350 కోట్ల పెట్టుబడితో చెన్నైలో ఎన్‌ఫీల్డ్‌ రెండవ ప్లాంట్‌

Royal Enfield
చెన్నై: భారత్‌లో ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాల్లో ఒకటైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా చెన్నై సమీపంలోని ఓరగాండం వద్ద మరో భారీ ప్లాంట్‌ నిర్మించేందుకు సాన్నాహాలు చేస్తోంది. ఐషర్‌ మోటార్స్‌ సిఈఓ మరియు మేనేజింగ్‌ డైరెక్ట్టర్‌ సిద్దార్ధ్‌ లాల్‌ ప్లాంట్‌ నిర్మాణ విశేషాలను మీడియాకు వెల్లడిస్తూ, సిప్‌కో ఇండ స్ట్రియల్‌ పార్కులో కేటాయించిన 50 ఎకరాల స్ధలంలో తమ ప్లాంట్‌ నిర్మాణానికి వీలుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్ధలాన్ని కేటాయించారని తెలిపారు.

స్ధల కేటాయింపు జరిపినట్లు ఇప్పటికే ప్రభుత్వం తమకి లేఖ రాసిందని స్ధలం తమ సాధీనంలోకి వచ్చిన మరుక్షణమే ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి 2013 నాటికి సాలినా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసాలా రూపొందించ నున్నామన్నారు. ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభిస్తే... ఇప్పటికే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కోసం వాడకం దారుల వేచి ఉంటున్న సమయాన్ని పూర్తిగా తగించేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. 350 కోట్ల పెట్టుబడులతో పెడుతున్న ఈ ప్లాంట్‌ వల్ల కనీసం 900 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, మరి కొత్త కొత్త ఉత్పత్తులపైనా దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందన్నారు.

గత ఏడాది 53,000 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటర్‌ సైకిళ్లను అమ్మకం కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 70,000 పైచిలుకే అమ్ముడు పోతాయని అంచనాలో ఉన్నామని చెప్పారు సిద్దార్ధ్‌ లాల్‌.

Most Read Articles

English summary
As per reports, Eicher Motors has recently announced that its two-wheeler segment Royal Enfield will establish a new manufacturing plant in Oragadam near Chennai, with an initial set-up capacity of 1.5 lakh units per annum by March 2013.
Story first published: Sunday, July 24, 2011, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X