మందుకొట్టి కారు నడపాలనుకుంటే మొరాయించే కారు..!!

Drunken Driving
ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతున్నారా.. అయితే మీరు పోలీసులకన్నా ముందు మీ కారుకే దొరికిపోతారు. అదెలా అనుకుంటున్నారా..? మానవుడు అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యం కానిది ఎముంటుంది చెప్పండి, అలాగే ఇది సాధ్యం. ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేయడం ద్వారా యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది తమ విలువైన జీవితాలను కోల్పోతున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ విధంగా మరణించే వారి సంఖ్యను తగ్గించేందుకు పరిశోధకులు నడుం బిగించి, ఆ దిశగా తమ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ పరిశోధనలకు ఫలితమే ఈ "డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్".

మద్యం సేవించి కారు నడిపినపుడు ప్రమాదాలు జరిగి మనుషుల మరణించకుండా ఉండేదుకు పరిశోధకులు ఈ వ్యవస్థను రూపొందించారు. ఇందులో కారు నడిపే డ్రైవర్ రక్తంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందనే విషయాన్ని కారులో అమర్చబడిన సాంకేతిక వ్యవస్థ గుర్తించి తదునుగుణంగా ఆదేశాలు చేయడం జరుగుతుంది. ఇందులో రెండు పద్దతుల ద్వారా డ్రైవర్ సేవించిన ఆల్కహాల్ శాతాన్ని గుర్తించడం జరుగుతుంది. అందులో ఒకటి శ్వాస, మరొకటి చర్మం. స్టీరింగ్ చక్రాలకు, డోర్ లాక్‌లకు అమర్చబడిన 'టచ్ సెన్సార్ల' ద్వారా ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ విధంగా సదరు డ్రైవర్ సేవించిన ఆల్కహాలు శాతాన్ని కారు గుర్తిస్తుంది. డ్రైవర్ ఆల్కహాల్ శాతం 0.08 కంటే ఎక్కువగా ఉంటే డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాదు. ఈ టెక్నాలజీని క్వినెటిక్యూ నార్త్ అమెరికా కంపెనీకి చెందిన ఆర్ అండి డి విభాగం రూపొందిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. కార్ల తయారీదారులకు ఇది ఆప్షనల్, వారు కావాలనుకుంటే ఈ సదుపాయాన్ని వినియోగించు కోవచ్చు. కోర్టు ఆర్డరు ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న బ్రీత్ అనలైజర్ (శ్వాస పరిశీలన) సిస్టమ్ కన్నా ఇది చాలా అడ్వాన్స్‌డ్ సిస్టమ్. పూర్తిగా ఆటోమేటిక్ టెక్నాలజీతో రూపొందించబడింది. కేవలం సెకన్లలో ఆల్కహాల్ శాతం తెలిసిపోతుంది.

ఈ విధానాన్ని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, ఆటోమోటివ్ కొలైషన్ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీల అనుమతితో 2008లో పరిశోధకులు ప్రారంభించారు. దీనిపై మరో రెండేళ్లపాటు పరిశోధనలు జరగనున్నాయి. ఇటీవలే అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా రవాణ కార్యదర్శి రే లాహుడ్ ఆధ్యర్వంలో క్వినెటిక్యూ ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ ద్వారా అమెరికాలో ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేయడం వలన జరిగే దాదాపు 9,000 ప్రమాదాలను నివారించవచ్చనని కంపెనీ ఉన్నాతాధి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రావడనికి మరో ఎనినిదేళ్ల వరకూ సమయం పట్టవచ్చు.

Most Read Articles

Story first published: Tuesday, February 1, 2011, 12:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X