చెన్నై ప్లాంటును మూసివేయనున్న క్యాస్ట్రాల్ ఇండియా

Castrol India
ప్రముఖ చమురు తయారీ మరియు మార్కెటింగ్ సంస్థ క్యాస్ట్రాల్ ఇండియా చెన్నైలోని తొండియార్ పేట్‌లో ఉన్న తమ ప్లాంటును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గడచిన కొద్ది నెలలుగా ప్రతి లీటరుపై ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిందని, ఫలితంగా జులై 31వ తేదీ నుంచి ప్లాంటును మూసివేసి ఉత్పత్తి కార్యకలాపాలను కూడా నిలిపివేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

క్యాస్ట్రాల్ ఇండియా కంపెనీకు దేశంలో ఉన్న ప్లాంట్‌లలో కెల్లా తొండియార్ పేట్ ప్లాంట్ చాలా పాతది. ఈ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్న సందర్భంగా, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్(వీఆర్ఎస్)ను ఆఫర్ చేసింది. ఈ పథకం కింద ఉద్యోగులు ప్రత్యేక బెనిఫిట్లను పొందవచ్చు. పారిశ్రామిక మరియు ఆటోమోటివ్ రంగానికి అవసరమయ్యే లూబ్రికెంట్ ఆయిల్స్‌ను కంపెనీ ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తుంది.

Most Read Articles

English summary
Castrol India, the oil manufacturing and marketing company has stated that the company will be closing its plant located at the Tondiarpet in Chennai in the state of Tamil Nadu. The Tondiarpet plant was faced with a situation of high landed cost of base oil leading to a steep increase in its manufacturing cost per litre over the past several months.
Story first published: Saturday, July 16, 2011, 15:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X