బిఎమ్‌డబ్ల్యూతో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చర్చలు

చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, జర్మనీకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు చేతులు కలపనున్నాయి. బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన తయారీ విభాగం 'బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్'తో కలిసి టీవీఎస్ ఇండియన్ మార్కెట్ కోసం సూపర్‌బైక్‌లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.


బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని హై-ఎండ్ మోటార్‌సైకిళ్లను తయారు చేయాలని టీవీఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ షేరు సోమవారం నాడు బీఎస్‌ఈలో ఏకంగా 8 శాతానికి ఎగబాకింది. స్టాక్‌ మార్కెట్‌లో ప్రారంభంలో నష్టాలతో మొదలైన ఈ షేరు ఈ వార్త వెలువడగానే 7.78 శాతం పెరిగి రూ.39.45 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 7.77 శాతం పెరిగి రూ.39.50 వద్ద ముగిసింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్‌ఈకి ఈ సమాచారాన్ని అందించింది. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ సాంకేతిక పరిజ్ఞానంతో మోటారుసైకిళ్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయాలు జరగలేదని, ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో కంపెనీలు సవాలుగా సరికొత్త మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టేందుకు జర్మన్ టెక్నాలజీని వాడుకోవాలని టీవీఎస్ భావిస్తోంది.

Most Read Articles

English summary
German based super bike manufacturer BMW Mottarad and Chennai based TVS Motor Company may join hands for developing superbikes in India. Presently both firm are talk in this regard. TVS may source the technology from BMW Mottarad for manufacturing high-end motorcycles.
Story first published: Tuesday, July 10, 2012, 13:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X