ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

సాధారణంగా వాహనదారులకు ప్రస్తుతకాలంలో లైసెన్సు తీసుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే వాహనాలను నడిపేవారు కచ్చితంగా లైసెన్సు కలిగి ఉండాలి లేకుండా శిక్షార్హులు. లైసెన్సు లేనివారికి జరిమానాలు విధించడం వంటి శిక్షలు అమలులో ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ముంబై అధికారులు ఈ లైసెన్సు విషయమై ఒక సంచలన వార్తను తెలియజేసారు. దానిని తెలుసుకుందాం!

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

ముంబై నగరంలోని అధికారులు ప్రకటించిన ఒక వార్త ఏమిటంటే, సోమవారం నుండి నగరంలోని మూడు "ఆర్టీఓ" ఆఫీస్ లలో శాశ్వత లేదా అభ్యాసకుల డ్రైవింగ్ లైసెన్స్ కొరకు అపాయింట్‌మెంట్ పొందడానికి "సున్నా" నిరీక్షణ కాలం ఉంటుంది అని తెలియజేసారు. అంటే లైసెన్స్ ల కోసం ఇక ఏమాత్రం నిరీక్షించవలసిన అవసరం లేదు అని మనకు తెలుస్తుంది. వాహనదారులు లైసెన్స్ పొందడానికి ముంబై నగరంలో మూడు ప్రదేశాలను ఎంపిక చేయడం జరిగింది. అవి ఏవంటే టార్డియో (ఐలాండ్ నగరం), వడాలా (తూర్పు) మరియు అంధేరి (పశ్చిమ ప్రాంతాలు అయిన బాంద్రా నుండి జోగేశ్వరి) అని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసారు.

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

శాశ్వత లైసెన్స్ కోసం దరకాస్తు చేసుకున్న రోజే పరీక్షకు హాజరు కావచ్చు అని స్పష్టం చేసారు. ఇంతకు ముందు లాగా దరకాస్తు చేసుకున్న తరువాత కొన్ని రోజులు ఎదురు చూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం వేచి ఉండవలసిన అవసరం ఇప్పుడు లేదు.

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

అయితే ఇప్పుడు బోరివ్లి ఆర్టీఓ విషయానికొస్తే వారు కూడా త్వరలో వెయిటింగ్ పీరియడ్ తగ్గిస్తారని కొన్ని వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. టార్డియో ప్రాంతీయ రవాణా అధికారి "సుభాష్ పెడంకర్" మాటాడుతూ ఏజెంట్ల నియామకాల కోసం స్లాట్‌లను నిరోధించలేని వ్యవస్థను తాము మార్చామని కాబట్టి ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 100-200 మంది అభ్యర్థులను పెంచాము. దీనివల్ల అభ్యర్థులందరి సౌలభ్యం కోసం అభ్యాసకుల లైసెన్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించింది అన్నారు.

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

ఈ ప్రకటన ఇవ్వకముందు తమ "ఆర్టీఓ" ఆఫీస్ వద్ద అభ్యాసకుడి లైసెన్స్ పరీక్ష కోసం 20-30 రోజులు వరకు వేచి ఉండవలసి వచ్చేది అని ఆయన అన్నారు. ఇది క్రమంగా ఒక వారానికి తగ్గింది. ఇప్పుడు ఆ నిరీక్షణ కాలం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు ఉదయం మీరు అప్లై చేసుకున్నట్లైతే మరుసటి రోజు ఉదయం మీకు అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వారంలో కొన్ని రోజులు మీరు అదృష్టవంతులైతే అప్లై చేసుకున్నఅదే రోజు సాయంత్రం అపాయింట్‌మెంట్ పొందవచ్చు" అని కూడా ఆయన చెప్పారు.

