సరికొత్త లుక్, డిజైన్‌తో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ క్రోమ్ 500

Classic Crome 500
ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ నేడు దేశీయ విపణిలోకి రెండు సరికొత్త మోడళ్లను విడుదల చేసింది. 'క్లాసిక్ క్రోమ్ 500', 'డెసెర్ట్ స్ట్రోమ్ 500' వేరియంట్లను కంపెనీ ముంబైలో ఆవిష్కరించింది. క్లాసిక్ క్రోమ్ 500లో ఉపయోగించిన 499 సీసీ, సింగిల్ సిలిండర్ యూసిఈ ఇంజన్ 27.2 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 41.3 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంకా ఇందులో క్రోమ్ కోటెడ్ ఫ్రంట్, రియర్ మడ్‌గార్డ్, 280 ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ప్రాచీన రోజులను గుర్తు తెచ్చేలా డిజైన్ చేసిన గ్రాఫిక్స్, క్రోమ్ ఫ్యూయెల్ ట్యాంక్, క్లాసిక్ డిజైన్‌తో కూడిన క్రోమ్ టూల్‌బాక్స్, విశిష్టమైన స్ప్రింగ్ సీట్ (ఈ మోడల్‌కు మాత్రమే ప్రత్యేకం)లు సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ క్రోమ్ 500 సీసీ మోటార్ సైకిల్ యొక్క ప్రధాన ఫీచర్లు. మరిన్ని ఇతర అదపు ఫీచర్లు మా వన్ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా...:

సాంకేతిక వివరాలు:

ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్

ఇంజన్ సామర్థ్యం - 499cc

బోర్ x స్ట్రోక్ - 84 ఎమ్ఎమ్ x 90 ఎమ్ఎమ్

కంప్రెషన్ రేషియ - 8.5 : 1

గరిష్ట శక్తి - 27.2 బిహెచ్‌పి @ 5250 ఆర్‌పిఎమ్

గరిష్ట టార్క్ - 41.3 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్

ఇగ్నిషన్ సిస్టమ్ - డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్

క్లచ్ - వెట్, మల్టీ-ప్లేట్

గేర్‌బాక్స - 5 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్

లూబ్రికెంట్ - వెట్ సంప్

ఇంజన్ ఆయిల - 5 W 50 API, SL Grade JASO MA

ఫ్యూయెల్ సప్లయ్ - కీహిన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్

ఎయిర్ క్లీనర్ - పేరపర్ ఎలిమెంట్

ఇంజన్ స్టార్ట్ - ఎలక్ట్రిక్ / కిక్

ఛాస్సిస్, సస్పెన్షన్:

టైప్ - సింగిల్, డౌన్‌ట్యూబ్

ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్, 355 ఎమ్ఎమ్ ఫోర్క్స్, 130 ఎమ్ఎమ్ ట్రావెల్

వెనుక సస్పెన్షన్ - 5-స్టెప్ అడ్జస్టబల్ ప్రీలోడ్‌తో కూడిన ట్విన్ గ్యాస్ చార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్, 80 ఎమ్ఎమ్ ట్రావెల్

బ్రేకులు, టైర్లు

ముందు టైర్ - 90/90 - 18

వెనుక టైర్ - 110/80 - 18

ముందు బ్రేక్ - 280 ఎమ్ఎమ్ డిస్క్, 2-పిస్టన్ కాలిపర్

వెనుక బ్రేక్ - 153 ఎమ్ఎమ్ డ్రమ్, సింగిల్ లీడ్ ఇంటర్నల్ ఎక్స్‌పాండిగ్

కొలతలు

వీల్‌బేస్ - 1370 ఎమ్ఎమ్

గ్రౌండ్ క్లియరెన్స్ - 135 ఎమ్ఎమ్

పొడవు - 2160 ఎమ్ఎమ్

వెడల్పు - 800 ఎమ్ఎమ్

ఎత్తు - 1050 ఎమ్ఎమ్

బరువు - 187 కేజీలు (90 శాతం ఇంధనం, ఆయిల్‌తో కలిపి)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 14.5 లీటర్లు

ఎలక్ట్రికల్స్:

ఎలక్ట్రికల్ సిస్టమ్ - 12 volt - DC

బ్యాటరీ - 12 volt, 14 Ah

హెడ్ ల్యాంప్ - 60 W / 55 W, హ్యాలోజెన్

ధర:

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ క్రోమ్ 500 ఎక్స్-షోరూమ్ (ముంబై) ధర రూ.1,50,659/-

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ క్రోమ్ 500 ఆన్-రోడ్ (ముంబై) ధర రూ.1,65,400/-

Most Read Articles

English summary
The style quotient of leisure bikes in India just went up notches. Adding panache are two unique, new bikes from Royal Enfield- the Classic Chrome and Desert Storm. With their distinctive styling, drop dead gorgeous looks and a performance to match, both these bikes are poised to be trendsetters on the Indian roads.
Story first published: Thursday, September 29, 2011, 16:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X