ఓరగడం ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్

By Ravi

ఐషర్ గ్రూపుకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమిళనాడులోని ఓరగడం వద్ద తమ రెండవ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో విభిన్న కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన మొట్టమొదటి మోటార్‌సైకిల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లోకి విడుదల చేసింది.

తొలి దశలో భాగంగా ఈ ప్లాంట్ కోసం కంపెనీ రూ. 150 కోట్లను పెట్టుబడిగా వెచ్చించింది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నుంచి తొలి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సందర్భంగా ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్దార్థ్ లాల్ మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా ఈ ప్లాంట్‌లో ట్రైల్ ప్రొడక్షన్‌ను నిర్వహిస్తున్నామని, రికార్డ్ సమయం (11 నెలల్లోనే)లో ఈ ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన చెప్పారు.

ప్రారంభంలో భాగంగా, సాలీనా ఈ ప్లాంటు 1.50 లక్షల మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 1.75 లక్షలకు పెంచుతామని ఆయన అన్నారు. రెండవ దశలో భాగంగా 2014లో ఏటా 2.50 లక్షల మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయాలననే లక్ష్యంతో ఉన్నామని సిద్దార్థ్ లాల్ తెలిపారు. ఈ కొత్త ప్లాంటులో డిసెర్ట్ స్టోర్మ్, థంజర్‌‌బర్డ్ 350సీసీ, థంజర్‌‌బర్డ్ 500సీసీ మోడళ్లను ఉత్పత్తి చేయనున్నారు.

Royal Enfield Bullet
Most Read Articles

English summary
Royal Enfield rolled out its first bike from its second manufacturing facility in the country at Oragadam. The company has invested Rs 150 crore for first phase of the facility spread on a 50 acre land, situated 45 km from Chennai.
Story first published: Tuesday, April 30, 2013, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X