ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన ఎలోన్ మస్క్. అయితే, ఇప్పుడు ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రెండవ వ్యక్తి (World's Second Richest Man), భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ (Gautam Adani). భారతదేశం గర్వించదగిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

Recommended Video

Mini Cooper SE Electric Launched In India | Price Rs 47.20 Lakh |270KM Range, DC Fast Charging &More

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఇదివరకు రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను గౌతమ్ అదానీ వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఈ స్థానం కోసం గత కంత కాలంగా ఇరువురి మధ్య చాలా దగ్గర పోటీ ఉండేది. కాగా, ఇప్పుడు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆస్తి విలువ 154.7 బిలియన్ డాలర్లు మరియు బెర్నార్డ్ ఆర్నాల్ట్ విలువ 153.8 బిలియన్ డాలర్లు. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టెస్లా కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ ఆస్తుల విలువ 273.5 బిలియన్ డాలర్లు. ఆన్‌లైన్ రీటైల్ కంపెనీ అయిన అమెజాన్ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ 149.7 బిలియన్ డాలర్లు.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కోటీశ్వరుడైన గౌతమ్ అదానీ వద్ద కొన్ని ప్రైవేట్ జెట్ విమానాలు మరియు హెలికాఫ్టర్లతో పాటుగా అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఆయన గ్యారేజ్‌లో ఉండే కొన్ని ప్రముఖ కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

1. రోల్స్ రాయిస్ ఘోస్ట్

కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇలాంటి ఖరీదైన మాస్టర్ పీస్ కార్లను కలిగి ఉండాలంటే, వారు తప్పనిసరిగా కోటీశ్వరులే అయి ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు తయారు చేసే రోల్స్ రాయిస్ గౌతమ్ అదానీ కోసం కూడా ఓ ప్రత్యేకమైన కారును తయారు చేసింది. ఆయన గ్యారేజ్‌లో కొలువుదీరిన అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. అతను ఈ కారును కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది స్టాండర్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కాదు, అదానీ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన స్పెషల్ కారు.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

రోల్స్ రాయిస్ ఘోస్ట్ శక్తివంతమైన 6.6-లీటర్, ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 562 బిహెచ్‌పి శక్తిని మరియు 780 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ కారు కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

2. ఫెరారీ కాలిఫోర్నియా

బిలియనీర్ కార్ కలెక్షన్‌లో ఫెరారీ కారు లేకపోతే, అది అసంపూర్ణంగానే కనిపిస్తుంది. అందుకే, గౌతమ్ అదానీ తన గ్యారేజ్‌లో అత్యంత పాపులర్ అయిన ఇటాలియన్ కార్ ఫెరారీ కాలిఫోర్నియాను చేర్చుకున్నారు. ఎప్పుడైనా సరదాగా స్పోర్ట్స్ కారులో తిరగాలనిపించినప్పుడు అదానీ ఈ కారును ఉపయోగిస్తారు.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

ఇటాలియన్ మాస్టర్ పీస్ అయిన ఫెరారీ కాలిఫోర్నియా శక్తివంతమైన 4.3-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 453 బిహెచ్‌పి పవర్‌ను మరియు 485 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 310 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

3. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

గౌతమ్ అదానీ గ్యారేజ్‌లో అనేక బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ కలెక్షన్‌ను చూస్తుంటే ఆయన బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కి ఓ పెద్ద అభిమాని అని తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం, అతని వద్ద బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ యొక్క అనే టాప్-ఎండ్ వేరియంట్‌లు ఉన్నాయి. ఆయన ఈ కార్లను తరచూ ఉపయోగిస్తుంటారు, చాలా సందర్భాలలో ఈ బ్రాండ్ కార్లలో కనిపించారు. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ సెడాన్ చాలా శక్తివంతమైన 6.6-లీటర్ టర్బోచార్జ్డ్ వి12 ఇంజన్‌తో వస్తుంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

ఈ ఇంజన్ గరిష్టంగా 602 బిహెచ్‌పి శక్తిని మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారులో ఐడ్రైవ్ 8 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వినోదం కోసం 14.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లతో పాటుగా కారులో కూర్చునే విఐపిల కోసం అనేక ఇతర విలాసవంతమైన ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ త్వరలోనే ఇందులో ఓ కొత్త తరం మోడల్‌ను తీసుకురాబోతోంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

4. ఆడి క్యూ7

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారతదేశంలో విక్రయిస్తున్న ఎస్‌యూవీ లైనప్‌లో కెల్లా అత్యంత ఖరీదైనది మరియు విలాసవంతమైనది ఆడి క్యూ7. ఆడి క్యూ3 మరియు క్యూ5 తర్వాత సెలబ్రిటీలు అత్యధికంగా ఇష్టపడే కార్లలో కూడా క్యూ7 కూడా ఒకటి, ఇదొక విశాలమైన మరియు విలాసవంతమైన లగ్డరీ ఎస్‌యూవీ. మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో బిజినెస్ చేసే బిలీనియర్లకు ఓ మినీ ఆఫీస్‌లా ఉంటుంది. గౌతమ్ అదానీ కార్ కలెక్షన్‌లో ఆడి క్యూ7 కూడా ఉంది. ఇది నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

ఆడి క్యూ7 లో పవర్‌ఫుల్ 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 245 బిహెచ్‌పి పవర్‌ను మరియు 600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 3డి సరౌండ్ సౌండ్ సిస్టమ్, ప్రీమియం లెదర్ ఇంటీరియర్స్, పవర్ అడ్జస్టబల్ సీట్స్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, క్రూయిజ్ కంట్రోల్, 8 ఎయిర్ బ్యాగ్స్ మరియు స్పీడ్ లిమిటర్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!

అదానీకి కార్ల కంటే విమానాలంటేనే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఆయన కలెక్షన్‌లో మూడు ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అవి - ఎంబ్రేయర్ లెగసీ 650, బొంబార్డియర్ ఛాలెంజర్ 605 మరియు బీచ్‌క్రాఫ్ట్ 850ఎక్స్‌పి. ఇవి కాకుండా అదానీ వద్ద మూడు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి, అందులో ఒకటి అగస్టావెస్ట్‌ల్యాండ్ ఏడబ్ల్యూ139 హెలికాప్టర్. అదానీ గ్రూప్ నికర విలువ 2022లో చాలా వేగంగా పెరిగింది. గడచిన 2022 జనవరి నుంచి అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది.

Most Read Articles

English summary
World s second richest man gautam adani luxury car collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X