సుజుకి యాక్సెస్, స్విష్‌లకు వెయింటిగ్ పీరియడ్ లేదు

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ స్కూటర్స్ సుజుకి యాక్సెస్, సుజుకి స్విష్‌ల కోసం ఇప్పుడు కస్టమర్లు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. డీలరును బట్టి, సుజుకి ఈ రెండు మోడళ్లను ఒక్క రోజును నుండి 10 రోజుల వెయిటింగ్ పీరియడ్‌లోపే కస్టమర్ల చేతికి అందుతున్నాయి.

ఇటీవల మా డ్రైవ్ స్పార్క్ ప్రతినిధి ఓ స్థానిక డీలరును సంప్రదించగా, క్యాష్ పేమెంట్ ద్వారా ఈ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకై స్పాట్‌లోనే డెలివరీ చేస్తామని, లోన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకై లోన్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తక్షణమే డెలివరీ చేస్తామని పేర్కొన్నారు.

వాస్తవానికి, ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, దీనికి తోడు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మందగించాయి. దీంతో డీలర్ల వద్ద స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉంది. ఈ స్కూటర్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సుజుకి యాక్సెస్:
సుజుకి యాక్సెస్ స్కూటర్ విషయానికి వస్తే... ఇది ఇటు యువకులను అటు మధ్య వయస్కులను టార్గెట్ చేస్తూ, హోండా యాక్టివా పోటీగా కంపెనీ విడుదల చేయటం జరిగింది. ఇందులో ఉపయోగించిన 125సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఓహెచ్‌సి ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆటోమేటిక్ స్కూటర్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది. హైదరాబాద్‌లో సుజుకి యాక్సిస్ ధర రూ.54,673 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

సుజుకి స్విష్:
యాక్సెస్ కన్నా స్టయిలిష్ స్కూటర్‌ను కోరుకునే కస్టమర్లును దృష్టిలో ఉంచుకొని సుజుకి అందిస్తున్న స్విష్ 125ససీసీ స్కూటర్‌ను సుజుకి యాక్సెస్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. సుజుకి యాక్సెస్‌లో ఉపయోగించిన 125సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఓహెచ్‌సి ఇంజన్‌నే సుజుకి స్విష్‌లో కూడా ఉపయోగించారురు. హైదరాబాద్‌లో సుజుకి స్విష్ ధర రూ.55,828 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
The waiting period of India's best selling 125cc scooter, the Suzuki Access will no longer be a concern as Suzuki has increased production. Another 125cc scooter from Suzuki, the Swish 125 will also not have much of a waiting period.
Story first published: Monday, September 17, 2012, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X