశృతులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరియ రైలు ప్రయాణంలో చోటు చేసుకునే ప్రతి చిన్న ఆలస్యానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

11. లోకో పైలట్ల లక్షణాలు

11. లోకో పైలట్ల లక్షణాలు

ఉత్తమ లోకో పైలట్లు అంటే చక్కటి చేయి మరియు కంటి ద్వారా అలుసులేని పనిచేసే విధంగా ఉండాసలి. శారీరక సామర్థ్యం, మంచి జ్ఞాపక శక్తి, సరళమైన మరియు నమ్మకమైన వ్యక్తిత్వాన్ని, సానుకూల ధోరణి, ఆలోచనా శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి, ఆరోగ్యం మరియు భద్రత పరంగా ఉత్తమ లక్షణాలను కలిగి ఉండాలి.

12. రిపేరీలు

12. రిపేరీలు

రైలు ప్రయాణంలో ఇంజన్‌లో ఏ చిన్న రిపేరి వచ్చినా కూడా వాటిని సరిచేసే సామర్థ్యం లోకో పైలట్‌కు ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ వేడి, ఎక్కువ చలి మరియు ఎక్కవగా వర్షం పడుతున్న సమయంలో కూడా రైలింజన్‌లో తలెత్తే రిపేరీలను చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా రైలింజన్‌లో ఉత్తన్నమయ్యే వేడిని భరించాల్సి ఉంటుంది.

13. లోకో పైలట్ల కొరత

13. లోకో పైలట్ల కొరత

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో సుమారుగా 20 శాతం వరకు లోకో పైలట్ల కొరత ఉంది. ఈ రైలు డ్రైవర్ల లోటును ప్రస్తుతం ఉన్న లోకో పైలట్లతో కాలం వెళ్లదీస్తున్నారు.

14. వేసవి కాలంలో ఎన్నో అసౌకర్యాలు...

14. వేసవి కాలంలో ఎన్నో అసౌకర్యాలు...

వేసవి కాలంలో లోకో పైలట్లు వేడితో ఎంతో ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో సాధారణంగా బాహ్య వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు రైలింజన్ నిరంతరం ఆన్‌‌లో ఉండటం వలన మరింత వేడి లోకో పైలట్ క్యాబిన్‌కు చేరుతుంది. (ఉదా.. బాహ్య వాతావరణంలో వేడి 38 డిగ్రీల సెల్సియస్ అయితే రైలు ఇంజన్ క్యాబిన్‌లో సుమారుగా 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది). తద్వారా వేసవి కాలం అంతా లోకో పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

15. మలముత్రాలు బంద్....

15. మలముత్రాలు బంద్....

బస్సులో అయితే ఎక్కడో ఒక చోట ఆపి కృత్యాలు తీర్చుకోవచ్చు, కాని రైలు నడిపేటపుడు డ్రైవర్లు స్టేషన్ వచ్చినపుడు మాత్రమే కృత్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే రైలింజన్‌లో టాయిలెట్లు ఉండవు కాబట్టి. కొన్ని గంటల పాటు అలాగే లోకో పైలట్లు రైలును నడుపుతూ వెళుతుంటారు. స్టేషన్ వస్తే తప్ప వారికి మరో దారి ఉండదు.

16. చివరికి అందుబాటులోకి...

16. చివరికి అందుబాటులోకి...

170 ఏళ్ల ఇండియన్ రైల్వే చరిత్రలో ఇంతవరకు రైలింజన్‌లో టాయిలెట్లు లేకపోవడం ఎంతో బాధాకరం. అయితే మొత్తానికి గత నెలలో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రభాకర్ మొదటి సారిగా రైలింజన్‌లో బయో మరుగుదొడ్డును కల్పించారు. ఇది ఇండియన్ రైల్వోలోని డ్రైవర్లు ఎంతో కాలంగా అడుగుతున్న అంశం.

17. ప్రత్యేకత

17. ప్రత్యేకత

ఈ రైళ్లోని బయో టాయిలెట్లో లోకో పైలట్లు ఉన్నపుడు రైలును ఎవ్వరు కూడా నడపలేరు. ఇందుకోసం దీనిలో ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా టాయిలెట్ తలుపులు తెరుచుకోవాలంటే రైలు వేగం సున్నాలో ఉండాలి. అలాగే టాయిలెట్లో లోకో పైలట్ ఉన్నంత సేపు రైలింజన్‌‌లో బ్రేకులు అలాగే పట్టి ఉంటాయి. ఇదంతా కూడా భద్రత పరంగా అభివృద్ది చేసినట్లు రైల్వే మినిస్టర్ తెలిపారు.

18. మానసిక ఒత్తిడి.

18. మానసిక ఒత్తిడి.

ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే లోకో పైలట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఇందులో లోకో మోటివ్ క్యాబిన్‌లో చల్లటి వాతావరణ మరియు మరుగుదొడ్లు లేకపోవడం అని తెలిసింది.

మరిన్ని కథనాల కోసం....

170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు

మరిన్ని కథనాల కోసం....

వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు

సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతీయ మొదటి బుల్లెట్ రైలు

అదృశ్య రైలును సృష్టిస్తున్న జపాన్ !!

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Work Life Indian Loco Pilots
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X