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

ఇంతకుముందు "ఆర్టీఓ" ఆఫీస్ లో సదుపాయాలు తక్కువగా ఉన్న కారణంగా లైసెన్స్ ల విషయంలో ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడు ఆర్టీఓ లైసెన్స్ సంబంధిత పనులన్నింటినీ ప్రాంగణంలో నిర్మించిన కొత్త భవనానికి మార్చడం జరిగింది. ఇక్కడ ప్రస్తుత 12 కంప్యూటర్ల స్థానంలో 25 కంప్యూటర్లను పెంచారు. తద్వారా ఎక్కువ మంది అభ్యర్థులు 10 నిమిషాల్లో అభ్యాసకులు పరీక్షకు హాజరుకావడానికి వీలు కల్పించడం జరుగుతోంది. ఈ విధంగా చేయడం వల్ల అభ్యాసకుల లైసెన్స్ పరీక్షలకు సాధారణంగా సాయంత్రం 4 గంటలకు వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ దీనికి బదులుగా ఇప్పుడు కేవలం 1గంట నుండి 1.30 గంటలలో పూర్తవుతాయని అధికారులు నిర్దారణ చేశారు.

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

వడాలా ప్రాంతీయ రవాణా అధికారి "పురుషోత్తం నికం" మాట్లాడుతూ ఆన్‌లైన్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎక్కువ సంఖ్యలో పౌరులకు సకాలంలో నియామకాలు అందేలా చూస్తున్నాము అన్నారు. ప్రస్తుతం మేము సున్నా నిరీక్షణ వ్యవధిని విజయవంతంగా సాధించాము మరియు లైసెన్సులు కూడా త్వరగా ఇస్తున్నాము అని ఆయన తెలియజేసారు.

Read More:ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

సాధారణంగా అబ్యాసకుడు పరీక్షకు హాజరైన తర్వాత కంప్యూటర్ నిమిషాల్లో అభ్యాసకుడి లైసెన్స్ తయారు చేస్తుంది. ఆర్టీఓలు పోస్టల్ సిబ్బందితో సమావేశాలు జరిపి డెలివరీలను వేగవంతం చేస్తారు.

Read More:2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

గత కొంత కాలంగా నగరంలోని ఆర్టీఓలు దాదాపు 87 లక్షల డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసినట్లు రవాణా గణాంకాలు చెబుతున్నాయి. అంధేరి ప్రాంతీయ రవాణా అధికారి "అభయ్ దేశ్‌పాండే" మాట్లాడుతూ ప్రతిరోజూ 150-200 మంది అభ్యర్థులు వస్తున్నారని, ఇప్పుడు 300 మందికి పైగా అభ్యర్థులు వస్తున్నారని చెప్పారు. తాము అభ్యర్థులకు తగిన వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పుడు లైసెన్స్ విధానాలు మరింత కఠినతరం చేయబడ్డాయి. ఇవేకాకుండా రహదారి సంకేతాలు మరియు భద్రత గురించి తక్కువ అవగాహన ఉన్న అభ్యర్థులు డ్రైవింగ్ పరీక్షలో విఫలమయ్యారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ముంబై ప్రాంతంలోని పరీక్షలలో 3-5% మంది అభ్యర్థులు డ్రైవింగ్ పరీక్షలో విఫలమయ్యారని అధికారులు తెలిపారు.

Read More:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం, ఎక్కడంటే...?

టార్డియో ఆర్టీఓ వారి ఫిట్నెస్ పరీక్షలను కూడా వేగవంతం చేసింది. వీరు ఇటీవల ఈ రకమైన సరికొత్త ఫిట్‌నెస్ టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించారు. ఇది బొంబాయి హెచ్‌సి ఆదేశించిన 250 మీటర్ల బ్రేక్ టెస్ట్ ట్రాక్. ఇది ప్రైవేట్ కమర్షియల్ క్యాబ్‌లు, స్కూల్ బస్సులు మరియు ట్రాక్‌లోని టెంపోల ఫిట్‌నెస్ పరీక్షల కోసం ప్రారంభించింది.పెద్ద బస్సులను సైతం ఇప్పుడు వడాలాలోని అనిక్ డిపోలో పరీక్షిస్తున్నారు. రద్దీని నివారించడానికి బస్సుల కోసం కొత్త ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్‌ను సృష్టించిన తరువాత త్వరలో మేము వారి బ్రేక్ పరీక్షలను టార్డియో ఆర్టీఓలో నిర్వహిస్తాము అని తెలియజేసారు.

Most Read Articles

English summary
Mumbai: Zero waiting time for licence tests at 3 RTOs from today-Read in Telugu
Story first published: Monday, December 23, 2019, 12:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X